iDreamPost
android-app
ios-app

విషాదం! Hydra భయంతో ఆత్మ హత్య చేసుకున్న మహిళ!

  • Published Sep 27, 2024 | 10:15 PM Updated Updated Sep 27, 2024 | 10:15 PM

Hydra: హైడ్రా దెబ్బకుహైదరాబాద్ లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా దెబ్బకు ఓ మహిళ తట్టుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకుంది.

Hydra: హైడ్రా దెబ్బకుహైదరాబాద్ లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా దెబ్బకు ఓ మహిళ తట్టుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకుంది.

  • Published Sep 27, 2024 | 10:15 PMUpdated Sep 27, 2024 | 10:15 PM
విషాదం! Hydra భయంతో ఆత్మ హత్య చేసుకున్న మహిళ!

హైడ్రా హడల్ సృష్టిస్తుంది. సామాన్యులకు వణుకు పుట్టిస్తుంది. ఎన్నో ఇళ్లను కూల్చేస్తుంది. తాజాగా హైడ్రా దెబ్బకు ఓ ప్రాణం బలైంది. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా దెబ్బకు ఓ మహిళ తట్టుకోలేకపోయింది. ఆ భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఇది నిజంగా బాధాకరమైన విషయం. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పాపం ఆ మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తన ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లకు కట్నంగా తన ఇల్లును రాసిచ్చింది.

అయితే హైడ్రా కూల్చివేతలు దారుణమైన పరిస్థితికి దారి తీశాయి. ఈ కూల్చి వేతల్లో భాగంగా ఇండ్లు ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు ఇటీవలే అందరినీ హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది బుచ్చమ్మ. ఏం చెయ్యాలో అర్ధం కానీ స్థితిలో నరకయాత పడింది. దీనికి పరిష్కారం లేదని తెలుసుకుంది. చివరకి చావునే మార్గంగా ఎంచుకుంది. దాంతో శుక్రవారం నాడు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. బుచ్చమ్మ కుమార్తెలు, బంధువులు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విలవిల లాడిపోయారు. శోకసంద్రంలో మునిగిపోయారు.

హైడ్రా అధికారుల వేధింపులే బుచ్చమ్మ మరణానికి కారణమని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమెకు కుమారులు లేరు. ఉన్నది ముగ్గురు కుమార్తెలు మాత్రమే. వారి భవిష్యత్తు బాగుండాలని చాలా కష్ట పడింది. భర్త శివయ్యతో పాటు బుచ్చమ్మ కూడా కష్టపడి పని చేసి ఒక్కో రూపాయి కూడబెట్టారు. ఇల్లును కొన్నారు. తన బిడ్డల పెళ్లిళ్లకు కట్నం కింద ఈ ఇల్లును రాసిచ్చింది. ఇప్పుడు ఇల్లు కూల్చేస్తాం అనేసరికి ఆవేదనకు గురై ఇలా ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ దారుణమైన సంఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.