iDreamPost

క్వాలిఫయర్-2కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఫైనల్​కు SRH! ఎందుకంటే?

  • Published May 23, 2024 | 5:21 PMUpdated May 23, 2024 | 5:21 PM

ఐపీఎల్-2024 ముగింపు దశకు చేరుకుంది. క్యాష్ రిచ్ లీగ్​లో ఇంకా రెండు మ్యాచ్​లు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్-2తో ప్లేఆఫ్స్ దశ పూర్తవుతుంది.

ఐపీఎల్-2024 ముగింపు దశకు చేరుకుంది. క్యాష్ రిచ్ లీగ్​లో ఇంకా రెండు మ్యాచ్​లు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్-2తో ప్లేఆఫ్స్ దశ పూర్తవుతుంది.

  • Published May 23, 2024 | 5:21 PMUpdated May 23, 2024 | 5:21 PM
క్వాలిఫయర్-2కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఫైనల్​కు SRH! ఎందుకంటే?

ఐపీఎల్-2024 ముగింపు దశకు చేరుకుంది. క్యాష్ రిచ్ లీగ్​లో ఇంకా రెండు మ్యాచ్​లు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్-2తో ప్లేఆఫ్స్ దశ పూర్తవుతుంది. ప్లేఆఫ్స్​లో భాగంగా జరిగిన క్వాలిఫయర్-1లో సన్​రైజర్స్ హైదరాబాద్​ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది కోల్​కతా నైట్ రైడర్స్. ఎలిమినేటర్​లో ఆర్సీబీకి షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. ఫైనల్స్​లో మరో బెర్త్ కోసం రాజస్థాన్, సన్​రైజర్స్ పోటీపడుతున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య శుక్రవారం క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్​లో గెలిచే జట్టు ఫైనల్ ఫైట్​లో కేకేఆర్​తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే లక్ కలిసొస్తే ఈ మ్యాచ్ ఆడకుండానే ఎస్​ఆర్​హెచ్​ ఫైనల్​కు చేరుకునే అవకాశాలున్నాయి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మే 24వ తేదీన సన్​రైజర్స్-రాజస్థాన్ మధ్య క్వాలిఫయర్-2 జరగనుంది. ఈ మ్యాచ్​తో ప్లేఆఫ్స్ దశ ముగుస్తుంది. ఇందులో నెగ్గిన జట్టు ఫైనల్​కు చేరుతుంది. ఓడిన టీమ్ ఇంటిదారి పడుతుంది. అయితే ఈ మ్యాచ్​కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. శుక్రవారం చెన్నైలో వాన కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన ప్రకటన క్రికెట్ ఫ్యాన్స్​ను కలవరపెడుతోంది. రాబోయే 48 గంటల పాటు చెన్నైలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తమిళనాడు వెదర్​మ్యాన్ చెప్పారు. చెన్నైలో వాన తప్పదనే వార్తల నేపథ్యంలో అభిమానుల మెదళ్లను ఓ ప్రశ్న తొలచివేస్తోంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? రాజస్థాన్, సన్​రైజర్స్​లో ఎవరు ఫైనల్స్​కు వెళ్తారు? అయితే దీనికి ఐపీఎల్ నిర్వాహకులు ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

క్వాలిఫయర్-2కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ వర్షం వల్ల రేపు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే శనివారం పెడతారు. ఆ రోజు కూడా వాన కురిసి మ్యాచ్ రద్దయితే మాత్రం ఆరెంజ్ ఆర్మీ నేరుగా ఫైనల్​కు చేరుతుంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్​ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అయితే ప్లేఆఫ్స్ మ్యాచ్​లకు వరుణుడు అడ్డుపడితే మాత్రం పాయింట్స్ టేబుల్​ను పరిగణనలోకి తీసుకుంటారు. ఏ టీమ్​కైతే ఎక్కువ పాయింట్లు ఉన్నాయో ఆ టీమ్​ను విన్నర్​గా అనౌన్స్ చేస్తారు. ఆ లెక్కన క్వాలిఫయర్-2 వర్షం వల్ల రద్దయితే.. పాయింట్స్ టేబుల్​లో రాజస్థాన్ కంటే ముందంజలో ఉన్న ఎస్​ఆర్​హెచ్​ ఫైనల్​కు చేరుతుంది. కాబట్టి మ్యాచ్ జరిగితే బాగా ఆడి రాజస్థాన్​ను ఓడించి టైటిల్ ఫైట్​కు అర్హత సాధించాలి. ఒకవేళ వాన పడి రద్దయితే మాత్రం లక్ ఫ్యాక్టర్​తో కమిన్స్ సేన ఫైనల్ చేరడం పక్కా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి