iDreamPost

భర్తపై కోపం.. పక్కింటి కుర్రాడిపై కోరిక.. OTTలో ఓ రేంజ్ మూవీ!

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీ వచ్చిన తర్వాత రకరకాల సినిమాలు చూసేస్తున్నారు. వాటిలో కొన్ని భిన్నమైన కథలు కూడా ఉంటాయి. అలాంటి ఒక కథనే మీకోసం తీసుకొచ్చాం. ఈ మూవీ ప్రస్తుత సమాజానికి మంచి మెసేజ్ కూడా అవుతుంది.

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీ వచ్చిన తర్వాత రకరకాల సినిమాలు చూసేస్తున్నారు. వాటిలో కొన్ని భిన్నమైన కథలు కూడా ఉంటాయి. అలాంటి ఒక కథనే మీకోసం తీసుకొచ్చాం. ఈ మూవీ ప్రస్తుత సమాజానికి మంచి మెసేజ్ కూడా అవుతుంది.

భర్తపై కోపం.. పక్కింటి కుర్రాడిపై కోరిక.. OTTలో ఓ రేంజ్ మూవీ!

మీరు ప్రస్తుతం సమాజంలో ఒక పదం బాగా వింటున్నారు. అక్రమ సంబంధం, ఇల్లీగల్ ఎఫైర్, ఇల్లీసిట్ రిలేషన్.. ఇలాంటి పదాలు చాలానే విని ఉంటారు. అలాగే వాటి వల్ల జరిగిన ఘోరాలు కూడా చూసే ఉంటారు. భర్తను కాదని మరొకరితో కోరి*కలు తీర్చుకోవడం. భార్యను కాదని బయటి వారితో సంబంధాలు పెట్టుకోవడం. ఇలాంటి సంబంధాలు ప్రాణాల మీదకు తేవడం చాలానే జరిగాయి. అలాగే క్రైమ్ లో మేజర్ పార్ట్ ఇలాంటి వాటి వల్లే జరుగుతాయి. అలాంటి ఒక పాయింట్ తో వచ్చిన ఒక క్రేజీ మూవీ ఉంది. మీరు ఇంకా చూడలేదా? ఇది చూస్తే అసలు అలాంటి రిలేషన్ అంటేనే వణికిపోతారు. ఎందుకంటే ఒక భార్య తీసుకుని చిన్న తప్పుడు నిర్ణయం తన కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తుంది.

సాధారణంగా చాలా కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది ఈ అక్రమ సంబంధాలే. అలాంటి ఒక మెయిన్ పాయింట్ తోనే ఈ సినిమా జరుగుతూ ఉంటుంది. భర్తపై ఉన్న కోపంతో మన హీరోయిన్ ఇంకో కుర్రాడిపై ఇష్టం పెంచుకుంటుంది. అంటే తన భర్త రోజూ ఆఫీస్ లో ఉండే సెక్రెటరీతో ఏదో తప్పుగా ఉంటున్నాడు అనే ఆలోచన తన మనసును తొలిచేస్తుంది. ఆ కోపంతో కొత్తగా పక్కింట్లోకి వచ్చిన కుర్రాడిపై మనసు పారేసుకుంటుంది. కుర్రాడు కూడా కాస్త ఫాస్ట్ గానే కనెక్ట్ అవుతాడు. ఇంకేముంటుంది.. ఈ మేడమ్ కంగారు పడింది. ఆ తర్వాత గానీ అర్థం కాలేదు.. తాను జీవింతంలో ఎంత పెద్ద తప్పు చేసిందో. ఆ కుర్రాడు ఆమెను తుమ్మ బంకలాగా అంటుకుపోతాడు.

The Boy Next Door

అంటే ఆమె ఒకసారి చేసిన తప్పును జీవితాంతం చేయాలి అనే ధోరణిలో అతని ప్రవర్తన ఉంటుంది. కట్టుకున్న వాడికంటే ఎక్కువగా అజమాయిషీ చెలాయిస్తూ ఉంటాడు. ఆమె తన తప్పు తెలుసుకుని అతడిని దూరంగా పెట్టాలి అనుకోగానే.. ఆమె జీవితాన్ని నాశనం చేయాలి అని ఫిక్స్ అయిపోతాడు. తాను వర్క్ చేసే చోటుకు వెళ్తాడు. ఆమె ఇ-మెయిల్ హ్యాక్ చేస్తాడు. వాళ్లిద్దరు సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు మొత్తం జిరాక్స్ తీసి వర్క్ ప్లేస్ లో అంటించేస్తాడు. అలా ఆమెను ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడు.

అంతకు మించి ఆమె భర్త, కొడుకుకు కూడా బాగా దగ్గరవుతాడు. ఏమాత్రం తేడా వచ్చినా వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడను అనే మెసేజ్ గట్టిగానే ఇస్తాడు. ఇలా ఆమె జీవితాన్ని ఎంతలా నాశనం చేయాలో అంతలా చేసేస్తాడు. అలాంటి వ్యక్తి నుంచి ఎలా తప్పించుకుంది? తన భర్త, కుమారుడిని ఎలా కాపాడుకుంది? అనేదే మెయిన్ పాయింట్. ఈ సినిమా పేరు ‘ది బాయ్ నెక్ట్స్ డోర్’. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని మాత్రం కాస్త ఘాటు సన్నివేశాలు ఉంటాయి. అందుకే ఒంటరిగా చూస్తే కాస్త బెటర్ గా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి