iDreamPost

ఆస్కార్స్‌లో 13 కేటగిరీల్లో సెలక్ట్‌ అయిన మూవీ OTTలోకి, తెలుగులోనూ స్ట్రీమింగ్‌!

  • Published Feb 21, 2024 | 4:14 PMUpdated Feb 22, 2024 | 10:58 AM

ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో కొత్త కొత్త సినిమాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో హాలీవుడ్ చిత్రం ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ సినిమా వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో కొత్త కొత్త సినిమాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో హాలీవుడ్ చిత్రం ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ సినిమా వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 21, 2024 | 4:14 PMUpdated Feb 22, 2024 | 10:58 AM
ఆస్కార్స్‌లో 13 కేటగిరీల్లో సెలక్ట్‌ అయిన మూవీ OTTలోకి, తెలుగులోనూ స్ట్రీమింగ్‌!

టాలీవుడ్ , బాలీవుడ్ , హాలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. థియేటర్ లో ఏ భాషలో విడుదల అయినా , ఓటీటీ లో మాత్రం అన్ని భాషలలోను విడుదల చేస్తున్నారు. దీనితో ఓటీటీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాలకు మరింత ఆదరణ లభిస్తుంది. ఇక ప్రతి వారం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఈ వీటి సంఖ్య మరింత పెరిగిందని చెప్పి తీరాలి. ఈ క్రమంలో హాలీవుడ్ లో సుమారు 8నెలల క్రితం థియేటర్స్ లో విడుదల అయ్యి .. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఓ చిత్రం.. ఎట్టకేలకు ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టిన ఈ మూవీ “ఓపెన్‌హైమర్”. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను దాదాపు వంద మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించగా.. విడుదల తర్వాత ఈ మూవీ 900 మిలియన్ల డాలర్ల కలెక్షన్స్ రాబట్టిందట. ఓ రకంగా నిర్మాతలకు ఈ సినిమా ద్వారా తొమ్మిదింతల లాభాలను మిగిల్చీనట్లే. అంతే కాకుండా “ఓపెన్‌హైమర్” చిత్రానికి ఇప్పటివరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు లభించాయి. 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో 13 ఆస్కార్స్ నామినేషన్స్ దక్కించుకున్న మూవీగా ఓపెన్ హైమర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జియో సినిమా కొనుగోలు చేసింది. ఈ క్రమంలో మార్చి 21 నుంచి జియో సినిమా ఓటీటీలో ఓపెన్‌హైమర్ స్ట్రీమింగ్ కానున్నట్లు .. అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అంతేకాకుండా ఇంగ్లీష్ తో పాటు.. తెలుగులోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాను అణుబాంబు సృష్టికర్త ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తీసుకుని.. రూపొందించారట. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో .. అణుబాంబును తయారు చేయడానికి హైమర్ ఎలాంటి ప్రయోగాలను చేశాడు!. తనని తాను ప్రపంచాన్ని వినాశనానికి గురి చేసేవాడినని ఎందుకు ప్రకటించుకోవాల్సి వచ్చింది! ఈ క్రమంలో అతడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది . అనే అంశాలను ఈ సినిమాలో డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్.. చాలా రియలిస్టిక్ గా చూపించాడు. ఇక ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా .. ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి హాలీవుడ్ పిక్చర్ “ఓపెన్‌హైమర్” ఓటీటీ ఎంట్రీపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి