iDreamPost

Suspense Thriller In OTT: పక్కింటి బెడ్‌రూమ్‌లో బూ*తు పనులు! OTTలోని ఈ ఎరోటిక్ థ్రిల్లర్‌ మిస్ కాకండి!

  • Published May 23, 2024 | 4:42 PMUpdated May 23, 2024 | 4:42 PM

OTT Movie Suggestion: ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏమున్నాయా అని సెర్చ్ చేసే ప్రేక్షకుల కోసం.. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమా గురించి చూసేద్దాం . ఇది కొత్తగా రిలీజ్ అయినా సినిమా అయితే కాదు కానీ ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వారికి మాత్రం ఇది కొత్తగానే ఉంటుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Movie Suggestion: ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏమున్నాయా అని సెర్చ్ చేసే ప్రేక్షకుల కోసం.. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమా గురించి చూసేద్దాం . ఇది కొత్తగా రిలీజ్ అయినా సినిమా అయితే కాదు కానీ ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వారికి మాత్రం ఇది కొత్తగానే ఉంటుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published May 23, 2024 | 4:42 PMUpdated May 23, 2024 | 4:42 PM
Suspense Thriller In OTT: పక్కింటి బెడ్‌రూమ్‌లో బూ*తు పనులు! OTTలోని ఈ ఎరోటిక్ థ్రిల్లర్‌ మిస్ కాకండి!

వీకెండ్ వస్తుందంటే ఓటీటీ లో ఏ ఏ సినిమాలు ఉన్నాయా అని సెర్చ్ చేసేస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఎలాగూ ఈ వారం ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో బెస్ట్ మూవీస్ ఏంటి ఇలా అన్నిటిని చూసేసి ఉంటారు. అవన్నీ పక్కపెట్టేస్తే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమా గురించి చూసేద్దాం. ఇది కొత్తగా రిలీజ్ అయిన సినిమా అయితే కాదు. కానీ ఇప్పటివరకు చూడని వారికి మాత్రం ఈ సినిమా కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఓటీటీ లో ఎన్నో సినిమాలు ఉన్నాయి కాబట్టి.. వాటిలో కొన్ని సినిమాలను మిస్ చేసే అవకాశం లేకపోలేదు. మరి మీరు మిస్ చేసిన సినిమాలలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

ఈ ఇంట్రెస్టింగ్ సినిమా కథేంటంటే.. పిప్పా, థామస్ భార్య భర్తలు. వీరిద్దరూ కొత్తగా అపార్ట్ మెంట్ లోకి వస్తారు. అదే అపార్ట్మెంట్ లో వారి ఫ్లాట్ కు ఎదురుగా మరొక జంట ఉంటుంది. ఎదురింట్లో ఉండే ఆమె భర్త ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. పిప్పా వాళ్ళ ఇంట్లో నుంచి చూస్తే ఎదురు ఇంట్లో ఏం జరుగుతుందో అంతా కనిపించేస్తుంది. మోడల్స్ ను ఫొటోస్ తీయడం దగ్గరనుంచి వారితో ఇంటిమేట్ అవ్వడం వరకు అంతా కనిపిస్తుంది. దీనితో ఆ ఇంట్లో ఏం జరుగుతుందా అని చూసేందుకు ఈ జంట ఆసక్తి చూపిస్తారు. కానీ పిప్పా భర్త మాత్రం ఇలా చేయడం తప్పని వారిస్తాడు . అయినా సరే పిప్పా రోజు అవన్నీ చూస్తుంది. ఆ ఫోటోగ్రాఫర్ భార్యకు అన్యాయం జరుగుతుందని. ఎలా అయినా ఆమెకు ఈ విషయాన్నీ తెలియజేయాలని అనుకుంటుంది.

ఓ రోజు అలానే ఆమెను బయట కలిసి .. ఆమెకు ఆమె భర్త విషయం చెప్తుంది. దీనితో ఆమె ఫోటోగ్రాఫర్ అయిన తన భర్తను చంపేయాలని డిసైడ్ అవుతుంది. కానీ ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఇదంతా పిప్పా, థామస్ చూస్తూనే ఉంటారు. ఆమె మరణానికి కారణం పిప్పానే అని భావించి థామస్ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే పిప్పా ఓ పబ్ లో ఆ ఫోటోగ్రాఫర్ ను కలుస్తుంది. అతను తాను ఎంతమందితో ఇంటిమేట్ అయినా తనకు తన భార్య అంటే ప్రాణమని చెప్పుకొస్తాడు. దీనితో పిప్పా బాధపడుతుంది. చివరికి ఆమెను కూడా ఆ ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తానని చెప్పి తీసుకెళ్లి.. ఆమెతో కూడా ఇంటిమేట్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో థామస్ వాళ్ళని చూస్తాడు. దీనితో అతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? ఆ ఫోటోగ్రాఫర్ ఎవరు ? అతని భార్య నిజంగానే చనిపోతుందా ? పిప్పా కు ఎలాంటి ట్విస్ట్ లు ఎదురౌతాయి ? చివరికి ఈ కథ ఎలా ముగుస్తుంది ? ఇవన్నీ తెలియాలంటే “ది వోయెర్స్ ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి