iDreamPost

Salaar: ‘సలార్’ కోసం రాజమౌళిలా ఆలోచించిన ప్రశాంత్ నీల్! ట్రైలర్ గమనించారా?

  • Author singhj Published - 09:16 PM, Fri - 1 December 23

‘సలార్’ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. అయితే ఇందులో కొన్ని విషయాలను గమనిస్తే దర్శకధీరుడు రాజమౌళిలాగే ప్రశాంత్ నీల్ ఆలోచించారని అర్థమవుతుంది.

‘సలార్’ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. అయితే ఇందులో కొన్ని విషయాలను గమనిస్తే దర్శకధీరుడు రాజమౌళిలాగే ప్రశాంత్ నీల్ ఆలోచించారని అర్థమవుతుంది.

  • Author singhj Published - 09:16 PM, Fri - 1 December 23
Salaar: ‘సలార్’ కోసం రాజమౌళిలా ఆలోచించిన ప్రశాంత్ నీల్! ట్రైలర్ గమనించారా?

రెబల్ స్టార్ ప్రభాస్​ అభిమానులతో పాటు సాధారణ మూవీ లవర్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన ‘సలార్ పార్ట్ 1-సీజ్​ఫైర్’ ట్రైలర్ వచ్చేసింది. డిసెంబర్ 22వ తేదీన మూవీని వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ చేయనున్న సందర్భంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్​ను తీసుకొచ్చింది. తెలుగు, కన్నడ, హిందీతో పాటు మరో రెండు భాషల్లో ఈ ట్రైలర్ సందడి చేస్తోంది. ఇందులో హీరో ఎలివేషన్స్​, యాక్షన్ సీక్వెన్స్​, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్.. ఇలా ప్రతిదీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మార్క్​కు, అంచనాలకు తగ్గట్లే ఉంది. 3 నిమిషాల 47 సెకన్ల డ్యురేషన్ ఉన్న ఈ ట్రైలర్ ఫిల్మ్​పై మరింతగా ఎక్స్​పెక్టేషన్స్​ను పెంచడం ఖాయమనిపిస్తోంది.

‘సలార్’ ట్రైలర్ యూట్యూబ్​లోకి వచ్చిన 15 నిమిషాల్లోనే 17 లక్షల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. బద్ద శత్రువులుగా మారే ఇద్దరు ప్రాణ స్నేహితుల స్టోరీతో ‘సలార్’ను రెండు పార్ట్​లుగా రూపొందిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇందులో ప్రభాస్​ సరసన హీరోయిన్​గా శ్రుతిహాసన్ నటించారు. మయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్​గా నటిస్తున్న ఈ సినిమాలో డైరెక్టర్ టినూ ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్​లో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ గూస్​బంప్స్ తెప్పిస్తున్నాయి. ‘పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. బయటకు ఎవడు పోతాడని కాదు.. లోపలకు ఎవడు వస్తాడని’ అంటూ రెబల్ స్టార్ చెప్పిన పవర్​ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ ఆఖర్లో చేతులకు సంకెళ్లతో ప్రభాస్ కూర్చొని ఉన్న ఇంటెన్స్ లుక్ కూడా అట్రాక్టివ్​గా ఉంది. రెండు చేతుల్లోనూ కత్తులతో ఫైట్ చేస్తూ కైండ్లీ రిక్వెస్ట్ అంటూ వార్నింగ్ ఇవ్వడం కూడా బాగుంది. అయితే ట్రైలర్​లో పృథ్వీరాజ్​కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. ఫస్టాఫ్ మొత్తం ఆయనే కనిపించారు. గన్స్ పేలుస్తూ, డైలాగ్స్ చెబుతూ చాలా ఇంటెన్స్​గా కనిపించారు. కానీ సెకండాఫ్​లో ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ తన స్క్రీన్ ప్రెజెన్స్​తో ఫుల్ మార్క్స్ వేయించుకున్నారు. హీరోయిన్ శ్రుతి హాసన్ కేవలం సింగిల్ ఫ్రేమ్​లో కనిపించారు. అయితే ‘సలార్’ ట్రైలర్​లో కొన్ని విషయాలను గమనిస్తే నీల్ మామ రాజమౌళిలా ఆలోచించినట్లు అర్థమవుతుంది.

‘సలార్’ ట్రైలర్​లో ఎలాంటి ఎలివేషన్స్ లేవు. దేవా (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్) స్నేహం గురించి చెబుతూ ట్రైలర్ మొదలవుతుంది. వరదరాజ కోసం ప్రాణాలు ఇచ్చేందుకూ తాను రెడీ అంటూ దూరమయ్యేటప్పుడు మాట ఇస్తాడు దేవా. ఈ మాటను అవసరమైనప్పుడు ఆఖర్లో ఎలా నిలబెట్టాడు? స్నేహితుడి కోసం దేవా ఎలా యుద్ధం చేశాడు? అనేదే కథ అని మొదట్లోనే చెప్పేశాడు నీల్ మామ. స్టోరీకి సంబంధించి ఏదీ దాచి పెట్టలేదు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య బాండింగ్.. దాని కోసం వాళ్లు నిలబడే తీరు అంతా చూపించేశారు. అయితే ఈ క్రమంలో వాళ్ల మధ్య ఉండే ఎమోషన్స్​ను మాత్రం బలంగా ప్రొజెక్ట్ చేశారు.

ఫైట్స్, బిల్డప్ షాట్స్ ఎక్కువ లేకుండా కథ చెప్పడం మీదే ఫోకస్ చేశారు. నో ఎలివేషన్స్.. ఓన్లీ ఎమోషన్స్ అనేలా ఉందీ ట్రైలర్. ‘బాహుబలి’ కోసం దర్శకధీరుడు రాజమౌళి ఇదే కాన్సెప్ట్​ను ఫాలో అయ్యారు. ఇద్దరు సోదరుల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీనే ఆ మూవీ అని ట్రైలర్​లో చెప్పారు. దీంతో ప్రేక్షకులు ముందే ఫిక్స్ అయి వచ్చారు. సినిమాలోనూ అవే ఉండటంతో హ్యాపీగా ఫీలయ్యారు. ఇప్పుడు నీల్ మామ కూడా అదే మంత్రాన్ని ఫాలో అయ్యాడు. తన మూవీ అంటే అందరూ ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ ఉంటాయని అనుకుంటారని ముందే తెలుసుకున్నాడు. కానీ ‘సలార్’ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ అని ఆడియెన్స్​కు క్లియర్​గా చెప్పాలనే ఉద్దేశంతో రాజమౌళిలా ట్రైలర్​ను కట్ చేశాడు. సినిమాలో రాజమౌళి టచ్ స్పష్టంగా కనిపించింది. మరి.. ‘సలార్’ ట్రైలర్ విషయంలో జక్కన్నను ప్రశాంత్ నీల్ ఫాలో అవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Mohini: ‘ఆదిత్య 369’ హీరోయిన్‌ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి