iDreamPost

ఇంటర్ పాసయ్యారా? ఇండియన్ ఆర్మీ ఫ్రీగా BTech చదివించి, జాబ్ కూడా ఇస్తదని తెలుసా!

మీరు ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ఆర్మీలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇ:డియన్ ఆర్మీలో ఉచితంగానే ఇంజనీరింగ్ చదివే ఛాన్స్ వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ఆర్మీలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇ:డియన్ ఆర్మీలో ఉచితంగానే ఇంజనీరింగ్ చదివే ఛాన్స్ వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఇంటర్ పాసయ్యారా? ఇండియన్ ఆర్మీ ఫ్రీగా BTech చదివించి, జాబ్ కూడా ఇస్తదని తెలుసా!

ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ పాసైన విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తు కోసం ఏ కోర్సులు చదివితే బెటర్ అని ఆలోచిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలంటే అందుబాటులో ఉన్న కోర్సులు ఏంటని ఆరా తీస్తున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఇంటర్ పాసైతే చాలు ఇండియన్ ఆర్మీలో ఫ్రీగా ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేయొచ్చు. బీటెక్/బీఈ కోర్సులను పూర్తి ఉచితంగానే కంప్లీట్ చేయొచ్చు. అంతే కాదు ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఆర్మీలో ఉద్యోగం కూడా పొందొచ్చు. ఆర్మీలో చేరాలని కలలుకనే వారికి ఇదే మంచి అవకాశం.

ఇండియన్ ఆర్మీ జనవరి 2025లో ప్రారంభమయ్యే 52వ ’10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్)’ కోర్సు శిక్షణలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్) 2024లో పాసైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులో ప్రవేశాలకు అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. మే 13నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. జూన్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 52 కోర్సు(టీఈఎస్‌)- జనవరి 2025

మొత్తం ఖాళీలు:

  • 90

అర్హత:

  • గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ (మెయిన్స్) 2024లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 16½ -19½ సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

శిక్షణ:

  • మొత్తం ఐదేళ్లు కోర్సు. ఇందులో ఏడాది పాటు బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్, నాలుగేళ్లు టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజనీరింగ్‌(బీఈ/బీటెక్‌) డిగ్రీ అందజేస్తారు.

వేతనం:

  • మూడేళ్ల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. నాలుగేళ్ల శిక్షణ అనంతరం పూర్తి వేతనం అమలవుతుంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారికి ఢిల్లీలోని జేఎన్‌యూ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. వీరిని తదనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 13-05-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 13-06-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి