iDreamPost

Rithu Chowdary: ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి..టార్చర్ చేశారు : రీతూ చౌదరి

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అటువంటి వారిలో ఒకరు రీతూ చౌదరి. బుల్లితెర సీరియల్లో మెరిసిన ఈ భామ.. ఆ తర్వాత ఈ కామెడీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇటీవల తన ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్ విషయంలో మోసపోయానంటూ బాధపడ్డ రీతూ..

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అటువంటి వారిలో ఒకరు రీతూ చౌదరి. బుల్లితెర సీరియల్లో మెరిసిన ఈ భామ.. ఆ తర్వాత ఈ కామెడీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇటీవల తన ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్ విషయంలో మోసపోయానంటూ బాధపడ్డ రీతూ..

Rithu Chowdary: ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి..టార్చర్ చేశారు : రీతూ చౌదరి

తెలుగు బుల్లితెరపై ఆసాంతం కితకితలు పెట్టిస్తున్న ట్విన్ కామెడీ షోస్ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్. ఈ షోల ద్వారా ఎంతో మంది యాక్టర్స్ ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో ఒకరు రీతూ చౌదరి. తొలుత సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఈ  బ్యూటీ.. తొలుత టీవీ సీరియల్లో మెరిసింది. గోరింటాకు, అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి ధారావాహికల్లో నటించిన ఈ భామ.. ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంటరైంది. అక్కడ హైపర్ ఆది, రైజింగ్ రాజు టీంలో చేసింది. ఈ షో ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. అలాగే తనకు పేరు తెచ్చిన సోషల్ మీడియాలో ఎప్పుటికప్పుడు తన వీడియోలను పోస్టు చేస్తూ ఉంటుంది.  ఇటీవలే తన ఇంటి నిర్మాణంలో ఒకరు మోసం చేశారంటూ  తన యూట్యూబ్ ఛానల్లో వాపోయిన సంగతి విదితమే.

తాజాగా తనకు ఎదురైన మరో చేదు అనుభవాన్ని యూట్యూబ్ ద్వారా పంచుకుంది రీతూ చౌదరి. తన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేసి, తాను చూశానా లేదా అని సైకో ఆనందంతో తనకే ట్యాగ్ చేసి.. స్టోరీలు పెట్టి.. ఇంత రేటు ఈ వీడియో ఇస్తామంటూ టార్చర్ చేశారని చెప్పింది. ‘ఇది జరిగి ఐదు నెలలు అవుతుందని, అయితే దీనిపై స్పందించాలా వద్దా అని ఆలోచించా. ఆ వీడియోలో ఉంది నేను కాదు అని ప్రూవ్ చేద్దామనుకున్నాను. కానీ అంతలో ఆలోచనలు చుట్టుముట్టాయి. నేను మరో వీడియో చేస్తే..నన్ను నమ్ముతారా లేదా. తెలియని వాళ్లకు తెలిసేలా చేస్తున్నానా? చుట్టాలు ఏమనుకుంటారు అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. స్నేహితులు కూడా వద్దన్నారు. కానీ తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నా’ అని పేర్కొంది రీతూ.

సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా ‘వీడియో లీక్డ్ అంటగా, వస్తావా, బాగా చేస్తున్నావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నా లాంటి స్ట్రాంగ్ ఉమెనే ఇలాంటివి తీసుకోలేకపోతున్నా. సెన్సిటివ్ ఉన్న అమ్మాయిలు ఎలా తీసుకుంటారు. ఈ విషయంలో  ఫ్రెండ్ శ్రీకాంత్, తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి. శ్రీకాంత్, నేను బయటకు వెళుతున్నప్పుడు.. నా అసభ్యకరమైన వీడియో చూశాను. అది అతడికి చూపిస్తే.. నిజమనుకుంటాడా.. ఆ వీడియోల్లో ఉంది తాను కాదూ అని ప్రూవ్ చేసుకుందామని అనుకున్నా. కానీ శ్రీకాంత్ చాలా సపోర్ట్ చేశాడు. అది నువ్వు కాదని నీ గురించి తెలిసిన వాళ్లకు తెలుసు. అంటూ సైబర్ పోలీసుల వద్దకు తీసుకెళ్లాడు’అంటూ వెల్లడించింది.

సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాక.. చాలా మంది అభిమానుల నుండి వీడియోలు వచ్చాయని తెలిపారు. ‘తండ్రిని కోల్పోయాక, ఇంటికి సంబంధించి ఇంటీరియర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఇలా టార్చర్ చేశారు’ అంటూ సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలు, మేసేజ్‌లు చూపించింది రీతూ. ఈ సమయంలో తన తల్లి, అన్నయ్య చాలా సపోర్టుగా నిలిచారని పేర్కొంది. ‘వాళ్లే లేకపోతే తాను ఎలా డీల్ చేశానో ఇప్పటికీ అర్థం అయ్యేది కాదు. విష్ణుప్రియ కూడా చాలా సపోర్ట్ చేసింది. నేను పనిచేసిన చోట చాలా మంది ఆఫర్స్, డబ్బులు లేక ఇలా చేసి ఉంటది అని వ్యాఖ్యలు చేశారు’. ఇప్పుడు సైబర్ పోలీసులు.. మార్ఫింగ్ చేసిన వాళ్లను పట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. అలాగే ‘వీడియో లీక్డ్, ఇంత అమ్ముతా అంటూ, నాతో వస్తావా, వన్ నైట్‌కి ఎంత, టూ నైట్స్‌కి ఎంత అంటూ కామెంట్స్ చేసిన వాళ్ల ప్రొఫైల్ కూడా ఇచ్చాను’ అని పేర్కొన్నారు.

‘ఇలాంటి వీడియోలు చేసి వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆసిఫాబాద్ నుండి పట్టుకొచ్చారు. గతంలో కూడా అతడిని కలిశాను. ఎందుకలా చేశావంటే నాకు తెలియదు అంటున్నాడు. మళ్లీ అతడికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారట. అతడి బావ కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. అతడు వచ్చి.. చిన్నపిల్లాడు మేడం వదిలేయాలని అడుగుతున్నారు. ఈ విషయంలో సైబర్ పోలీసులు ఎంతో సపోర్ట్ చేశారు. ఇలాంటి పిచ్చి నా కొడుకులికి, ఇలాంటి పనులు చేసేవాళ్లను పోలీసులు పట్టుకుంటారు. శిక్షిస్తారు’ అంటూ వీడియో చేశారు. అలాగే మీ వీడియోలు మార్ఫింగ్ చేస్తే.. అమ్మాయిలు సూసైడ్ చేసుకోకండి.. స్ట్రాంగ్ గా ఉండండి అని పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి