iDreamPost
android-app
ios-app

PF ఖాతా ఉందా? మీ కుటుంబానికి ఫ్రీగా 7 లక్షలు.. ఎలా పొందొచ్చంటే?

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. రూపాయి ఖర్చు లేకుండానే ఉచితంగా 7 లక్షలు పొందొచ్చు. పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులందరు అర్హులే. ఎలా పొందొచ్చంటే? పూర్తి వివరాలు మీకోసం..

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. రూపాయి ఖర్చు లేకుండానే ఉచితంగా 7 లక్షలు పొందొచ్చు. పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులందరు అర్హులే. ఎలా పొందొచ్చంటే? పూర్తి వివరాలు మీకోసం..

PF ఖాతా ఉందా? మీ కుటుంబానికి ఫ్రీగా 7 లక్షలు.. ఎలా పొందొచ్చంటే?

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆయా సంస్థలు లేదా కంపెనీలు పీఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. ప్రతి నెల ఉద్యోగి జీతంలో నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమచేస్తూ ఉంటాయి. భవిష్యత్ అవసరాలకు ఈ డబ్బులు బాగా ఉపయోగపడతాయి. భారత ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్ కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి పీఎఫ్ ఖాతాదారుడికి ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. మరి మీకు కూడా పీఎఫ్ ఖాతా ఉందా? అయితే మీరు ఉచితంగానే రూ. 7 లక్షలు పొందొచ్చు. పైసా ఖర్చు లేకుండా రూ. 7 లక్షలు పొందే అవకాశాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కల్పించింది. ఎంప్లాయిస్ డిపాజిట్‌ లింక్డ్ ఇన్సూరెన్స్‌ స్కీమ్ కింద ఈ ప్రయోజనాలను పొందొచ్చు.

ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్. దీనికి పీఎఫ్ ఖాతాదారులందరూ అర్హులే. ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణించడానికి ముందు 12 నెలల కాలంలో ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పనిచేసి సర్వీసులో మరణించినట్లయితే, వారి కుటుంబ సభ్యులకు కూడా బీమా ప్రయోజనం కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ స్కీమ్ ద్వారా రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఫ్రీగా బీమా పొందొచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా మరణిస్తే కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఈ బీమా మొత్తం లభిస్తుంది.

ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే.. ఇ- నామినేషన్‌ మొదట ఫైల్ చేయాల్సి ఉంటుంది. నామినీ వివరాలను ఈపీఎఫ్ అకౌంట్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో సులువుగా చేసుకోవచ్చు. ఈడీఎల్ఐ స్కీమ్ నెలకు బేసిక్ సాలరీ రూ.15,000 లోపు ఉన్న వారందరికీ వర్తిస్తుంది. బేసిక్ సాలరీ రూ.15,000 దాటితే గరిష్టంగా రూ.7 లక్షల వరకే బీమా ఉంటుంది.

ఇ-నామినేషన్ విధానం:

  • పీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్ ​​అధికారిక వెబ్‌సైట్ – https://www.epfindia.gov.in/ లోకి లాగిన్ కావాలి.
  • అక్కడ హోంపేజీలో ‘సర్వీసెస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ‘ఎంప్లాయీస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ‘మెంబర్ యూఏఎన్/ఆన్‌లైన్ సర్వీస్ (ఓసీఎస్/ఓటీసీపీ)’పై క్లిక్ చేయండి.
  • తర్వాత యూఏఎన్, పాస్‌వర్డ్‌ని ఎంట్రీ చేసి లాగిన్ అవ్వండి.
  • తర్వాత ‘మేనేజ్’ ట్యాబ్‌లో ‘ఇ-నామినేషన్’ ను ఎంచుకోండి.
  • ఆ తర్వాత స్క్రీన్‌పై ‘వివరాలను అందించండి’ ట్యాబ్ కనిపిస్తుంది, ‘సేవ్’పై క్లిక్ చేయండి.
  • ఫ్యామిలీ డిక్లరేషన్‌ను అప్‌డేట్ చేయడానికి ‘ఎస్‌’ ఆప్షన్‌ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ‘Add Family Details’ పై క్లిక్ చేయండి. నామినీగా ఒకరు లేదా ఎక్కువ మంది పేర్లు ఇవ్వచ్చు.
  • వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత ‘సేవ్’ పై క్లిక్ చేయండి.
  • తర్వాత ‘ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి.
  • తర్వాత ఓటీపీ కోసం ‘e-Sign’పై క్లిక్ చేయండి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్‌మిట్ పై క్లిక్ చేస్తే ఇ నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి