iDreamPost

Chandrakanth: టీవీ నటుడు చందు పోస్ట్‌మార్టం పూర్తి.. నివేదికలో ఏముందంటే

  • Published May 18, 2024 | 1:58 PMUpdated May 18, 2024 | 1:58 PM

టీవీ నటుడు చంద్రకాంత్‌.. ఆత్మహత్య చేసుకున్నసంగతి తెలిసిందే. శనివారం అతడి డెడ్‌బాడీకి పోస్ట్‌ మార్టం పూర్తయ్యింది. నివేదికలో ఏముందంటే..

టీవీ నటుడు చంద్రకాంత్‌.. ఆత్మహత్య చేసుకున్నసంగతి తెలిసిందే. శనివారం అతడి డెడ్‌బాడీకి పోస్ట్‌ మార్టం పూర్తయ్యింది. నివేదికలో ఏముందంటే..

  • Published May 18, 2024 | 1:58 PMUpdated May 18, 2024 | 1:58 PM
Chandrakanth: టీవీ నటుడు చందు పోస్ట్‌మార్టం పూర్తి.. నివేదికలో ఏముందంటే

త్రినయని సీరియల్‌ నటుడు చంద్రకాంత్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ మణికొండలోని ఇంట్లో.. శుక్రవారం నాడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చందు మృతితో టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తన ప్రియురాలు, సహనటి పవిత్ర జయరామ్‌ మృతిని జీర్ణించుకోలేకనే చంద్రకాంత్‌ ఇలాంటి దారుణం నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రమాదంలో పవిత్ర జయరామ్‌ చనిపోయింది. యాక్సిడెంట్‌ జరిగిన కారులో చందు కూడా ఉన్నాడు. ఆ తరవాత పవిత్ర గురించి వరుస పోస్ట్‌లు చేస్తూ వస్తున్నాడు. ఇక శుక్రవారం నాడు ఆత్మహత్య చేసుకుని అందరికి షాక్‌ ఇచ్చాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్ట్‌ మార్టం నిమిత్తం చందు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శనివారం పోస్టమార్టం పూర్తి కావడంతో చందు డెడ్‌బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. చందు మృతదేహాన్ని బన్సీలాల్‌ పేటలోని ఆయన స్వగృహానికి తరలించారు. అనంతరం అక్కడే అంత్యక్రియలు చేయనున్నారు. డిప్రెషన్‌ కారణంగానే చందు ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడిస్తున్నార.

ఇక చందు, పవిత్ర జయరామ్‌లకు త్రినయని సీరియల్‌లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఈ సీరియల్‌లో గత ఐదేళ్లుగా కలసి నటిస్తున్నారు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రస్తుతం ఇద్దరూ లివిన్‌ రిలేషన్‌లో ఉన్నారు. ఇక పవిత్రకు గతంలో వివాహం కాగా.. భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కొడుకు 22 సంవత్సరాలు, కూతురు.. తనకు 19 సంవత్సరాల వయసు. ఇక చందుకు కూడా 2015లో శిల్ప అనే మహిళతో వివాహం అయ్యింది. వీరిద్దరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. చందుకు ఒక కుమార్తె(6) కొడుకు (5) సంతానం ఉన్నారు.

ఇక పవిత్ర జయరామ్‌ వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకుని… తమని అన్యాయం చేశాడని చందు భార్య శిల్ప ఆరోపిస్తుంది. పవిత్ర పరిచయం అయ్యాకే చందు తనకు దూరం అయ్యాడని.. ఐదేళ్ల నుంచి తమకు దూరంగా ఉంటున్నాడని చెప్పుకొచ్చింది. పవిత్ర కోసం చందు తనను చిత్రహింసలు పెట్టాడని వెల్లడించింది. చివరకు ఆమె కోసం ప్రాణాలు తీసుకుని తమను అనాథలని చేశాడని కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి