iDreamPost
android-app
ios-app

ఇతర భాషల్లో దేవర టాక్ ఎలా ఉందంటే?.. అక్కడి ఆడియెన్స్ రెస్పాన్స్ ఇదే!

  • Published Sep 27, 2024 | 6:45 PM Updated Updated Sep 27, 2024 | 6:45 PM

Devara Movie Public Talk From Other Languages: రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర దుమ్ము దులిపేస్తుంది. మొదటి నుంచి ఇక్కడ బాగానే బజ్ ఉంది. కాబట్టి ఇందులో అంత ఆశ్చర్యం లేదు. మరి ఇతర భాషల్లో దేవర పరిస్థితి ఏంటి.. దాని గురించి చూసేద్దాం.

Devara Movie Public Talk From Other Languages: రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర దుమ్ము దులిపేస్తుంది. మొదటి నుంచి ఇక్కడ బాగానే బజ్ ఉంది. కాబట్టి ఇందులో అంత ఆశ్చర్యం లేదు. మరి ఇతర భాషల్లో దేవర పరిస్థితి ఏంటి.. దాని గురించి చూసేద్దాం.

  • Published Sep 27, 2024 | 6:45 PMUpdated Sep 27, 2024 | 6:45 PM
ఇతర భాషల్లో దేవర టాక్ ఎలా ఉందంటే?.. అక్కడి ఆడియెన్స్ రెస్పాన్స్ ఇదే!

ఫైనల్లీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ళ ఆకలి తీరింది. దేవర సినిమాతో థియేటర్స్ లో మాస్ జాతర చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ ది మాసెస్.. దేవరలో మాస్ ఎలిమెంట్స్ తో మెంటల్ ఎక్కించాడు. ఫ్యాన్స్ కోరుకున్నది కూడా ఇదే. సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ కు ముందు వరకు సూపర్ హైప్ నడిచింది. అదంతా ఒక లెక్క ఇప్పుడు రిలీజ్ తర్వాత సాగుతున్న హైప్ మరో లెక్క. మొదటి షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా.. సినిమాకు పాజిటివ్ టాక్ ఏ నడుస్తుంది. మొదట కాస్త కొన్ని సీన్స్ విషయాల్లో మిక్స్డ్ టాక్ నడిచినా కానీ.. షోస్ పడే కొద్దీ క్రమంగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. దీనితో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర దుమ్ము దులిపేస్తుంది. తెలుగు ఆడియన్స్ లో మొదటి నుంచి బజ్ ఉంది. కాబట్టి ఇందులో అంత ఆశ్చర్యం ఏమి లేదు. మరి ఇతర భాషల్లో దేవర పరిస్థితి ఏంటి? అక్కడ ఆడియన్స్ ను దేవర మెప్పించిందా ? ఈ స్టోరీ చూసేద్దాం.

కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర మూవీ.. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయింది. తెలుగుతో పాటు తమిళ్ , హిందీ, కన్నడ , మలయాళం. వీటిలో ఎక్కువ అంచనాలు తెలుగు సినిమా మీదే ఉన్నా.. తారక్ కు ఇతర భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు, కాబట్టి అక్కడ టాక్ కూడా తెలుసుకోవాల్సిందే. హిందీ వెర్షన్ విషయానికొస్తే.. అక్కడ కూడా తారక్ యాక్టింగ్ కు, సౌండ్ ఎఫెక్ట్స్ కు ఫుల్ మార్కులు పడిపోయాయి. మంచి సస్పెన్స్ ఉన్న మూవీ అంటూ.. ఎన్టీఆర్ అదరగొట్టేశాడని.. సౌత్ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నారంటూ పబ్లిక్ టాక్. ఫస్ట్ ఆఫ్ కంటే కూడా సెకండ్ ఆఫ్ బాగా నచ్చిందంటూ చెబుతున్నారు ఆడియన్స్. అటు తమిళ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ముఖ్యంగా ఫైట్ సీన్స్ కు, జాన్వీ కపూర్ యాక్టింగ్ కు అక్కడ ఎక్కువ మార్కులు పడుతున్నాయి. పార్ట్-2 దీనికి మించి ఉంటుందంటూ అంటున్నారు తమిళ అభిమానులు.

ఇక కన్నడలో కూడా ఇదే హిట్ టాక్ వినిపిస్తోంది.. కాలర్ ఎగరేసుకునేలా ఉంది అంటూ.. రివ్యూలు ఇస్తున్నారు ఆడియెన్స్. ఇక మలయాళం వర్షన్ కు వస్తే.. కచ్చితంగా ఇది థియేటర్ లో ఎక్స్పీరియెన్స్ చేయాల్సిన మూవీ అంటున్నారు. మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా చివరి వరకు సస్పెన్స్ , ట్విస్ట్ లతో కొరటాల శివ మెప్పించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. సో ఇలా మొత్తానికి పాన్ ఇండియా లెవెల్ లో దేవర దున్నేస్తుంది.. ఎక్కడ చూసినా దేవరకు పాజిటివ్ టాక్ ఏ నడుస్తుంది. కాబట్టి వీకెండ్ లోపే దేవర లాభాల బాట పట్టడం ఖాయం. మొత్తానికి దేవరోడి వేట పాన్ ఇండియా వైడ్ గా దంచికొడుతుంది. ఇక కలెక్షన్స్ లెక్క తేలడమే లేట్. మరి దేవర పాన్ ఇండియా టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.