iDreamPost

Salaar: సలార్ ట్రైలర్ రివ్యూ! 3 నిమిషాల మాస్ జాతర ఇది!

  • Author singhj Updated - 07:51 PM, Fri - 1 December 23

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న మోస్ట్ అవేటింగ్ మూవీ ‘సలార్’ నుంచి ఎట్టకేలకు ట్రైలర్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న మోస్ట్ అవేటింగ్ మూవీ ‘సలార్’ నుంచి ఎట్టకేలకు ట్రైలర్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Updated - 07:51 PM, Fri - 1 December 23
Salaar: సలార్ ట్రైలర్ రివ్యూ! 3 నిమిషాల మాస్ జాతర ఇది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తోందనగానే ఎక్స్​పెక్టేషన్స్ ఏ రేంజ్​లో ఉంటాయో స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ సిరీస్​తో దేశవ్యాప్తంగా సూపర్ స్టార్​డమ్ సంపాదించాడు డార్లింగ్. అయితే జక్కన్న మూవీ తర్వాత మళ్లీ ఆయనకు ఆ రేంజ్ హిట్ పడలేదు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ అంటూ డిఫరెంట్ స్టోరీస్​ను ఎంచుకుంటూ ఆడియెన్స్​ను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ‘సాహో’ కమర్షియల్​గా హిందీలో వర్కవుట్ అయింది. ‘ఆదిపురుష్’ కూడా నార్త్ బెల్ట్​లో భారీగా వసూళ్లు రాబట్టింది. కానీ ఈ రెండు చిత్రాలు తెలుగు నాట అంతగా పెర్ఫార్మ్ చేయలేదు. ‘ఆదిపురుష్’ అయితే బోలెడు విమర్శల్ని మూటగట్టుకుంది. దీంతో తన నెక్స్ట్ మూవీతో ఫ్యాన్స్​ను, ఆడియెన్స్​ను ఎలాగైనా ఆకట్టుకోవాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యారు.

బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ తన తర్వాతి చిత్రం కోసం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్​తో కలిశారు. ‘కేజీఎఫ్​’ సిరీస్​తో భారీ హిట్ అందుకున్న నీల్ మామ.. పాన్ ఇండియా రేంజ్​లో పాపులారిటీ సంపాదించారు. దీంతో వీళ్లిద్దరి కలయికలో వస్తున్న ‘సలార్’ మూవీపై భారీ ఎక్స్​పెక్టేషన్స్ నెలకొన్నాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో డిసెంబర్​కు మూవీని పోస్ట్​ పోన్ చేశారు. రిలీజ్​కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ ‘సలార్’ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అంటూ పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తి ఎదురు చూడసాగారు. దీంతో ప్రభాస్ మూవీ ట్రైలర్ మోస్ట్ అవేటెడ్ అయిపోయింది.

‘సలార్’ టీజర్ ఇచ్చిన దాని కంటే ట్రైలర్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్​కు ముందు వాళ్ల ఎక్స్​పెక్టేషన్స్ మరింత పెంచేశారు చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్. దీనికి సంబంధించి రెబల్ స్టార్ అభిమానులకు ఆయన స్ట్రైకింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ‘సలార్’ ట్రైలర్ కట్ చూశాక అదిరిపోయిందటూ డబుల్ థంబ్స్ అప్ సింబల్స్​తో ఎగ్జయిటింగ్ అప్​డేట్ ఇచ్చారు కిరగందూర్. దీంతో ట్రైలర్ మీద అంచనాలు నెక్స్ట్ లెవల్​కు చేరుకున్నాయి.

ఇవాళ సాయంత్రం రిలీజైన ‘సలార్’ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంది. దీని రివ్యూ చెప్పాలంటే ఇది మూడో నిమిషాల మాస్ జాతర అనొచ్చు. 3 నిమిషాల 47 సెకన్ల పాటు సాగే ఈ ట్రైలర్​లో ‘సలార్’ వరల్డ్ ఎలా ఉండబోతోంది, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్స్ ఎంత వయోలెంట్​గా ఉండబోతున్నాయో​ చూపించారు ప్రశాంత్ నీల్. ఖాన్సార్ అనే సిటీపై ఆధిపత్యం కోసం జరిగే పోరాటంగా కథ ఉండబోతోందని హింట్ ఇచ్చారు. కైండ్లీ రిక్వెస్ట్ అంటూ ట్రైలర్ ఆఖర్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్ వేరే లెవల్లో ఉంది. కత్తులు తిప్పుకుంటూ ఆయన చేసిన ఫైట్స్ ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఇక, విజువల్స్, బ్యాగ్రౌండ్​ మ్యూజిక్​తోనే గూస్​బంప్స్ తెప్పించారు. ట్రైలరే ఈ లెవల్లో ఉంటే ఇంక మూవీ ఏ రేంజ్​లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ‘సలార్’ ట్రైలర్​లో డైలాగ్స్​తోనే గూస్​బంప్స్ రావడం పక్కా. ఇందులో ప్రభాస్​తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు చెప్పిన కొన్ని సంభాషణలు అదిరిపోయాయి.

దేవా (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్) చిన్నప్పటి క్యారెక్టర్స్​ మధ్య ఓ డైలాగ్​తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా.. నీ ఒక్కడి కోసం’ అనే ఆ డైలాగ్ వాళ్లిద్దరి స్నేహం గురించి తెలియజేస్తుంది. బందిపోట్ల కోట అయిన ఖాన్సార్ సిటీపై పెత్తనానికి కుర్చీ కోసం కుతంత్రాలు జరుగుతాయంటూ చూపించారు. ‘మన రక్తంలోనే వయొలెన్స్ ఉంది’ అని జగపతి బాబుతో చెప్పించారు. ప్రభాస్ ఎంట్రీ నుంచి ట్రైలర్ నెక్స్ట్ లెవల్​కు వెళ్లిపోయింది. ‘పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. బయటకు ఎవడు పోతాడని కాదు.. లోపలకు ఎవడు వస్తాడని’ అని ఆయన చెప్పిన పవర్​ఫుల్ డైలాగ్ హైలైట్ అనే చెప్పాలి. ఆఖర్లో చేతులకు సంకెళ్లతో కనిపించిన రెబల్ స్టార్.. ‘ఈడ్నెవడూ ముట్టుకోకూడదు.. కైండ్లీ రిక్వెస్ట్’ అంటూ చెప్పిన డైలాగ్ కూడా బాగుంది. ఈ ట్రైలర్​ మొత్తంలో పృథ్వీరాజ్​కు ఎక్కువ స్పేస్ లభించింది. కానీ సెకండాఫ్​లో వచ్చిన ప్రభాస్.. తన స్క్రీన్ ప్రెజెన్స్​తో డామినేట్ చేశారు. హీరోయిన్ శృతి హాసన్​ అయితే ఒకే ఫ్రేమ్​లో కనిపించారు. మరి.. ‘సలార్’ ట్రైలర్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నాని గ్యాంగ్ లీడర్‌లోని ఈ అమ్మాయిని.. ఇప్పుడు చూస్తే మతి పోవడం ఖాయం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి