iDreamPost

ప్రయాణం మూవీలో అమాయకంగా కనిపించిన హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు చాలా బో*ల్డ్!

మంచు వారబ్బాయి మంచు మనోజ్ కాస్త డిఫరెంట్ లుక్స్ లో కనిపించే చిత్రం ప్రయాణం. 2009లో వచ్చిన ఈ మూవీ సైలెంట్ హిట్. ఇప్పటికీ టీవీల్లో వస్తుంటే.. వాచ్ చేసేవాళ్లున్నారు. ఇందులో నటించిన హీరోయిన్ గుర్తుందా

మంచు వారబ్బాయి మంచు మనోజ్ కాస్త డిఫరెంట్ లుక్స్ లో కనిపించే చిత్రం ప్రయాణం. 2009లో వచ్చిన ఈ మూవీ సైలెంట్ హిట్. ఇప్పటికీ టీవీల్లో వస్తుంటే.. వాచ్ చేసేవాళ్లున్నారు. ఇందులో నటించిన హీరోయిన్ గుర్తుందా

ప్రయాణం మూవీలో అమాయకంగా కనిపించిన హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు చాలా బో*ల్డ్!

లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. నిజంగా ఇద్దరు ప్రేమికులు తొలి చూపులోనే ప్రేమలో పడతారే లేదో తెలియదు కానీ.. మన తెలుగు సినిమాల్లో పుష్కలంగా ఇలాంటి కథలు వచ్చాయి. అందులో ఒకటి ప్రయాణం. మంచు వారబ్బాయి, సొట్ట బుగ్గల సిన్నోడు మంచు మనోజ్ హీరోగా నటించిన చిత్రం ఇది. ఇందులో మరింత స్మార్ట్ గాయ్‌గా కనిపిస్తాడు. 2009లో వచ్చిన ఈ మూవీ సైలెంట్ హిట్. మనోజ్ సినిమాల్లో కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది ప్రయాణం. ఇందులో బ్రహ్మనందంతో కామెడీ సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ మూవీకి చంద్రశేఖర్ ఏలేటీ దర్శకుడు. ఆర్యకి ఆర్ట్స్ పతాకంపై సీతా ఏలేటి నిర్మించారు. ఇందులో ‘మేఘమా .. ఆగలమ్మా, వానలా కరుగుటకు’ అప్పట్లో మెలోడి హిట్‌గా నిలిచింది. ఇక ఇందులో హీరోయిన్‌గా నటించింది హారిక

ఈ సినిమాతో హారికగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది పాయల్ ఘోష్. 2008లో వచ్చిన బీబీసీ టెలీ ఫిల్మ్ షార్ప్స్ పెరిల్ అనే ఇంగ్లీష్ చిత్రం ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత ప్రయాణంలో నటించింది. 2010లో ఓ కన్నడ చిత్రంలో మెరిసింది ఈ బ్యూటీ. కానీ ఆమె అసలు పేరు బయటకు వచ్చింది మాత్రం ఊసరవెల్లి మూవీతోనే.  తమన్నా ఫ్రెండ్ చిత్ర పాత్రలో నటించి, మెప్పించింది ఈ బ్యూటీనే. ఇందులో తమన్నా కన్నా ఆమెకు మంచి పేరు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఆమెను టీజ్ చేసే సన్నివేశాలు భలే సరదాగా ఉంటాయి. దీంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారంతా.. కానీ కేవలం ఒక్క తెలుగు మూవీతోనే సరిపెట్టుకుంది ఈ బ్యూటీ.

మిస్టర్ రాస్కెల్ మూవీ తర్వాత ఆమె కనిపించలేదు. తర్వాత హిందీ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది పటేల్ కి పంజాబీ షాదీ, కోయి జానే నా, ఫైర్ ఆఫ్ లవ్ : రెడ్ వంటి చిత్రాల్లో నటించింది. ఇక హిందీలో ఓ సీరియల్లో కూడా నటించింది. అది తెలుగులో కోడలా కోడలా కొడుకు పెళ్లామా డబ్బింగ్ అయ్యి అలరించింది. కాగా, ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి పూర్తిగా తప్పుకుంది. సినిమాల నుండి వైదొలిగాక అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ప్రయాణం మూవీలో హారికగా అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే.? బోల్డ్ స్టేట్ మెంట్స్ తో రచ్చ చేస్తుంది. 2020లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గతంలో తనను సెక్సువల్ హెరాస్ చేశాడంటూ ఫిర్యాదు చేసింది.

కాగా, అనురాగ్ ఈ ఆరోపణలు తోసిపుచ్చాడు. ఇదిగో ఈ కేసులో మరో నటి రిచా చద్దా పేరును తీసుకురావడంతో ఆమెపై పరువు నష్టం దావా వేసింది రిచా. ఇదిలా ఉంటే.. అదే ఏడాది అక్టోబర్‌లో రాంధాస్  అథవాలే చెందిన రాజకీయ పార్టీలోకి చేరింది. వెంటనే ఆమె మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమితులైంది. తాజాగా ప్రభాస్ సలార్ సినిమాపై కూడా విరుచుకుపడింది ఈ అమ్మడు. అదొక చెత్త సినిమా అని, జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారని పేర్కొంది. అంతేనా ప్రముఖ క్రికెటర్స్ ఇర్ఫాన్ పఠాన్ తో డేటింగ్ లో ఉన్నానని, గంబీర్ తనపై ఇంట్రస్ట్ చూపించాడంటూ బాంబు పేల్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి