iDreamPost

ప్రభాస్ సంస్కారానికి హ్యాట్సాఫ్! ఇంత మంచోడివి ఏంటి డార్లింగ్!

యంగ్ రెబల్ స్టార్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమ ప్రమోషన్లలో భాగంగా ఈ నెల 22న ఓ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్.

యంగ్ రెబల్ స్టార్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమ ప్రమోషన్లలో భాగంగా ఈ నెల 22న ఓ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్.

ప్రభాస్ సంస్కారానికి హ్యాట్సాఫ్! ఇంత మంచోడివి ఏంటి డార్లింగ్!

ఇంతింతై వటుడింతై అన్న సామెత ప్రభాస్‌కు సరిగ్గా సరిపోతుంది. ఎక్కడ ఈశ్వర్.. ఎక్కడ సలార్.. 22 ఏళ్ల కెరీర్‌లో అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. బాహుబలి మూవీ తర్వాత అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా మూవీస్ చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం వరుస మూవీ లైనప్స్‌తో బిజీ బిజీగా మారిపోయాడు. కల్కి 2898AD మూవీ కంప్లీట్ చేసి, రాజా సాబ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. వీటితో పాటు సలార్ 2, స్పిరిట్ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. కన్నప్పలో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నాడు. ఎంత ఎదిగినా వదిలి ఉండాలన్న పదానికి నిలువెత్తు సాక్ష్యంగా మారాడు ఈ యంగ్ రెబల్ స్టార్. మరోసారి తన వ్యక్తిత్వం, సంస్కారంతో ఆకట్టుకున్నాడు.

సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేదా ఏదైనా సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ జరుగుతున్నాయంటే.. ఎవరైనా గెస్టులు వస్తే.. ఆ సినిమా హీరో హీరోయిన్లు, దర్శకుడు, ఇతర టెక్నీషియన్స్ తొలుత వారినే ప్రస్తావిస్తారు. వారి మీద ప్రశంసలు కురిపిస్తారు. ఆ తర్వాత సినిమాలో నటించిన వాళ్ల పేర్లను ప్రస్తావిస్తారు. కానీ గురువారం జరిగిన బుజ్జి లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ప్రభాస్, దర్శక, నిర్మాతలు తప్ప మరెవ్వరూ లేరు. ఇందులో కీలక పాత్రలు పోషించిన అమితాబ్, కమల్ హాసన్, హీరోయిన్లు దీపికా, దిశా హాజరు కాలేదు.  వారెవ్వరూ లేకపోయినా పదే పదే గుర్తుచేసుకున్నాడు. అమితాబ్, కమల్ సార్‌తో పనిచేయడం తన అదృష్టమని అన్నాడు. అంతేనా కమల్, అమితాబ్‌లకు కృతజ్ఞతలు.. ఎన్ని ధన్యవాదాలు చెప్పాడో. అమితాబ్ బచ్చన్ లాంటి నటుడు ఇండియాకే గర్వకారణమన్నాడు. అలాగే సాగర సంగమం చూసి ఆయన స్ఫూర్తి పొందినట్లు తెలిపాడు.

అంతేకాకుండా దీపికాను ఇంటర్నేషనల్ స్టార్, గార్జియస్, బ్యూటీఫుల్, సూపర్ స్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. దిశా పటానీని సైతం కూడా హాట్ స్టార్ అంటూ కొనియాడాడు. వీరంతా ఇక్కడ లేకపోయినా మర్చిపోకుండా ప్రశంసించాడు యంగ్ రెబల్ స్టార్. అది అతడి సంస్కారానికి నిదర్శనం. ఇది చూసి చాలా మంది నిజంగా మా ప్రభాస్ గ్రేట్ అంటూ.. ఇంత మంచోడివి ఏంటన్నా అంటున్నారు. ఎదురుగా మనుషులు ఉంటేనే మర్చిపోతున్న ఈ రోజుల్లో.. ఈ ఫంక్షన్‌కు హాజరుకానీ నటీనటుల గురించి మాట్లాడి.. అభిమానుల గుండెల్లో మరో మెట్టు ఎక్కాడు డార్లింగ్. అంతేకాకుండా ఫ్యాన్స్ విషయంలో కూడా ఫెన్స్ వేయడంపై స్పందిస్తూ.. మీ సెక్యూరిటీ గురించే ఈ ఏర్పాట్లు చేశామని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్పాడు. దీంతో ప్రభాస్ పట్ల మరింత గౌరవం పెరిగిపోయింది అభిమానులకు. ఫ్యాన్స్ డార్లింగ్ ను చూసి మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న సంగతి విదితమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి