Somesekhar
టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ గతంలో ముంబై ఇండియన్స్ కు ఆడిన సమయంలో జరిగిన రహస్యాలను తాజాగా బయటపెట్టాడు. ఆ టైమ్ లో బుమ్రా, పాండ్యాలను కాపాడింది రోహిత్ శర్మనే అంటూ సంచలన విషయాలు వెల్లడించాడు.
టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ గతంలో ముంబై ఇండియన్స్ కు ఆడిన సమయంలో జరిగిన రహస్యాలను తాజాగా బయటపెట్టాడు. ఆ టైమ్ లో బుమ్రా, పాండ్యాలను కాపాడింది రోహిత్ శర్మనే అంటూ సంచలన విషయాలు వెల్లడించాడు.
Somesekhar
ఐదుసార్లు ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఆ పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది యాజమాన్యం. గత కొంత కాలంగా ఇది హాట్ టాపిక్ గా మారిన విషయం మనందరికి తెలిసిందే. అయితే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్థివ్ గతంలో ముంబై ఇండియన్స్ కు ఆడిన సమయంలో జరిగిన రహస్యాలను తాజాగా బయటపెట్టాడు. ఆ టైమ్ లో బుమ్రా, పాండ్యాలను కాపాడింది రోహిత్ శర్మనే అంటూ సంచలన విషయాలు వెల్లడించాడు. మరి ఏ విషయంలో వారిద్దరిని హిట్ మ్యాన్ కాపాడాడో ఇప్పుడు చూద్దాం.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత గొప్ప నాయకుడో ఇటీవలే చెప్పుకొచ్చాడు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. తన తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రత్యేక చొరవతీసుకుని మరీ ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్ట్ మధ్యలో పంపించాడని, ఇలాంటి నాయకుడిని ఇంతవరకు చూడలేదని హిట్ మ్యాన్ గొప్ప మనసుపై ప్రశంసలు కురిపించాడు అశ్విన్. తాజాగా రోహిత్ శర్మ ఎలాంటి మనస్తత్వం కలవాడో, ముంబై ఇండియన్స్ కు తాను ఆడే టైమ్ లో ఎవ్వరికీ తెలియని నిజాలను ప్రపంచానికి తెలియజేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్.
రోహిత్ గురించి పార్థివ్ పటేల్ మాట్లాడుతూ..”టీమ్ లోని ప్లేయర్లు అండగా నిలిచే కెప్టెన్స్ లో ముందుంటాడు రోహిత్ శర్మ. ఈ విషయం దగ్గరుండి చూశాను. ఐపీఎల్ కోసం 2014లో ముంబై టీమ్ లోకి వచ్చిన బుమ్రా తొలి సీజన్ ఆడలేదు. అయితే నెక్ట్స్ సీజన్ లో ఆడినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడిని తీసేద్దామని ఫ్రాంచైజీ చెప్పింది. కానీ రోహిత్ పట్టుబట్టి మరీ అతడిని ఉంచాడు. ఇప్పుడు బుమ్రా ముంబైకి కీలక బౌలర్ అయ్యాడు. ఇలాగే హార్దిక్ పాండ్యా విషయంలోనూ జరిగింది. 2015లో ఎంఐ టీమ్ లోకి వచ్చిన పాండ్యా.. తొలిసీజన్ లో పర్వాలేదనిపించాడు. కానీ 2016లో అట్టర్ ప్లాప్ అయ్యాడు. కానీ పాండ్యాను మాత్రం టీమ్ లోంచి తీసేయనీయలేదు రోహిత్. అలా పాండ్యాను కాపాడాడు” అంటూ ఎవ్వరికీ తెలియని సంచలన నిజాలు బయటపెట్టాడు పార్థివ్ పటేల్.
వీటితో పాటుగా 2017లో జోష్ బట్లర్ కోసం తన బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చుకున్న విషయాన్ని గుర్తుచేశాడు. అతడిని ఓపెనర్ గా దించి.. తర్వాత బ్యాటింగ్ కు వచ్చాడు రోహిత్. దీంతో బట్లర్ తో కలిసి తాను ఓపెనింగ్ చేసిన విషయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు ఈ మాజీ ప్లేయర్. ప్రస్తుతం పార్థివ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో.. అభిమానులకు, నెటిజన్లకు రోహిత్ పై మరింత గౌరవం పెరిగింది. మరి ఐపీఎల్ లో బుమ్రాను పాండ్యాను కాపాడిన రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: ఆ పాక్ బౌలర్ పిల్లబచ్చా.. బుమ్రానే బెస్ట్ బౌలర్: పాక్ మాజీ పేసర్