iDreamPost

Kalki 2898 AD: డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు.. కారణమిదే

  • Published May 24, 2024 | 10:10 AMUpdated May 24, 2024 | 10:10 AM

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. వీరిద్దరి ట్విట్టర్‌ సంభాషణ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. వీరిద్దరి ట్విట్టర్‌ సంభాషణ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published May 24, 2024 | 10:10 AMUpdated May 24, 2024 | 10:10 AM
Kalki 2898 AD: డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు.. కారణమిదే

గత వారం రోజులుగా ఎక్కడ చూడు కల్కి 2898 ఏడీ, బుజ్జి గురించే చర్చ సాగుతోంది. అసలు ప్రభాస్‌ బుజ్జి గురించి చేసిన ట్వీట్‌ టాలీవుడ్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుజ్జి గురించి పరోక్షంగా ట్వీట్‌ చేయడంతో చాలా మంది డార్లింగ్‌ పెళ్లి గురించి ప్రకటన అనుకున్నారు. తీరా చూస్తే.. ఆ ప్లేస్‌లోకి బుజ్జి వచ్చింది. ఆ తర్వాత భైరవ.. బుజ్జిని పరిచయం చేస్తూ వీడియో విడుదల చేయడం.. తాజాగా దాని కోసం ప్రీఈవెంట్‌ రేంజ్‌లో బుజ్జి లాంచ్‌ ఫంక్షన్‌ నిర్వహించడం వంటివి చూస్తే.. కల్కి చిత్రంలో బుజ్జి ప్రాధాన్యత ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు బుజ్జి ఆయువుపట్టుగా నిలుస్తుంది అంటున్నారు. ఇక బుజ్జి లాంచ్‌ ఈవెంట్‌లో ప్రభాస్‌.. దాన్ని స్వయంగా డ్రైవ్‌ చేస్తూ తీసుకువచ్చాడు. డిఫరెంట్ లుక్‏లో స్టైలీష్ గా ఉన్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్.

అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందించిన బుజ్జి కారులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. దీంతో కల్కి ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి నెలకొంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో ఇంకెన్ని విభిన్న వాహనాలు వినియోగించారో.. అసలు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది అని చర్చించుకుంటున్నారు. అంతేకాక కల్కి హాలీవుడ్‌ స్థాయికి ధీటుగా ఉంటుందని డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా బుజ్జికి సంబంధించిన స్పెషల్ వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. బుజ్జి కారు ప్రత్యేకతలను పరిచయం చేసే ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక బుజ్జి తయారీ కోసం ఏకంగా 7 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని టాక్‌.

ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కల్కి దర్శకుడు.. నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. గతంలో నాగ్ అశ్విన్ పోస్ట్‌ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌ను ఇప్పుడు షేర్ చేస్తూ.. “నిజానికి సరదా సంగతులు ట్విట్టర్‌లోనే కనిపిస్తాయి. నాగ్ అశ్విన్.. అతడి టీమ్ గొప్పగా ఆలోచించడానికి భయపడరు. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాహనాలు తయారు చేయడంలో కల్కి చిత్ర యూనిట్‌కి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ సాయం చేస్తుంది. బుజ్జి వాహనం.. రెండు మహీంద్రా ఇ-మోటర్లతో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్ కూడా ఈ వెహికల్ రూపొందించడంలో భాగమైంది ” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ‘సాధ్యం కాదు అనుకున్న కలను సుసాధ్యం చేశారు. ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇవ్వగా.. ‘కలలు కనడం మానొద్దు..’ అంటూ మహీంద్రా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్టర్ సంభాణ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కల్కి చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకోణ్‌ నటిస్తుండగా.. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ వంటి దిగ్గజాలు కూడా భాగం కావడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి