iDreamPost
android-app
ios-app

భర్తను మంచానికి కట్టేసి.. బట్టలు విప్పేసిన భార్య.. బయటపడ్డ వీడియో

మత్తు పదార్థాలకు బానిసైన భార్య భర్తను చిత్రహింసలకు గురిచేసింది. సిగరెట్ తో వాతలు పెడుతూ నరకం చూపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

మత్తు పదార్థాలకు బానిసైన భార్య భర్తను చిత్రహింసలకు గురిచేసింది. సిగరెట్ తో వాతలు పెడుతూ నరకం చూపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

భర్తను మంచానికి కట్టేసి.. బట్టలు విప్పేసిన భార్య.. బయటపడ్డ వీడియో

ఇప్పటి వరకు భార్యలను వేధిస్తున్న భర్తలు అనే ఎక్కువగా విన్నాము. కానీ ఈ ఘటన చూశాక భర్తలు కూడా వేధింపులకు గురవుతున్నారనే నిజాన్ని నమ్మక తప్పదు. భార్యాభర్తలంటే ఆదర్శ దంపతుల్లా అన్యోయంగా జీవించాలని చెప్తుంటారు. కానీ నేటి రోజుల్లో ఆ పరిస్థితి మారిపోయింది. ఒకరిపై ఒకరు పెత్తానం చెలాయిస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఓ రాష్ట్రంలో ఓ భార్య తన భర్తను వేధించిన తీరుకు ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు. భర్తకు నరకం అంటే ఏంటో బ్రతికుండగానే చూపించింది. భర్త కాళ్లు చేతులు కట్టేసి సిగరెట్ తో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌ జిల్లాకు చెందిన మనన్‌ జైదీకి మెహర్‌ జహాన్‌తో వివాహమైంది. మత్తు పదార్థాలకు బానిసైన మెహర్‌ భర్తను చిత్ర హింసలకు గురిచేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో భార్య దారుణాలను బయటపెట్టేందుకు ఆ భర్త ఇంట్లోనే ఆమెకు తెలియకుండా సీసీ కెమెరాలు అమర్చాడు. మత్తు పదార్థాలు తీసుకున్న ఆమె రోజులాగానే అర్ధరాత్రి అతడి కాళ్లూ, చేతులు కట్టేసింది. సిగరెట్‌ తాగుతూ ఒంటిపై వాతలు పెట్టింది. మర్మాంగంపైనా చురకలు పెట్టి నరకం అంటే ఏంటో చూపించింది.

అయితే మొదట్లో ఇన్ని దారణాలకు పాల్పడుతున్నా అతడు ఏమీ చేయలేక మిన్నకుండిపోయేవాడు. భార్యపై ఫిర్యాదు చేసిన పోలీసులు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఆ రోజు సీసీ కెమెరాలు అమర్చడంతో ఆమె పెట్టిన చిత్రహింసలు వెలుగుచూశాయి. ఆ రాత్రి భార్య దారుణాలను భరించిన ఆ భర్త.. ఉదయాన్నే వీడియో ఆధారాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్య పెట్టిన దారుణాలను పోలీసులకు వివరించాడు. ఆ వీడియోల్లో ఆమె టార్చర్‌ చూశాక పోలీసులే ఖంగుతిన్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

marsbahis girişjojobetjojobet girişjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet giriş