iDreamPost
android-app
ios-app

కండల వీరుడి జోడిగా పూజా మేడం

  • Published Feb 11, 2020 | 5:27 AM Updated Updated Feb 11, 2020 | 5:27 AM
కండల వీరుడి జోడిగా పూజా మేడం

 టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఉండే ఇమేజ్ వయసుతో నిమిత్తం లేకుండా సాగుతుంది. ఎంత ఏజ్ బార్ అయినా కుర్ర హీరోయిన్ల పక్కన వీళ్ళను చూసేందుకు అభిమానులు ఎగబడుతూనే ఉంటారు. విషయానికి వస్తే టాలీవుడ్ లో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న పూజా హెగ్డేకు ఇటీవలే అల వైకుంఠపురములో రూపంలో ఇండస్ట్రీ హిట్ దక్కింది. గత ఏడాది మహర్షి అంతకు ముందు అరవింద సమేత వీర రాఘవ ఇలా ఎవరితో చేసినా అలా హిట్టు వచ్చి చేరిపోతోంది. అందుకే అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు కూడా తనూ ఒక మెయిన్ సెల్లింగ్ ఫ్యాక్టర్ గా నిలుస్తోంది. 

ఇదిలా ఉండగా బాలీవుడ్ మీద పెద్ద కన్నే వేసిన పూజా హెగ్డే గతంలో హృతిక్ రోషన్ తో చేసిన సినిమా దారుణ ఫలితాన్ని ఇచ్చింది. మొన్న హౌస్ ఫుల్ 4 చేస్తే బాగానే ఆడింది. తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త మూవీ కభీ ఈద్ కభీ దివాళిలో ఆఫర్ కొట్టేసిందట. ఫర్హాద్ సంజి దీనికి దర్శకుడు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. సల్మాన్ ఖాన్ కు మొట్టమొదటి బ్రేక్ ఇచ్చిన సినిమా మైనే ప్యార్ కియా 1989లో వచ్చింది. అప్పటికి పూజా హెగ్డే పుట్టనే లేదు. తను 1990లో జన్మించింది. 

అంటే అప్పటినుంచి ఓ ముప్పై ఏళ్ళ తర్వాత సల్మాన్ తో తమ అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుందని తన తల్లితండ్రులు కనీసం కలలో కూడా అనుకుని ఉండరు. ఇదే స్టార్ హీరోలకు ఉన్న అడ్వాంటేజ్. అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు శ్రీదేవితో రొమాన్స్ చేసినప్పుడు, ఇటీవలే సైరాలో చిరంజీవి పక్కన తమన్నా జోడిగా కనిపించినప్పుడు ఇలాంటి కామెంట్సే వచ్చాయి. ఇది అన్ని భాషల్లోనూ పెద్ద హీరోలకు జరిగే విషయమే. కానీ హీరోయిన్లకు మాత్రం వర్తించదు. ఆ సమయంలో క్యూట్ బ్యూటీస్ గా ఉన్న భామలు ఇప్పుడు తల్లులుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న వాళ్ళు ఎందరో. 

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş