iDreamPost

Kalki 2898 AD Trailer Release Date: ప్రభాస్ కల్కి ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే…

  • Published Mar 03, 2024 | 4:20 PMUpdated Mar 03, 2024 | 4:20 PM

Kalki 2898 AD Trailer Release Date: యంగ్ రెబల్ స్టార్ సలార్ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. ఆయన తదుపరి చిత్రం 'కల్కి 2898 AD'ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ కి సంబంధించి అప్ డేట్ వచ్చింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 AD’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో దీపికా పదుకునే  హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్, కాన్సెప్ట్ ల గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ డిటైల్స్ తో ఇప్పటికే అభిమానుల్లో భారీ బజ్ ఏర్పడింది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ పై ప్రభాస్ అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వారందరికీ కల్కి యూనిట్ ఒక శుభవార్త ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

ఏప్రిల్ మొదటి వారంలో ‘కల్కి 2898 AD’ ట్రైలర్ రాబోతుందని ప్రచారం జరుగుతుండటంతో చిత్ర బృందం నుంచి అఫిషియల్ కన్ఫర్మేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మరి కొద్ది రోజుల్లో వైజయంతి మూవీస్ నుంచి ట్రైలర్ కు సంబంధించిన ప్రకటన రావచ్చని టాక్. అదే గనక నిజమైతే సినిమాలోని హైలైట్స్ అన్నీ అందులో ఉండేలా చూస్తే మంచిదని సినీ ప్రేమికులు అంటున్నారు. మరి సినిమాకి క్రేజ్ రావాలంటే ఖచ్చితంగా ట్రైలర్ వర్కవుట్ అవ్వాల్సిందే.

ప్రభాస్, దీపికలతో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిషా పటానీ, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అలాగే నాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ కూడా అతిథి పాత్రల్లో కనిపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సగర్వంగా నిర్మిస్తోంది. 2024 మే 9న పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఈ వేసవిలో విడుదలవుతున్న ఒకే ఒక్క పెద్ద సినిమా కావడంతో ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి