iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్ కు డెల్యూషనల్ డిజార్డర్? ఇదో పొలిటికల్ వ్యాధి!

పవన్ కళ్యాణ్ కు డెల్యూషనల్ డిజార్డర్? ఇదో పొలిటికల్ వ్యాధి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. అంతకన్న విచిత్రంగా ఉన్నాయి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్నా రాజకీయాలు. ఎప్పుడు ఏమి మాట్లాడుతారో ఆయనకే తెలియదని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. అంతేకాక ఒక సభలో అన్నమాటలను మరో సభలో మార్చేస్తుంటారు. అంతేకాక ఎప్పుడు ఎవరితో పొత్తులో ఉంటాడో అర్థం కాదు. వీటిని పక్కన పెడితే.. తనపై రాళ్ల దాడి జరిపేందుకు వైసీపీ వాళ్లు రెడీగా ఉన్నారంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో ఆయనకు డెల్యూషనల్ డిజార్టర్ అనే వ్యాధి ఉందేమో అని పొటిలికట్ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర నాలుగో విడతలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. సోమవారం అవనిగడ్డ ప్రాంతంలో  పర్యటించి.. అక్కడ  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం మంగళవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు పెడనలో జరిగే సభలో తనపై రాళ్ల దాడి చేసేందుకు వైసీపీ వాళ్లు ప్లాన్ వేశారని సమాచారం అందినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై  కృష్ణా జిల్లా పోలీసులు పవన్ కి నోటీసులు కూడా ఇచ్చారు. పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇదేమి తొలిసారి కాదు..గతంలో వైఎస్ఆర్ తన పైకి రెండు వేల మంది గుండాలని పంపితే ఒక్కణ్ణే ధైర్యంగా కుర్చీ వేసుకొని కూర్చొన్నానని, చింతమనేని తనని చంపటానికి ప్లాన్ వేశాడని, టీడీపీ తనని అంతమొందించటానికి ప్రణాళికలు వేస్తుందని, కోనసీమలో వారాహి పై దాడి చేసి సభలో 50 మందిని చంపటానికి సిద్ధపడ్డారని ఇలా పలుసార్లు ఊహకందని తీవ్ర ఆరోపణలు చేశాడు.

ఇటీవల హైదరాబాద్ లో పవన్ ఇంటి ముందు ఓ చిన్న గొడవ జరిగితే తనని చంపటానికి గుజరాత్ నుండి గుండాలని, కిరాయి హంతకులని దింపారని తనకు సమాచారం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకా జనసేన కార్యకర్తలు, వీర మహిళలు సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టారు. ముగ్గురు తాగుబోతుల మధ్య చిన్న గొడవని రెక్కి కానీ, హత్యా ప్రయత్నం కూడా కాదని తెలంగాణా పోలీస్ విచారణలో తేలింది. అసలు ఈ స్టేట్మెంట్స్ తన రాజకీయ వ్యూహంలో భాగంగా ఇస్తున్నాడా లేక తాను అలా ఊహించుకొని భ్రమ పడుతున్నాడా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఇచ్చి ఉంటే ఫర్వాలేదు కానీ నిజంగానే తన పై దాడి చేయటానికి ప్రయత్నిస్తున్నారని భ్రమ పడి భయపడుతుంటే మాత్రం అతని మానసిక ఆరోగ్య స్థితి గురించి ఆలోచించాల్సిందేని కొందరు రాజకీయ నిపుణలు అంటున్నారు.

తనని తాను అధికంగా ఊహించుకోవడం, తాను ఏమైనా చేయగలనని అనుకోవడం, అదే స్థాయిలో ఎదుటి వారు తనని ఇబ్బంది పెట్టటానికి కానీ, తన పై దాడి చేయటానికి కానీ వస్తున్నారని భ్రమ పడటం. ఆ విషయం తనకి సమాచారం ఇచ్చారని, సాక్ష్యాలతో సహా తెలుసనీ బలంగా నమ్మడం. ఎదుటి వారికి కూడా అదే చెప్పుకొంటూ ఉండటం ఈ రెండు వ్యాధుల ప్రధాన లక్షణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాను పెరిగిన పరిస్థితులు, నిత్యం ఎదుర్కొంటున్న, గమనిస్తున్న ఘటనలను నిజమని నమ్మే స్థితికి చేరుకోవడమే డెల్యూషనల్ డిజార్డర్ గానీ పారానోయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధి కానీ అయ్యుండొచ్చు మానసిక వ్యాధి నిపుణులు అంటున్నారు.

సినిమాల్లో మాదిరి నిజజీవితంలో తన రాజకీయ ప్రత్యర్థులుగా తాను భావిస్తున్న నేతలు తన పై వేల మంది రౌడీలు, గూండాలను పంపిస్తున్నారని భ్రమ పడుతూ మానసిక వ్యాధి ముదర బెట్టుకొంటున్నట్టు ఉందని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. సినీ రంగంలో విపరీతమైన హింస చూపించవద్దని మేధావులు మొదటి నుండి మొత్తుకొనేది ఇందుకేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి.. పవన్ కల్యాణ్ కి డెల్యూషనల్ డిజార్డర్ వ్యాధి ఉందంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.