ఏపీలోని మచిలీపట్నంలో జరిగిన డాక్టర్ రాధ హత్య..రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత నెల 25న ఆమె అత్యంత దారుణంగా హత్యకు గురైంది. తన భార్యను చంపేసే ఎవరో నగలు దోచుకెళ్లాలరని మృతురాలి భర్త మహేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు రాధ హత్యకేసు మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో డాక్టర్ రాధ భర్తే హత్య చేసినట్టు తేలింది. తన దగ్గర డ్రైవర్‌గా, అటెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తులకు డబ్బులు, బంగారం ఆశ చూపి హత్యకు సహకరించేలా ఒప్పించాడని పోలీసులు విచారణలో వెళ్లడైంది. ఇక డాక్డర్ రాధ హత్య కేసులో పోలీసులు అనేక సంచలన విషయాలను వెల్లడించారు.
మచిలీపట్నంకు చెందిన లోక్ నాథ్ మహేశ్వరావు, రాధ దంపతులు. వీరు స్థానికంగా ఆస్పత్రి నిర్వహిస్తూ అందులోనే రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. గత నెల 25వ తేదీ సాయంత్రం ఆస్పత్రి రెండో అంతస్తులో రాధ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఆమెకు భర్తే కాల యముడై కాటేశాడు. హత్య జరిగిన రోజు… ఒంటరిగా ఉన్న రాధ వద్దకు లోక్ నాథ్, డ్రైవర్ మధు వెళ్లారు. మధు ఆమెను పట్టుకోగా భర్త రెంచితో తన వెనుక బలంగా దాడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందింది.
పోలీసు జాగిలాలకు ఆధారాలు చిక్కకుండా మృతురాలి భర్త సూచనల మేరకు మధు హత్య జరిగిన ప్రదేశమంతా కారం చల్లాడు. దానిని సమీపంలోని సూపర్ మార్కెట్ నుంచి కొని తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఏమీ తెలియనట్లు మహేశ్వరావు కింది అంతస్తులోని ఆస్పత్రిలో వచ్చిన రోగుల ఓపీ చూశాడు. ఏమి తెలియనట్లు రాత్రి 10.30కి తన భార్యను ఎవరో హత్య చేశారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతురాలి భర్తపై అనుమానం కలిగింది. భార్య చనిపోయిందనే బాధ, ఆవేదన అతనిలో ఏమాత్రం కనిపించలేదు. పైగా భార్య చనిపోయిన మరుసటి రోజే ఆస్పత్రిలో ఓపీ చూడడం వంటివి చేయడంతో పోలీసులకు అనుమానాలను రేకెత్తించాయి.
ఈ క్రమంలో కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాధ డాక్టర్ రాధ ఆమె భర్త లోకనాథ్ మహేశ్వరరావు మధ్య ఆస్తుల విషయంలో కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. వైద్య వృతి ద్వారా వచ్చిన ఆస్తులు, పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తులు రాధ పేరున బాగానే ఉన్నాయి. వీటిని సమాజ సేవకు, ట్రస్టులకు రాసిస్తానని ఆమె అన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే భార్యను హతమార్చాడు. మరి.. ఈహత్య కేసు నిందితులకు ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇంటర్ ఫ్రెషర్స్ పార్టీలో విషాదం డ్యాన్స్ చేస్తూనే ఆగిన గుండె