iDreamPost
android-app
ios-app

OTTలో ఉన్న ఈ సిరీస్ చూడాలంటే.. గుండె ధైర్యం కాస్త ఎక్కువుండాలి!

OTT Suggestions Best Suspense Thriller: ఓటీటీలో వెబ్ సిరీస్లు చూసే వారికి కోసం అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. దీనిని చూడాలంటే కాస్త గట్టి గుండె కావాలి మరి.

OTT Suggestions Best Suspense Thriller: ఓటీటీలో వెబ్ సిరీస్లు చూసే వారికి కోసం అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. దీనిని చూడాలంటే కాస్త గట్టి గుండె కావాలి మరి.

OTTలో ఉన్న ఈ సిరీస్ చూడాలంటే.. గుండె ధైర్యం కాస్త ఎక్కువుండాలి!

జులాయి సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. భయమేస్తుందని హారర్ సినిమాలు చూడటం మానేస్తామా? అదొక బ్యాడ్ హ్యాబిట్. అది మాత్రం నూటికి నూటయాభై శాతం నిజం అనే చెప్పాలి. అలా భయమేసినా కూడా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలు చూడటం ఆపకూడదు. అలా ఆపేస్తే లైఫ్ లో సినిమా లవర్స్ ఒక థ్రిల్ ని మిస్ అయిపోయారు అని అర్తం. అలా భయపడుతూ సినిమాలు, సిరీస్లు చూసే వారికోసం ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ ని తీసుకొచ్చాం. నిజంగా ఈ వెబ్ సిరీస్ చూడాలంటే కాస్త గుండె గట్టిది అయి ఉండాలి. మరి.. ఆ సిరీస్ ఏది? అందులో అంత భయపడే అంశం ఏముందో తెలుసుకుందాం.

ఇంత హైప్ ఎక్కించింది దహన్ అనే వెబ్ సిరీస్ గురించి. ఈ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. గతంలో ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉండేది. కానీ, ప్రస్తుతం మాత్రం ఇది ‘Bhay’ పేరులో హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కి విక్రాంత్ పవార్ ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 18 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల వరకు ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఈ సిరీస్ ని ఆపడం కష్టం. కానీ, ప్రతి ఎపిసోడ్ కి భయం మాత్రం రెట్టింపు అవుతూ ఉంటుంది. అసలు ఫస్ట్ ఎపిసోడ్ లో కథలో తీసుకెళ్లడమే భయంకరమైన వయలెన్స్ తో తీసుకెళ్తారు.

అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలా? ఆ సీన్స్, రక్తపాతం చూసి భయపడాలో అర్థం కాదు. కథలోకి వెళ్లే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. అలాగే భయం కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ లో కీ రోల్ ప్లే చేసేది మ్యూజిక్. ఈ సిరీస్ లో కూడా మ్యూజిక్ అంతే విధంగా భయపెడుతుంది. ఇందులో ఉండే యాక్టర్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక్కొక్కరు వారి కెరీర్ బెస్ట్ ఇచ్చారు. టిస్కా చోప్రా, సౌరభ్ శుక్లా, అంకుర్ నయ్యర్, ముఖేష్ తివారీ, లెహర్ ఖాన్, రాజేశ్ టైలాంగ్.. ఇలా ప్రధాన పాత్రల్లో కనిపించిన ప్రతి ఒక్కరు అద్భుతమైన నటనతో కట్టి పడేస్తారు. సిరీస్ ఎంత భయానకంగా ఉంటుందో.. వారి నటనతో ఆ భయాన్ని మరింత పెంచేస్తారు.

కథ ఏంటంటే?:

శిలాస్పురాలో ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ఊరు మొత్తం ఒక ఆత్మ వల్ల శపించబడింది అంటారు. అక్కడ ఒక ఆత్మను బంధించి.. దానికి కాపలాగా ఒక పూజారి(సౌరభ్ శుక్లా) ఉంటాడు. రోజూ ఆ ఆత్మను శాంతింపజేయడం కోసం పూజలు చేస్తూ.. హారతులు ఇస్తూ ఉంటాడు. ఊరు మొత్తం ఆ పూజారిని నమ్ముకుని ఉంటుంది. ఊరిలో ఎవరికి గాలి సోకినా.. ఆయనే వదిలిస్తూ ఉంటాడు. ఆత్మ నిద్రలేవకూడదు అని అందరూ కోరుకుంటూ ఉంటారు. మరోవైపు ఆ ఊరిలో మైనింగ్ జరుగుతూ ఉంటుంది. దానిని గ్రామస్థులు అడ్డుకుంటూ ఉంటారు. ఒక ఐఏఎస్ అధికారిణి(టిస్కా చోప్రా) అక్కడికి ట్రాన్సఫర్ మీద వస్తుంది. అక్కడ అరుదైన ఖనిజ సంపద ఉందని దానిని తవ్వనివ్వకుండా కొందరు ఈ నాటకాలు ఆడుతున్నారు అనుకుంటుంది.

కొన్ని రోజులకు ఆమె లైఫ్ లో కూడా కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఏది నిజం? ఏది అబద్ధం అనే విషయాన్ని నమ్మే పరిస్థితిలో ఆమె ఉండదు. మైనింగ్ స్టార్ట్ చేయడంతో ఆత్మను బంధించి ఉంచిన రాయికి పగుళ్లు వస్తాయి. ఆ తర్వాత ఊరిలో అనుకోని సంఘటనలు, రక్తపాతం జరుగుతుంది. మైనింగ్ స్టార్ట్ చేయడం వల్లే ఇలా జరిగిందని అందరూ అనుకుంటారు. మనుషులు వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. అసలు ఆ ఊరిలో ఏం జరుగుతోంది? నిజంగానే ఆత్మ ఉందా? మైనింగ్ కి- ఆత్మకు ఏంటి సంబంధం? ఆ ఊరిని కాపాడగలిగారా లేదా? చివరకు ఏం జరిగింది? తెలియాలంటే మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉన్న దహన్(BHAY) వెబ్ సిరీస్ చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి