iDreamPost

ఆ పాక్ బౌలర్ పిల్లబచ్చా.. బుమ్రానే బెస్ట్ బౌలర్: పాక్ మాజీ పేసర్

టీమిండియా స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు పాకిస్తాన్ మాజీ పేసర్. బుమ్రా ముందు ఆ పాక్ బౌలర్ చాలా తక్కువని, అతడితో బుమ్రాకు పోలికేంటి అంటూ ప్రశ్నించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు పాకిస్తాన్ మాజీ పేసర్. బుమ్రా ముందు ఆ పాక్ బౌలర్ చాలా తక్కువని, అతడితో బుమ్రాకు పోలికేంటి అంటూ ప్రశ్నించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ పాక్ బౌలర్ పిల్లబచ్చా.. బుమ్రానే బెస్ట్ బౌలర్: పాక్ మాజీ పేసర్

జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా పేస్ దళానికి నాయకుడిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో కూడా 19 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే నెంబర్ వన్ ర్యాంక్ ను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే లేటెస్ట్ గా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బుమ్రాను వెనక్కినెట్టి టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఇదిలా ఉండగా.. ఓ పాక్ బౌలర్ ని బుమ్రాతో పోల్చడంపై కాస్త ఘాటుగానే స్పందించాడు పాకిస్తాన్ మాజీ పేసర్. బుమ్రా ముందు అతడో పిల్లబచ్చా అంటూ పేర్కొన్నాడు.

టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ముందు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఓ పిల్లబచ్చా అని చెప్పుకొచ్చాడు పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్. తాజాగా ఓ ఛానల్ తో మాట్లాడుతూ..”షాహీన్ అఫ్రిది ఎప్పుడైనా గాయపడితే.. అతడు మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టినప్పుడు అతడి బౌలింగ్ పేస్ తగ్గుతుంది. కానీ బుమ్రా బౌలింగ్ అలా కాదు.. ఇంజ్యూరి నుంచి కోలుకుని అంతకంటే వేగంగా, గొప్పగా రాణించగలడు. కొంత మందే ఇలా రీ ఎంట్రీలో సూపర్ ఫామ్ అందుకోగలరు. అందుకే వీరిద్దరిలో నేను బుమ్రానే బెస్ట్ అని చెప్తుంటాను. అయితే ఫాస్ట్ బౌలర్లకు గాయాలు కావడం అనేది సహజమే” అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్.

Bumrah is the best bowler

కాగా.. 2022-23 మధ్యకాలంలో ఇటు బుమ్రా, అటు షాహీన్ అఫ్రిది గాయాల బారినపడి సతమతమైన సంగతి తెలిసిందే. ఇక గతేడాది ఆగస్టులో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు బుమ్రా. 2023 వరల్డ్ కప్ లో సైతం అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 11 మ్యాచ్ ల్లో 20 వికెట్లు పడగొట్టి టీమ్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. కానీ షాహీన్ అఫ్రిది మాత్రం ఇలా రాణించలేకపోతున్నాడు. పాక్ టీ20 కెప్టెన్ గా ఇటీవల కివీస్ పర్యటనకి వెళ్లిన అతడికి దారుణ పరాజయం ఎదురైంది. షాహీన్ కంటే బుమ్రానే బెస్ట్ అన్న మహ్మద్ ఇర్ఫాన్ 2012లో పాక్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్ లో కేవలం 4 టెస్టుల్లో 10 వికెట్లు, 60 వన్డేల్లో83 వికెట్లు, 22 టీ20ల్లో 16 వికెట్లు తీశాడు. మరి ఓ పాక్ పేసర్ పాక్ బౌలర్ పరువుతీస్తూ.. బుమ్రాను ప్రశంసించడపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: 42 సార్లు రంజీ విజేతగా ముంబై! వాళ్లే ఇన్నిసార్లు గెలవడానికి కారణం?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి