iDreamPost
android-app
ios-app

ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్.. ఇకపై ఆ అడ్డంకులు లేవు! మీ డబ్బు సేఫ్!

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఇకపై వారు కూడా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. సర్వీస్ తో పనిలేకుండానే ప్రయోజనం పొందొచ్చు.

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఇకపై వారు కూడా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. సర్వీస్ తో పనిలేకుండానే ప్రయోజనం పొందొచ్చు.

ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్.. ఇకపై ఆ అడ్డంకులు లేవు! మీ డబ్బు సేఫ్!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. పలు నిబంధనలను సరళతరం చేస్తూ ఉద్యోగులకు లాభం చేకూరేలా చేస్తున్నది ఈపీఎఫ్ఓ. ఈ క్రమంలో చందాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగులపెన్షన్ పథకం నిబంధనలను సడలించింది ఉద్యోగ భవిష్య నిధి సంస్థ. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. నిబంధనలను సడలించి ఇకపై వారు కూడా నగదు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇకపై ఏ ఉద్యోగి కూడా నష్టపోకుండా లబ్ధి చేకూరేలా ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకున్నది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజాగా ఉద్యోగుల పెన్షన్ పథకం-1995 ప్రకారం ఆరు నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్నా.. విత్ డ్రాయల్స్ బెనిఫిట్లు అందిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. కొద్ది కాలానికే ఉద్యోగం మానేసే వారిలో ఆరు నెలల పాటు ఈపీఎఫ్ లో తమ వాటా డిపాజిట్ చేసిన వారు మాత్రమే ఇప్పటి వరకూ విత్ డ్రాయల్ ప్రయోజనాలు పొందుతున్నారు. ఆరు నెలలు, అంత కన్నా తక్కువ టైంలోనే ఉద్యోగాన్ని వీడే వారికి విత్ డ్రాయల్ బెనిఫిట్లు అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిబంధనలు సవరించినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. మాటిమాటికి ఉద్యోగాలు మానేసే వారికి ఈపీఎఫ్ఓ నిబంధనలు సడలించడంతో ప్రయోజనం చేకూరనున్నది.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన ప్రకారం సదరు ఉద్యోగి పని చేసిన నెలల ఆధారంగా లెక్క కట్టి చెల్లిస్తారు. ఇప్పటి వరకు ఆరు నెలల సర్వీస్ పూర్తికాకముందే ఉద్యోగం వదిలేయడమో లేదా వేరే జాబ్ కు మారడమో చేసే ఎంప్లాయీస్ తమ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ను మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఈపీఎస్ లోని నగదును విత్ డ్రా చేసుకోలేకపోయేవారు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త రూల్ తో ఆరు నెలల సర్వీస్ పూర్తికాకపోయినా ఎంప్లాయీస్ తమ ఈపీఎఫ్, ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ ను విత్ డ్రా చేసుకోవచ్చు.