iDreamPost

హీరోయిన్ లయలో ఈ టాలెంట్ ఉందని తెలుసా? ఆ గేమ్‌ లో నేషనల్ ఛాంపియన్!

  • Published May 23, 2024 | 4:37 PMUpdated May 23, 2024 | 4:37 PM

టాలీవుడ్‌ హీరోయిన్‌ లయ ఎన్నో సినిమాల్లో తన నటనతో, అందంతో ‍ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు హీరోయిన్‌గా మాత్రమే పరిచయమైన లయ ఆ గేమ్‌ లో ఛాంపియన్ కావడం గమన్హారం.

టాలీవుడ్‌ హీరోయిన్‌ లయ ఎన్నో సినిమాల్లో తన నటనతో, అందంతో ‍ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు హీరోయిన్‌గా మాత్రమే పరిచయమైన లయ ఆ గేమ్‌ లో ఛాంపియన్ కావడం గమన్హారం.

  • Published May 23, 2024 | 4:37 PMUpdated May 23, 2024 | 4:37 PM
హీరోయిన్ లయలో ఈ టాలెంట్ ఉందని  తెలుసా? ఆ గేమ్‌ లో నేషనల్ ఛాంపియన్!

హీరోయిన్‌ ‘లయ’.. ఈ మధ్య కాలంలో ఈ పేరు తరుచుగా ఏదో ఒక రకంగా సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. అచ్చ తెలుగమ్మాయి అయిన లయ మొదటగా స్వయంవరం సినిమాతో తెలుగు వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. ఇక ఆ సినిమాలో ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది లయ. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకున్న లయ హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి హిట్ చిత్రాల్లో నటించింది.  అంతేకాకుండా ఈమెకు అప్పటిలో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉండేది.

ఇలా మొత్తం మీదకు లయ ఇటు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో దాదాపు 40 సినిమాల్లో నటించింది. ఇక లయ నటనకు గాను వరుసగా నంది అవార్డులను కూడా అందుకుంది. అయితే 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతానికి వీరికి ఒక పాపా, బాబు ఉ‍న్నారు. ఇక రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న లయ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా డాన్స్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా అలీతో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అదేమిటంటే..

లయ మొదట రావడానికి కారణం తన తల్లిదండ్రులే అని తెలిపింది. అదేలా అంటే.. స్టార్ 2000 కంటెస్ట్ ప్రకటన చూసి తనకు ఇష్టం లేకపోయినా తెలియకుండానే తన ఫోటోస్ ను తల్లిదండ్రులు పంపారని, అందులో వచ్చానని.. ఈ క్రమంలోనే.. విజయవాడలోని ఓ కార్యక్రమంలో స్వయంవరం సినిమా యూనిట్ తనను చూసి ఛాన్స్ ఇచ్చారని తెలిపింది. అయితే హీరోయిన్‌ అయిన లయ తాను చెస్ ఛాంపియన్ అనే విషయాన్ని బయటపెట్టింది.  అంతేకాకుండా.. కోనేరు హంపి వాళ్ల నాన్న దగ్గర చెస్ నేర్చుకున్నానని.. దాదాపు 7 సార్లు నేషనల్స్ కు వెళ్లినని, అలాగే ఓసారి గెలిచానని కూడా చెప్పుకొచ్చింది.  ఇక లయ చెప్పిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. కాగా, ఇన్నాళ్లు హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న లయ.. నేషనల్ లెవల్స్ చెస్ ఆడిందని తెలిసి ఆమె అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇక సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటంతో.. తనకోసం కొన్నాళ్ల క్రితం రకరకాల రూమర్స్‌ వచ్చాయి. ముఖ్యంగా తన ఆర్థిక స్థితి బాలేదని.. టీ అమ్ముకొని బతుకున్నట్లు చాలా దారుణంగా రాశారని, ఇక ఆ వార్తలు చూసి తన కుటుంబం చాలా బాధపడిందని ఆమె తెలిపారు. అయితే ప్రస్తుతం లయ తెలుగులో నితిన్ హీరోగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న తమ్ముడు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరి, హీరోయిన్‌ అయిన లయ చెస్ ఛాంపియన్ కూడా కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి