iDreamPost
android-app
ios-app

మీ WhatsApp అకౌంట్ సేఫ్ గా ఉండాలంటే వెంటనే ఇలా చెయ్యండి!

  • Published Sep 27, 2024 | 9:35 PM Updated Updated Sep 27, 2024 | 9:35 PM

WhatsApp: వాట్సాప్‌ చాలా ముఖ్యమైన యాప్. వాట్సాప్‌లో కొన్ని భద్రతా సమస్యలు ఉన్నాయి. అవి తెలుసుకోపోతే చాలా నష్టపోతారు.

WhatsApp: వాట్సాప్‌ చాలా ముఖ్యమైన యాప్. వాట్సాప్‌లో కొన్ని భద్రతా సమస్యలు ఉన్నాయి. అవి తెలుసుకోపోతే చాలా నష్టపోతారు.

మీ WhatsApp అకౌంట్ సేఫ్ గా ఉండాలంటే వెంటనే ఇలా చెయ్యండి!

వాట్సాప్‌ అనేది చాలా ముఖ్యమైన యాప్. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని కలిగి ఉంటారు. వాట్సాప్‌ అప్లికేషన్ ఇతర సోషల్ మీడియా అప్లికేషన్స్ కంటే చాలా సేఫ్. ఇంకా ఎంతో ఉపయోగకరమైనది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న యాప్ ఇది. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఆఫీస్ పనులకు ముఖ్యమైన యాప్ గా మారింది. అయితే ఇంత సురక్షితమైన వాట్సాప్‌లో కొన్ని భద్రతా సమస్యలు కూడా ఉన్నాయి. అవి తెలుసుకోపోతే కచ్చితంగా చాలా నష్టపోతారు. ఇక అవేంటి? వాట్సాప్ అకౌంట్ ని సేఫ్ గా ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక వాట్సాప్‌లో 2-స్టెప్స్ వెరిఫికేషన్ అనే సెట్టింగ్ ఉంటుంది. ఇది వాట్సాప్‌ యాప్‌ను సేఫ్ గా ఉంచుతుంది. మీ వాట్సాప్ అకౌంట్ ని మీరు మాత్రమే కాకుండా మీకు తెలీకుండా ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు. అందులో ఉన్న మీ డేటాని తీసుకోవచ్చు. ఇలాంటి ట్రిక్స్ ఎక్కువగా హ్యాకర్లు చేస్తారు. ఇలాంటప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్ లో 2 స్టెప్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దీని ద్వారా మీకు ఇలాంటి సమస్యలు ఉండవు. మీ అకౌంట్ సేఫ్ గా ఉంటుంది. మీ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి వాట్సాప్ ఓపెన్ చేసిన వినియోగదారులు మీ 2-స్టెప్స్ వెరిఫికేషన్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి. అలా చేస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. దీంతో మీకు హ్యాకర్ల నుంచి, తెలియని వారి నుంచి ఎటువంటి భద్రతా సమస్యలు ఉండవు. వాట్సాప్ యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌పై క్లిక్ చేయాలి. ఇక అక్కడ ఇచ్చిన ఆప్షన్లలో టూ స్టెప్ వెరిఫికేషన్ పై క్లిక్ చేయాలి. తరువాత ఏదైనా 6 నంబర్లతో పిన్ సెట్ చేసుకోవాలి.

అలాగే మీకు తెలియని వారు మిమ్మల్ని ప్రమాదకరమైన గ్రూప్ లో యాడ్ చెయ్యొచ్చు. దాని వల్ల మీరు స్కాముల్లో ఇరుక్కోవచ్చు. అలా జరగకుండా ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. అక్కడ గ్రూప్స్ ఆప్షన్ ఓపెన్ చేసి మై కాంటాక్ట్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. దీనివల్ల మీకు తెలియని వారు మిమ్మల్ని ఏ గ్రూప్ లో యాడ్ చేసే ఛాన్స్ ఉండదు. అలాగే చాలా మందికి తెలియని కాల్స్ ఎక్కువగా వస్తాయి. వాటిలో మీ ప్రైవసీకి భంగం కలిగించే కాల్స్ కూడా వస్తాయి. అలాంటి కాల్స్ రాకుండా కాల్స్ ఆప్షన్ లో సైలెన్స్ అన్ నోన్ కాల్స్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. దీంతో తెలియని కాల్స్ నుంచి సేఫ్ గా ఉండొచ్చు. అలాగే తెలియని నంబర్ల నుంచి లింక్స్ ఓపెన్ అవ్వకుండా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో డిజేబుల్ లింక్ ప్రివ్యూస్ ఆన్ చెయ్యండి. ఇంకా మీ ఐపి అడ్రెస్ తెలియకుండా ప్రొటెక్ట్ ఐపి అడ్రెస్ ఇన్ కాల్స్ ఆప్షన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ప్రొఫైల్ పిక్చర్ ని కూడా మై కాంటాక్ట్ ఆప్షన్ లో పెట్టుకోండి. దీని వల్ల తెలియని వారు మీ ఫోటోని దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. ఈ సెట్టింగ్స్ మార్చుకోవడం వల్ల మీ వాట్సాప్ ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇక ఈ వాట్సాప్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.