iDreamPost

RCB vs RR: రాజస్థాన్​తో ఓటమిపై కోహ్లీ రియాక్షన్.. దాన్ని గుర్తుపెట్టుకుంటానంటూ..!

  • Published May 23, 2024 | 4:46 PMUpdated May 23, 2024 | 4:46 PM

ఆర్సీబీ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. ఈసారి కూడా కప్పు కోరిక నెరవేరకుండానే కోహ్లీ టీమ్ ఇంటిదారి పట్టింది. రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన ప్లేఆఫ్స్​ ఫైట్​లో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది బెంగళూరు.

ఆర్సీబీ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. ఈసారి కూడా కప్పు కోరిక నెరవేరకుండానే కోహ్లీ టీమ్ ఇంటిదారి పట్టింది. రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన ప్లేఆఫ్స్​ ఫైట్​లో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది బెంగళూరు.

  • Published May 23, 2024 | 4:46 PMUpdated May 23, 2024 | 4:46 PM
RCB vs RR: రాజస్థాన్​తో ఓటమిపై కోహ్లీ రియాక్షన్.. దాన్ని గుర్తుపెట్టుకుంటానంటూ..!

కోట్లాది మంది ఆర్సీబీ అభిమానుల గుండె పగిలింది. ఈసారైనా కప్పు కొడుతుందని అనుకుంటే మళ్లీ ఒట్టి చేతులతోనే వచ్చేసింది బెంగళూరు. ఐపీఎల్-2024 మొదట్లో వరుస ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది డుప్లెసిస్ సేన. అయితే ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో ఫైట్ చేసి వరుసగా 6 మ్యాచుల్లో విక్టరీలు కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్​కేను చిత్తు చేసి ప్లేఆఫ్స్ గడప తొక్కింది. ఇదే ఊపులో ఫైనల్ వరకు చేరుకుంటుందని అంతా భావించారు. ఈసాలా కప్ నమ్దే అంటూ ఫ్యాన్స్ కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ మళ్లీ ప్లేఆఫ్స్​లోనే కోహ్లీ టీమ్ కథ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన ఎలిమినేటర్ ఫైట్​లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఇంటిదారి పట్టింది.

రాజస్థాన్​తో మ్యాచ్​లో ఆఖరి వరకు పోరాడి ఓడింది ఆర్సీబీ. బౌలింగ్​లో రాణించిన ఆ జట్టు.. బ్యాటింగ్​లో ఫర్వాలేదనిపించింది. ఫీల్డింగ్​లో చేసిన పలు తప్పిదాలు ఆ జట్టు కొంపముంచాయి. కీలక మ్యాచ్​లో ఓటమితో టోర్నీ నుంచి బయటకు వచ్చేసింది బెంగళూరు. దీంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆ టీమ్ ప్లేయర్లు కూడా కంటతడి పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్​ చేతుల్లో ఓటమిపై కింగ్ కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్​లో జట్టు ఆటగాళ్లందరూ నిరాశలో కూరుకుపోయిన తరుణంలో అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో ఆర్సీబీ కమ్​బ్యాక్ ఇచ్చిన తీరు అద్భుతమన్నాడు విరాట్. ఎలాంటి ఆశల్లేని స్థితి నుంచి ప్లేఆఫ్స్​కు చేరుకొని సత్తా చాటామని తెలిపాడు.

వరుస ఓటముల్లో నుంచి బయటపడి కమ్​బ్యాక్ ఇచ్చిన తీరు అద్భుతం అన్నాడు కోహ్లీ. ఆశల్లేని స్థితి నుంచి పోరాడి ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయ్యామని చెప్పాడు. టీమ్ పనైపోయిందనుకున్న సిచ్యువేషన్ నుంచి ఇక్కడి దాకా జరిగిన ఈ ప్రయాణాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని.. ఫైట్​బ్యాక్​ చేసిన తీరును గుర్తుంచుకుంటానని కోహ్లీ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్ కూడా డ్రెస్సింగ్ రూమ్​లో కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు ఆడిన తీరు, కమ్​బ్యాక్ ఇచ్చిన విధానం సూపర్బ్ అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్​లో టీమ్​గా అందరం కలసికట్టుగా ఆడిన తీరు మీద గర్వంగా ఉందని, అభిమానులు కూడా ఈ విషయంలో అలాగే అనుకుంటున్నారని డీకే వ్యాఖ్యానించాడు. మరి.. ఈ సీజన్​లో ఆర్సీబీ ఆటతీరు మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి