iDreamPost

టిల్లు కాకముందు సిద్దూ చేసిన రొమాంటిక్ డ్రామా! OTTలో ఉంది చూశారా?

OTT Suggestions- Siddhu Jonnalagadda: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ లో ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. అయితే సిద్ధు- టిల్లు కాక ముందు యాక్టింగ్ ఇరగదీసిన ఒక మూవీ ఉంది తెలుసా?

OTT Suggestions- Siddhu Jonnalagadda: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ లో ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. అయితే సిద్ధు- టిల్లు కాక ముందు యాక్టింగ్ ఇరగదీసిన ఒక మూవీ ఉంది తెలుసా?

టిల్లు కాకముందు సిద్దూ చేసిన రొమాంటిక్ డ్రామా! OTTలో ఉంది చూశారా?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. పాన్ ఇండియాలో లెవల్లో ఉన్న సినిమా లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డీజే టిల్లు మూవీతో సిద్ధు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. యూత్ మొత్తం గత మూడేళ్లుగా టిల్లులెక్క మాట్లాడటం, టిల్లులెక్క బట్టలేసుకోవడం, టిల్లు లెక్కనే కథలు పడటం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన రికార్డుల కంటే పార్ట్ 2 టిల్లు స్క్వేర్ తో బద్దలు రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఒక్క దెబ్బతో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. నిజానికి సిద్ధు జొన్నలగడ్డ ఇంత త్వరగా ఈ ఫీట్ సాధిస్తాడని ఎవరూ నమ్మలేదు. టిల్లు మాత్రమే కాకుండా గతంలో సిద్ధు చాలానే గుడ్ మూవీస్ చేశాడు. వాటిలో ఒక ఫీల్ గుడ్ మూవీని ఈసారి ఓటీటీ సజీషన్ కింద తీసుకొచ్చాం.

స్టార్ బాయ్ సిద్ధుకి ఈ స్టార్డమ్, రేంజ్, క్రేజ్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. చాలా సపోర్టింగ్ రోల్స్ చేశాడు. చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. హీరోగా వచ్చిన ఛాన్స్ ని నిలబెట్టుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. ఆ క్రమంలో ఎన్నో మంచి మంచి సినిమాలు చేశాడు. అందుకే సిద్ధు అంటే టిల్లు స్క్వేర్ మాత్రమే కాదు.. ఇంకా మంచి సినిమాలు ఉన్నాయని చెప్పడం కోసం మీకోసం ఓటీటీ సజీషన్ కింద ఒక మంచి రొమాంటిక్ డ్రామాని తీసుకొచ్చాం. నిజానికి ఈ మూవీలో టిల్లు క్యారెక్టర్ కి మించి ఇందులో వేరియేషన్స్, షేడ్స్ ఉన్నాయి. ఆ మూవీ మరేదో కాదు.. ‘ వింత గాథ వినుమా’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ 2020 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

ఈ మా వింత గాథ వినుమా సినిమాకి సంబంధించి సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఒక కేర్ లెస్ స్టూటెండ్ సిద్ధు క్యారెక్టర్ లో జీవించేశాడు. కాలేజ్ ఉన్న రోజుల్లో ఫ్రెండ్స్ తో తిరగడం, పరీక్షల్లో బ్యాక్ లాగ్స్ పెట్టుకోవడం తప్పితే ఇంకో పని లేదు. మరోవైపు వినీత(సీరత్ కపూర్)ని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలి అని కంకణం కట్టుకోవడం. కాలేజ్ లో ఉన్నన్ని రోజులు ట్రై చేస్తే.. ఆఖరికి వినీత ఫైనల్ ఇయర్లో ఓకే చెప్తుంది. ఆ తర్వాత సోదరుడి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం సిద్ధు- వినీత ఇద్దరూ గోవా వెళ్తారు. గోవా వెళ్లాక ఊరుకోరు కదా.. ఫుల్ తాగేశారు. ఆ తాగిన మత్తులో ఇద్దరూ వివాహం చేసుకుంటారు.

ఇంకేముంది ఆ వివాహానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దాంతో వారి రెండు కుటుంబాలు తమ తల కొట్టేసినట్లు ఫీలయ్యి ఇద్దరినీ దూరం పెడతారు. వారి మధ్య బంధం కూడా బ్రేకప్ కి దారి తీస్తుంది. ఈ మూవీ కథ సిద్ధు పోలీస్ ఆఫీసర్(తనికెళ్ల భరణి)కి తన బ్రేకప్ స్టోరీ చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. తన కథను చెప్తూ అలా ముందుకు తీసుకెళ్తాడు. మరి.. చివరికి సిద్ధు- వినీత కలిశారా? గోవాలో నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అసలు పెళ్లి చేసుకుంటే ఎందుకు విడిపోయారు? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు రావాలి అంటే మీరు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సిద్ధు జొన్నలగడ్డ– సీరత్ కపూర్ మా వింత గాథ వినుమా మూవీ చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి