iDreamPost
android-app
ios-app

8వ తరగతి పాసైతే 50 లక్షల లోన్.. ఆపై సబ్సిడీ కూడా.. వెంటనే అప్లై చేసుకోండి

  • Published Jun 19, 2024 | 9:07 PM Updated Updated Jun 19, 2024 | 9:30 PM

Loans For Youth: వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? సొంతంగా మీ కాళ్లపై నిలబడాలని అనుకుంటున్నారా? మీ దగ్గర మంచి బిజినెస్ ఐడియా ఉంది. అయితే మీ ఐడియాకి పెట్టుబడి పెట్టే ఈ పథకం గురించి తెలుసుకోండి. లక్షల్లో లోన్, ఆపై సబ్సిడీ కూడా పొందండి.

Loans For Youth: వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? సొంతంగా మీ కాళ్లపై నిలబడాలని అనుకుంటున్నారా? మీ దగ్గర మంచి బిజినెస్ ఐడియా ఉంది. అయితే మీ ఐడియాకి పెట్టుబడి పెట్టే ఈ పథకం గురించి తెలుసుకోండి. లక్షల్లో లోన్, ఆపై సబ్సిడీ కూడా పొందండి.

8వ తరగతి పాసైతే 50 లక్షల లోన్.. ఆపై సబ్సిడీ కూడా.. వెంటనే అప్లై చేసుకోండి

పరిగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం అన్న సామెత చందాన కొంతమంది సొంత ఊరిలోనే నిలబడాలని అనుకుంటారు. వ్యవసాయమో, వ్యాపారమో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేసి నిలదొక్కుకోవాలని భావిస్తారు. ముఖ్యంగా పెద్దగా పై చదువులు చదవని వాళ్ళు ఊర్లోనే ఉంటూ ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ  ఉంటారు. పెట్టుబడికి డబ్బులు ఉంటే.. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే వ్యాపారం పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రుణాలు మంజూరు చేయడమే కాకుండా సబ్సిడీ కూడా ఇస్తుంది.    

ఆ పథకం పేరు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ). ఇది కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా వచ్చే యువకులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఏదైనా తయారీ కంపెనీని ప్రారంభించడం కోసం 50 లక్షల వరకూ రుణాన్ని అందిస్తుంది. సర్వీస్ సెక్టార్ కి చెందిన కంపెనీని ప్రారంభించడం కోసం 20 లక్షల రుణాన్ని అందజేస్తుంది. ఈ లోన్ లో 15 శాతం నుంచి 35 శాతం వరకూ సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం కింద గతంలో లోన్లు పొందినవారికి వ్యాపార విస్తరణ కోసం మరోసారి రుణాన్ని పొందే అవకాశం కల్పించింది.

మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కోసం కోటి రూపాయలు, సర్వీస్ సెక్టార్ కి సంబంధించి 25 లక్షలు దాటితే మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి పొందవచ్చు. అయితే ఈ పథకం కింద రుణం పొందాలంటే ఆ వ్యక్తికి కనీస అర్హత 8వ తరగతి పాసై ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఈ పథకం మొక్కల పెంపకం, మేకలు, చేపలు, పశువులు, కోళ్ల పెంపకం వంటి వాటికి వర్తించదు. అలానే ఔషధ సంబంధిత దుకాణాలకు ఈ పథకం కింద లోన్ ఇవ్వరు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు ఉండాలి. అలానే పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి దరఖాస్తుకు జతచేయాలి. రూరల్ ఏరియా సర్టిఫికెట్, వ్యాపారానికి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే రాకపోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్ లైన్ లో దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకుని పథకాన్ని అమలు చేసే అధికారులను సంప్రదించి సబ్మిట్ చేయవచ్చు. లేదా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.