iDreamPost
android-app
ios-app

ఆ హీరోల పేర్లు చెప్పి అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి

  • Author ajaykrishna Updated - 01:14 PM, Wed - 13 September 23
  • Author ajaykrishna Updated - 01:14 PM, Wed - 13 September 23
ఆ హీరోల పేర్లు చెప్పి అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి

ఇండస్ట్రీలో నటులకు, దర్శకులకు మధ్య అప్పుడప్పుడు కొన్ని అబద్దంతో కూడిన సందర్భాలు జరుగుతుంటాయి. నటులను ప్రోత్సాహించడానికి.. వాళ్లను సినిమాలో మరింతగా ఇన్వాల్వ్ చేయడానికి దర్శకులు కొన్ని అబద్దాలు కూడా చెబుతుంటారు. అలా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ విషయంలో తాను మోసపోయానని అంటోంది నటి ప్రియమణి. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్స్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ భామ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతోంది. పెళ్లి తర్వాత హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది ప్రియమణి.

ఇక షారుఖ్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. జవాన్ లో ప్రియమణి ఓ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ కు సంబంధించి ఆరుగురు అమ్మాయిలతో ఓ టీమ్ ఉంటుంది. ఆ టీమ్ లో ఒకరిగా ప్రియమణి మెరిసింది. కాగా.. ఇప్పుడు సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ కూడా కొల్లగొడుతోంది. కాగా.. జవాన్ కి సంబంధించి కొన్ని విషయాలు మీడియాతో షేర్ చేసుకుంది ప్రియమణి. ఆమె మాట్లాడుతూ.. జవాన్ లో అవకాశం వచ్చినప్పుడు ఏదో క్యామియో రోల్ అయ్యుంటుందని అనుకున్నాను. కానీ.. షారుఖ్ టీమ్ లో కీలకపాత్ర అని తెలిసి ఆనందించాను. దానికి డైరెక్టర్ అట్లీ అని తెలిసి ఓకే అనేశాను.

జవాన్ విషయంలో అట్లీ నన్ను చీట్ చేశాడు. నేను జవాన్ లో నటిస్తున్నానని తెలిసి చాలామంది ఐటమ్ సాంగ్ కోసమని ప్రచారం చేశారు. కానీ.. నేను పట్టించుకోలేదు. అయితే.. జవాన్ తమిళ వెర్షన్ లో దళపతి విజయ్.. తెలుగు వెర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని టాక్ వినిపించింది. దీంతో నేను అట్లీ దగ్గరికి వెళ్లి.. విజయ్ తో ఒక్క సీన్ అయినా చేస్తానని కోరాను. దానికి ఓకే చెప్పి.. సినిమా చివరి దాక అట్లీ అలా చెబుతూ వచ్చాడని ప్రియమణి చెప్పుకొచ్చింది. ఆఖరికి వారిద్దరూ సినిమాలో నటించలేదు. ఇదిలా ఉండగా.. జవాన్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఆదరగొడుతుంది. మరి ప్రియమణి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al