iDreamPost

క్రైమ్ ని శాసించడంలో పుష్పాని మించిపోయాడు.. OTTలో ఈ సిరీస్ కి పిచ్చెక్కిపోతారు!

OTT Suggestions- Best Action Thriller Web Series: పాన్ ఇండియా సినిమాలో పుష్పరాజ్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే క్రైమ్ వరల్డ్ శాసించడంలో పుష్పాని మించిన వాడు ఒకడు ఉన్నాడని మీకు తెలుసా? హాలీవుడ్ లో అదిరిపోయే సిరీస్ ఉంది.

OTT Suggestions- Best Action Thriller Web Series: పాన్ ఇండియా సినిమాలో పుష్పరాజ్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే క్రైమ్ వరల్డ్ శాసించడంలో పుష్పాని మించిన వాడు ఒకడు ఉన్నాడని మీకు తెలుసా? హాలీవుడ్ లో అదిరిపోయే సిరీస్ ఉంది.

క్రైమ్ ని శాసించడంలో పుష్పాని మించిపోయాడు.. OTTలో ఈ సిరీస్ కి పిచ్చెక్కిపోతారు!

సామాన్యంగా సినిమాల్లో హీరో అంటే కచ్చితంగా మంచి పనులు చేయాలి. మంచిగా ఉండాలి. మంచికి ప్యాంటు షర్ట్ వేస్తే అతను అయ్యి ఉండాలి. ఇవన్నీ గతంలో వచ్చిన సినిమాలు. కానీ, హీరోయిజం చూపించడానికి నెగిటివ్ రోల్స్ ని కూడా వాడచ్చు అని చాలా తక్కువ సినిమాలు ప్రూవ్ చేశాయి. వాటిలో సుకుమార్- అల్లు అర్జున్ తీసిన పుష్ప సినిమా రుజువు చేసింది. పుష్పగాడి లుక్స్, విలనిజం, నేరాలు చేసే తీరుకి పాన్ ఇండియా లెవల్లో ఉన్న ఆడియన్స్ పిచ్చోళ్లు అయిపోయారు. పుష్పరాజ్ రూలింగ్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. అయితే ఓటీటీలో పుష్పరాజ్ ని మించిన ఒక గ్యాంగ్ స్టర్ ఉన్నాడని మీకు తెలుసా?

గ్యాంగులు, గ్యాంగ్ స్టర్లు ఉండే సినిమాలు, సిరీస్లు మీరు చాలానే చూసుంటారు. కానీ, పుష్ప మూవీ అందరికీ ఎంతో బాగా నచ్చింది. ఎందుకంటే అందులో ఉండే ఎలివేషన్స్, పుష్పరాజ్ డామినేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అలాంటి ఎలివేషన్స్, ఆ రేంజ్ డామినేషన్ తో హాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ ఉంది. అది స్టార్ట్ అయ్యి చాలా ఏళ్లు అవుతోంది. కానీ, మన తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువ మందికి అది తెలుసు. అయితే ఆ హీరో ముఖాన్ని మాత్రం సోషల్ మీడియాలో విరివిగా చూస్తూనే ఉంటారు. ఎక్కువగా యాటిట్యూడ్ వీడియోలు, వాట్సాప్ స్టేటస్లో చూస్తూ ఉంటారు. కానీ, అతను ఏ సిరీస్లో చేశాడు అనేది మాత్రం చాలా మందికి తెలియదు.

ఆ సిరీస్లో ఉన్న మ్యూజిక్, ఆ వీడియోలు, ఆ హీరో ముఖం అంతలా వైరల్ అయ్యింది అంటే కథ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు.. ఆ వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో ఉంటుందో. మీరు ఈ సిరీస్ గురించి ఎంత ఊహించుకున్నా కూడా అంతకు మించే ఉంటుంది. థామస్ షెల్బీ అనే ఒక వ్యక్తి క్రైమ్ సామ్రాజ్యాన్ని స్థాపించి.. ఎదురులేని శక్తిగా ఎదుగుతాడు. వాళ్ల గ్యాంగ్ లో చేరేందుకు సబ్ స్క్రిప్షన్ కూడా పెడతాడు. అలా ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతాడు. క్రైమ్ అంటే సవాళ్లు కూడా ఉంటాయి. అలాగే ఆ సవాళ్లను దాటుకుంటూ.. తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ అతను పోరాడే తీరు మెస్మరైజింగ్ గా ఉంటుంది. పోలీసు వ్యవస్థ కూడా అతడిని ఆపలేక నానా ఇబ్బందులు పడుతుంది.

ఈ సిరీస్ పేరు “పీకీ బ్లైండర్స్“. ఈ సిరీస్ తెలిసినవాళ్లు వావ్ అంటారు. తెలియని వాళ్లు చూసిన తర్వాత కచ్చితంగా ఓ రేంజ్ సిరీస్ అంటారు. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2013లో స్టార్ట్ అయ్యింది. 2022 వరకు ఈ పీకీ బ్లైండర్స్ కొత్త సీజన్స్ వదులుతూ వచ్చింది. ఇందులో మొత్తం 6 సీజన్స్ వచ్చాయి. ఈ ఆరు సీజన్స్ లో మొత్తం 36 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సగటున 55 నిమిషాల నుంచి 83 నిమిషాల వరకు ఉంటుంది. కాకపోతే ఇది తెలుగులో అందుబాటులో లేదు. ఇంగ్లీష్ లో ఉంది.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి