iDreamPost
android-app
ios-app

OTTలో అదిరిపోయే సస్పెన్స్ డ్రామా.. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం!

Weekend Web Series Suggestions: ఓటీటీ ఆడియన్స్ కి వారానికో కొత్త వెబ్ సిరీస్ వెతుక్కోవడం చాలా కష్టం. అందుకే మీకోసం ఈ వీకెండ్ కి ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సజీషన్ తో వచ్చాం.

Weekend Web Series Suggestions: ఓటీటీ ఆడియన్స్ కి వారానికో కొత్త వెబ్ సిరీస్ వెతుక్కోవడం చాలా కష్టం. అందుకే మీకోసం ఈ వీకెండ్ కి ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సజీషన్ తో వచ్చాం.

OTTలో అదిరిపోయే సస్పెన్స్ డ్రామా.. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం!

మీరు ఇప్పటివరకు ఓటీటీల్లో చాలానే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లరు, పెద్ద పెద్ద డ్రామాలు చూసే ఉంటారు. అయితే అన్నీ మీకు అంతగా నచ్చాలని లేదు. కానీ, కొన్ని మాత్రం ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆఖరి ఎపిసోడ్ అయ్యేవరకు ఆప బుద్ధికాదు. వెబ్ సిరీస్ కి శుభం కార్డు పడితే గానీ.. మనకు నిద్రపట్టదు. అలాంటి వెబ్ సిరీస్ ని మీరు ఈ మధ్యకాలంలో చూసి ఉండరు. కానీ, ఒక వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఆ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాని మీరు స్టార్ట్ చేశారంటే.. అది పూర్తి చేశాక ఏపని అయినా చేసుకోగలుగుతారు. లేదంటే ఆ వెబ్ సిరీస్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.

ఇప్పుడు ఇంత హైప్ ఇస్తోంది పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ కి. ఇది అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇది మీకు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవానికి ఈ సిరీస్ 2020లోనే అమెజాన్ లో రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఈ వెబ్ సిరీస్ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. అందరూ ఈ పాతాళ్ లోక్ గురించే మాట్లాడుకున్నారు. ఈ సిరీస్ ని సుదీప్ శర్మ క్రియేట్ చేశాడు. మరో ముగ్గురు రైటర్స్ తో కలిసి సుదీప్ శర్మ ఈ కథను రాసుకున్నాడు. ఎన్ హెచ్10, ఉడ్తా పంజాబ్ లాంటి కథలతోనే.. సుదీప్ శర్మ ఎంత పక్డబందీగా రాసుకుంటాడో అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ ని తురణ్ తేజ్ పాల్ రచించిన “ది స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్” అనే పుస్తకం ఆధారంగా రాసుకున్న స్టోరీ.

ఈ సిరీస్ లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాలకు మించే నిడివి ఉంటుంది. వెబ్ సిరీస్ చూసేవారికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అదేంటంటే ఎపిసోడ్ ని ఫార్వాడ్ చేస్తుంటారు. వెబ్ సిరీస్ అంటే కాస్త ల్యాగ్ ఉంటుంది కాబట్టి అలా చూస్తుంటారు. కానీ, ఈ సిరీస్ ని మాత్రం అంత నిడివి ఉన్నా ఫార్వాడ్ చేయరు. అలాగే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆఖరి ఎపిసోడ్ వరకు ఆపకుండా చూడాలి అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ ఉన్నా బాగుండు కదా అనే భావన కూడా కలుగుతుంది. పాత్రలను మలిచిన తీరు, కథ సాగే తీరు, నటీనటుల ప్రతిభ అన్నీ కలిపి మిమ్మల్ని ఈ పాతాళ్ లోక్ సిరీస్ ని చూసేలా చేస్తాయి. హత్యలు చేసే కిరాతకుడికి మూగజీవాల మీద ఉండే ఇష్టం చూస్తే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. అంతటి కసాయి.. ఇంతటి సున్నిత మనస్కుడా అనే అనుమానం కలుగుతుంది. కొన్ని ట్విస్టులు మిమ్మల్ని ఆశ్చర్యపోయాలా చేస్తాయి. మరికొన్ని మాత్రం ఆలోచింపజేస్తాయి. మొత్తానికి పంటి బిగువున సిరీస్ ని చూసేలా చేస్తాయి.

కథ ఏంటంటే?:

20 ఏల్ల అనుభవం ఉన్న ఇన్ స్పెక్టర్ హాతీరామ్ చౌదరి(జైదీప్ అహ్లావత్), ప్రముఖ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా(నీరజ్ కాబి) పాత్రల చుట్టూ ఈ వెబ్ సిరీస్ జరుగుతూ ఉంటుంది. జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రాని హత్య చేసేందుకు సుపారీ ఇస్తారు. అతడిని హత్య చేసేందుకు పథకం రచించగా నలుగురు క్రిమినల్స్ ని పోలీసులు అరెస్టు చేస్తారు. కెరీర్ లో ఒకటీ హైప్రొఫైల్ కేసు లేకుండా 20 ఏళ్లు వెళ్లదీసిన హాతీరామ్ చేతికి ఈ కేసు దక్కుతుంది. హాతీరామ్ ఈ కేసును తన సబార్డినేట్ అన్సారీ(ఇష్వక్ సింగ్)తో కలిసి ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. అతను విచారణ చేసే కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తూ ఉంటాయి. ఈ కేసులో పెద్ద రాజకీయ కుట్రే ఉందని తెలుస్తుంది.అలాగే హత్యకు కుట్ర పన్నిన విశాల్ త్యాగి(అభిషేక్ బెనర్జీ) గురించి భయంకరమైన వాస్తవాలు వెలుగు చూస్తాయి.

హాతీరామ్ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ చాలామంది బాగోతాలు బయటకు వస్తూ ఉంటాయి. అందుకని ఏదో సాకు చూపించి అతడిని సస్పెండ్ చేసి కేసు నుంచి తప్పిస్తారు. ఆ తర్వాత ఆ కేసును సీబీఐకి అందిస్తారు. దానిని వాళ్లు సింపుల్ గా ఉగ్ర కుట్రగా క్లోజ్ చేస్తారు. ఈ కథలో లేయర్స్ ఉండటం మాత్రమే కాకుండా.. ప్రతి లీడ్ క్యారెక్టర్ కి మరికొన్ని అదనపు కథలు ఉంటాయి. ఇలా మొత్తం సిరీస్ ని ఎంతో పక్కగా, పకడ్బందీగా రాసుకున్నారు. ఈ సిరీస్ లో చాలా సీన్లు కంటతడి పెట్టిస్తాయి. భావోద్వేగానికి గురి చేస్తాయి. ఆలోచింపజేస్తాయ. చాలా సీన్స్ ని తెరకెక్కించిన తీరు అబ్బురపరుస్తుంది. చాలామంది వైలెన్స్ ని ప్రస్తావించి సీన్ ని స్కిప్ చేస్తారు. కానీ, వీళ్లు మాత్రం ఎంతటి వైలెన్స్ ని అయినా నిర్భయంగా చిత్రీకరించారు. మరి.. ఈ పాతాళ్ లోక్ సిరీస్ మీరు చూడాలి అనుకుంటున్నారా? ఇప్పటికే చూసి ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి