iDreamPost

సర్పంచ్ లతో ప్రధాని మోదీ మాటామంతి

సర్పంచ్ లతో ప్రధాని మోదీ మాటామంతి

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సర్పంచ్ లతో మాటామంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచ్ లతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ప్రధాని మోదీతో సర్పంచులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకొనున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరు కనబర్చిన పంచాయతీలకు ప్రధాని నరేంద్ర మోడీ అవార్డులు, ప్రోత్సాహకాలు ప్రకటించనున్నారు.

స్వాతంత్ర్యానికి పూర్వమే దేశంలో స్థానిక సంస్థల వ్యవస్థ ఉన్నప్పటికీ స్వతంత్ర అనంతరం ఒక రూపు మార్చుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కాలం గడిచేకొద్దీ పంచాయతీలకు మరిన్ని అధికారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెట్టాయి. 1993లో స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పిస్తూ రాజ్యాంగ సవరణలు చేశారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించారు. 1994 ఏప్రిల్ 24 వ తేదీ నుంచి నూతన పంచాయతీ రాజ్ చట్టం – 1994 అమల్లోకి వచ్చింది. అందుకనే ఈ రోజుని పంచాయతీరాజ్ దినోత్సవం గా జరుపుకుంటారు.

గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం లక్ష్యంగా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. పంచాయతీలకు 29 రకాల విధులు, బాధ్యతలు, పట్టణ సంస్థలకు 18 రకాల విధులు, బాధ్యతలను 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా కల్పించారు. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు పూర్తి స్థాయిలో అప్పగించకుండా తమ చేతుల్లోనే ఉంచుకున్నాను. అయితే రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలిలో మార్పులు క్రమంగా వస్తున్నాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో యువ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిపాలనలో వినూత్న మైన చర్యలకు నాంది పలుకుతున్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పరిపాలనను ప్రజల చెంతకు చేర్చే విప్లవాత్మకమైన విధానాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు తమ ఊర్లోనే అందించాలన్న లక్ష్యంతో ఈ సచివాలయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో పురుడు పోసుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఆంధ్రప్రదేశ్లో సహకారం అయిందని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి