iDreamPost

45 ఏళ్ల ఏజ్ లో నటుడి పెళ్లి.. వైరల్ అవుతున్న శుభలేఖ!

45 ఏళ్ల వయసులో ఓ నటుడు బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ పలికి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. మరి ఈ ఏజ్ లో పెళ్లిపీటలెక్కబోతున్న ఆ సెలబ్రిటీ ఎవరు? ఆ వివరాలు..

45 ఏళ్ల వయసులో ఓ నటుడు బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ పలికి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. మరి ఈ ఏజ్ లో పెళ్లిపీటలెక్కబోతున్న ఆ సెలబ్రిటీ ఎవరు? ఆ వివరాలు..

45 ఏళ్ల ఏజ్ లో నటుడి పెళ్లి.. వైరల్ అవుతున్న శుభలేఖ!

కక్కొచ్చినా.. కళ్యాణమెుచ్చినా ఆగదంటారు పెద్దలు. అది ఏ ఏజ్ లో అయినా సరే. ఇక కొంత మంది సెలబ్రిటీలు తమ కెరీర్ మీద దృష్టిపెట్టడం కారణంగానో.. లేదా ఇతర పర్సనల్ రీజన్స్ వల్లనో మ్యారేజ్ ఏజ్ దాటిపోతున్నాగానీ పెళ్లి చేసుకోరు. తాజాగా ఓ  ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త వైరల్ గా మారింది. అతడి పెళ్లి కార్డు సైతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. 45 ఏళ్ల వయసులో ఆ నటుడు బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ పలికి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. మరి ఆ సెలబ్రిటీ ఎవరు? తెలుసుకుందాం పదండి.

ప్రేమ్ జీ అమరన్.. నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. 45 సంవత్సరాల వయసున్న ప్రేమ్ జీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. తాజాగా తన సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డ్ ఇచ్చి.. ఫ్యామిలీ లైఫ్ కు స్వాగతం పలకనున్నాడు. ఇతడి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 9న తమిళనాడు లోని తిరువళ్లూరు జిల్లాలోని తిరువత్తని ఆలయంలో పెళ్లి జరగనున్నట్లు ఆ శుభలేఖలో రాసుంది. అయితే ఈ కార్డుపై ఇప్పటి వరకు ప్రేమ్ జీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దాంతో ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కానీ అతడి అభిమానులు మాత్రం ఇది నిజమేనని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో తాను వివాహ బంధంలోకి అడుగుపెడతానని జనవరిలోనే ట్వీట్ చేశాడు. దాంతో ఇది నిజమైన శుభలేఖే అని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రేమ్ జీ సోదరుడు డైరెక్టర్ వెంకట్ ప్రభు తీసిన అన్ని సినిమాల్లో ఇతడు నటించాడు. కస్టడీ, ప్రిన్స్ మూవీలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు ప్రేమ్ జీ. ఇతడు నటించిన ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. మరి ఈ పెళ్లి నిజమో? కాదో? తెలియాలంటే.. జూన్ 9 వరకు ఆగాల్సిందే.

Premgi amaren marriage card

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి