iDreamPost

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి 14 ఏళ్లు జైలు శిక్ష!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి వరుస కష్టాలు వెధిస్తున్నాయి. ఇప్పటికే ఇస్లామాబాద్ హై కోర్టు ఆయకు పదేళ్లు జైలు శిక్ష విధించగా.. మరో కేసులో కోర్టు ఆయకు పెద్ద షాక్ ఇచ్చింది.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి వరుస కష్టాలు వెధిస్తున్నాయి. ఇప్పటికే ఇస్లామాబాద్ హై కోర్టు ఆయకు పదేళ్లు జైలు శిక్ష విధించగా.. మరో కేసులో కోర్టు ఆయకు పెద్ద షాక్ ఇచ్చింది.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి 14 ఏళ్లు జైలు శిక్ష!

ఒకప్పుడు క్రికెట్ రంగంలో తనదైన ఆటతో కోట్ల మంది అభిమానం సంపాదించిన ఆటగాడు ఇమ్రాన్ ఖాన్. సినీ, క్రీడా రంగానికి చెందిన వారు చాలా వరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ సైతం రిటైర్‌మెంట్ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పాక్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ – పీటీఐ పార్టీని కి చైర్మన్ గా కొనసాగిన ఆయన పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నోకోబడ్డారు. ప్రధానిగా కొనసాగిన ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అధికార రహస్యాలు వెల్లడించిన కేసులో ఇమ్రాన్ ఖాన్ కి ఇస్లామాబాద్ హై కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

మాజీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అధికారిక రహస్య పత్రాలు బయటపెట్టిన కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి ప్రత్యేక న్యాయస్థానం పదేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఆయనపై తోషాఖానా కేసు కొనసాగుతున్న సమయంలో ఇస్లామాబాద్ హై కోర్టు దాని నిలిపివేసి.. వెంటనే సైఫర్ కేసులో ఆయనను అరెస్ట్ చేసి పదేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తోషఖానా కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. విదేశీ నాయకులు ఇచ్చిన ఖరీదైన కానుకలను విక్రయించి సొమ్ము చేసుకున్నట్లుగా ఇమ్రాన్ దంపతులపై అభియోగాలు నమోదయ్యాయి.

ఈ క్రమంలోనే దర్యాప్తులో ఇమ్రాన్ దంపతులు దోషులుగా తేలడంతో న్యాయస్థానం బుధవారం శిక్ష ఖారారు చేసింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ కోర్టు ఇమ్రాన్ ఖాన్ పై అనర్హత వేటు వేసింది. అంతేకాదు 1.5 బిలియన్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 8న పాకిస్థాన్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ చుట్టూ వివాదాలు చెలరేగడం.. ఆయనకు జైలుశిక్ష పడటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి