iDreamPost
android-app
ios-app

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన EPFO.. పెరగనున్న టేక్ హోమ్ శాలరీ

  • Published Jun 29, 2024 | 6:44 PM Updated Updated Jun 29, 2024 | 6:44 PM

Salaries Will Increase From Next Month: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న కీలక నిర్ణయంతో ఇప్పుడు ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. అంతకు ముందు వరకూ ఉన్న కటింగ్ లు ఇక నుంచి ఉండవు. ఇటీవల ఈపీఎఫ్ఓ ఓ సర్క్యులర్ ని జారీ చేసింది.

Salaries Will Increase From Next Month: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న కీలక నిర్ణయంతో ఇప్పుడు ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. అంతకు ముందు వరకూ ఉన్న కటింగ్ లు ఇక నుంచి ఉండవు. ఇటీవల ఈపీఎఫ్ఓ ఓ సర్క్యులర్ ని జారీ చేసింది.

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన EPFO.. పెరగనున్న టేక్ హోమ్ శాలరీ

ఉద్యోగుల జీతాల్లో కటింగ్ లు అనేవి మామూలే. ఈఎస్ఐ అని, ట్యాక్స్ అని, పీఎఫ్ అని ఇలా కొన్నిటి కోసం నెల నెలా జీతం నుంచి కొంత అమౌంట్ అనేది కట్ అవుతుంది. ట్యాక్స్ అనేది తిరిగి రాదు. వీటిలో పీఎఫ్ అమౌంట్ అనేది పదవీ విరమణ తర్వాత వడ్డీతో కలిపి వస్తుంది. ఈ కటింగ్ లు ఉంటాయి కాబట్టే చేతికి ఎంత వస్తుంది అనేదే ఫైనల్ గా పరిగణిస్తారు. బ్యాంకులో లోన్ పెట్టుకున్నా, వేరే ఆఫీస్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించినా టేక్ హోమ్ సేలరీ ఎంత అనే అడుగుతారు. ఇప్పుడు ఈ టేక్ హోమ్ సేలరీ ప్రస్తావన ఎందుకంటే?.. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ న్యూస్ తో ఆ ఉద్యోగుల టేక్ హోమ్ సేలరీ పెరగనుంది.       

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ పెరగనుంది. 2013 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం (జీఐఎస్) కింద ఉన్న కోతలను నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. అంటే ఇక నుంచి డిడక్షన్ అనేది ఉండదు. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది. 2024 జూన్ 21న దీనికి సంబంధించిన సర్క్యులర్ ని జారీ చేసింది. అయితే ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయంతో 2013 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు మాత్రమే టేక్ హోమ్ శాలరీ అనేది పెరుగుతుంది. అంతకు ముందు ఉద్యోగంలో చేరిన వారికి మాత్రం పాత రూల్సే వర్తిస్తాయి. ఈ ఉద్యోగులకు ఎప్పటిలానే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీంలో భాగంగా జీతంలో కొంత అమౌంట్ కట్ అవుతుంది.

2013 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది. వీరికి మాత్రం వచ్చే నెల నుంచి ఎక్కువ జీతం వస్తుంది. అంతేకాదు.. 2013 సెప్టెంబర్ 1 తర్వాత జాబ్ లో చేరిన ఉద్యోగుల జీతాల నుంచి కట్ అయిన అమౌంట్ మొత్తం కూడా వారికి రీఫండ్ ఇవ్వనున్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం పరిధి నుంచి 2013 సెప్టెంబర్ 1 తర్వాత చేరిన ఉద్యోగులను శాశ్వతంగా తొలగించనున్నారు. వీరికి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీంలో డిడక్షన్స్ ఉండవు కాబట్టి టేక్ హోమ్ శాలరీ అనేది పెరగనుంది. ఇక ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం అనేది.. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం పేరుతో 1982 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఉద్యోగులు గానీ.. వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు గానీ ప్రమాదాలు జరిగితే సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించడంలో భాగంగా ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీంని తీసుకొచ్చారు.