iDreamPost
android-app
ios-app

GHMC కీల‌క నిర్ణ‌యం.. వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధం విధిస్తూ ఉత్త‌ర్వులు

  • Published Sep 27, 2024 | 7:13 PM Updated Updated Sep 27, 2024 | 7:13 PM

GHMC Commissioner Amrapali: గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ (GHMC) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

GHMC Commissioner Amrapali: గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ (GHMC) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

GHMC కీల‌క నిర్ణ‌యం.. వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధం విధిస్తూ ఉత్త‌ర్వులు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ మధ్య నగరంలో చెత్త సమస్య, నాలాలు, చెరువుల ఆక్రమణ, మంచి నీటి సమస్యలతో పాటు వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ పై మంత్రులు, అధికారులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. నగరంలో భవిష్యత్ లో వరదలు రాకుండా చర్యలు చేపట్టే క్రమంలో చెరువులు, నాలాలు అక్రమించి కట్టడాలు చేపట్టిన వాటిని ‘హైడ్రా’ వ్యవస్థ ద్వారా కూల్చివేయిస్తున్నారు. తాజాగా ఇప్పుడు వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది జీహెచ్ఎంసీ. ఈ మేరకు మున్సిపల్ కమీషనర్ ఆమ్రపాలి కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు తో పాటు వాల్ పెయింట్ లపై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎక్కడైనా గోడలపై అనుమతి లేకుండా పోస్టర్లు వేసినా, రాతలు రాసినా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమీషనర్ ఆమ్రపాలి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వాల్ పోస్టర్లను శుక్రవారం నుంచి బ్యాన్ చేశారు. అనుమతి లేకుండా పోస్టర్లు అంటిస్తే వారి వివరాలు సేకరించి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ఇకపై గోడలపై సినిమా పోస్టర్లు, వాల్ రైటింగ్స్ నిషేధించినట్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

సినిమా, వ్యాపార ప్రకటనలకు సంబంధించిన పోస్టర్లు అనుమతి లేకుండా వేయడాన్ని నిషేధించారు. జీహెచ్ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యంపై సీరియస్ గా దృష్టి పెట్టకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరయ్యేలా చూడాలని.. ఎక్కడైనా నిషేదాలను అతిక్రమించి వాల్ పెయింట్స్, పోస్టర్లు అతికించినట్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని దిశా‌నిర్దేశం చేశారు. హైదరాబాద్ ని సుందరమైన పర్యటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే గోడలు, పరిసర ప్రాంతాలు నీట్ గా కనిపించేలా చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.