iDreamPost

ఆశలు- ఆశయాలు- హత్యలు.. OTTని షేక్ చేస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

OTT Suggestions- Best Crime Drama: ఓటీటీలో ఎన్నో మంచి మంచి సినిమాలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. అలాంటి ఒక క్రైమ్ డ్రామా ఒకటి ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. మరి.. ఆ క్రైమ్ థ్రిల్లర్ చూశారా లేదా?

OTT Suggestions- Best Crime Drama: ఓటీటీలో ఎన్నో మంచి మంచి సినిమాలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. అలాంటి ఒక క్రైమ్ డ్రామా ఒకటి ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. మరి.. ఆ క్రైమ్ థ్రిల్లర్ చూశారా లేదా?

ఆశలు- ఆశయాలు- హత్యలు.. OTTని షేక్ చేస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

ఓటీటీలో అన్ని తరహా సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ, క్రైమ్ థ్రిల్లర్స్ కి మాత్రం కాస్త ఎక్కువ ఆదరణే లభిస్తుంది. ఎందుకంటే చాలామందికి క్రైమ్ థ్రిల్లర్స్ అంటే మక్కువ ఎక్కువ. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా దొరికితే అస్సలు ఒదిలిపెట్టరు. మరి.. మీరు ఈ మూవీ గురించి విన్నారో లేదో? గతం వారం రోజులుగా ఈ మూవీ ఓటీటీని అల్లాడించేస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. మౌత్ టాక్ కూడా సూపర్ గా ఉంది. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఆ సినిమా కథ ఏంటో చూద్దాం.
ఇప్పుడు కంటెంట్ సినిమాలు అయినా కూడా నేరుగా ఓటీటీల్లోనే విడుదల అవుతున్నాయి. అలాంటి ఒక క్రైమ్ థ్రిల్లరే ఇది కూడా. ఈ మూవీ పేరు శర్మ అండ్ అంబానీ.

ఈ మూవీ ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ అంచనాలను మరింత పైకి తీసుకెళ్లారు. ఇందులో ట్విస్టులు, వావ్ అనే షాకులు చాలానే ఉన్నాయి. మూవీకి ఇంత రెస్పాన్స్ రావడానికి కారణం రాసుకున్న లైన్ ని అంతే పకడ్బందీగా తెరకెక్కిచగలిగారు. ఈ మూవీ కథ రాసింది భరత్ తిప్పిరెడ్డి, కార్తిక్ సాయి. ఈ రైటర్లలో భరత్ రెడ్డి నిర్మాత కాగా.. కార్తిక్ సాయి డైరెక్టర్ గా చేశాడు. అందుకే మూవీ ఇంత బాగా వచ్చింది అని కూడా చెప్పచ్చు.

అలాగే భరత్ తిప్పిరెడ్డి లీడ్ రోల్ శర్మగా కూడా అలరించాడు. అలాగే కేశవ కర్రి అంబానీ పాత్రలో మెప్పించాడు. ఈ శర్మ- అంబానీ జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. శర్మ, అంబానీకి లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఉంటుంది. అంబానీ అయితే షూ పాలిష్ చేసుకుంటూ గొప్పగా ఎదగాలి అని కలలు కంటూ ఉంటాడు. అలాంటి వాళ్ల లైఫ్ లోకి వచ్చిన రూ.75 కోట్ల వజ్రాలు వారి జీవితాలను ఎన్ని మలుపులు తిప్పాయి అనేదే మెయిన్ స్టోరీ. ఇందులో హీరోయిన్ సితారగా చేసిన ధన్య బాలకృష్ణన్ మరోసారి మెప్పించింది. క్యారెక్టర్ లో ఇంటెన్సిటీని, అమాయకత్వాన్ని ఎంతో బాగా చూపించగలిగింది.

ఓటీటీలోకి చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ వస్తాయి. కానీ, కొన్ని మాత్రం ఇలా సైలెంట్ గా వచ్చి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటాయి. అలాంటి కోవలోకి ఈ శర్మ అండ్ అంబానీ సినిమా వస్తుందని తప్పకుండా చెప్పచ్చు.  మొత్తానికి ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ఓటీటీగా మారిపోయింది. ఇప్పటికే వారంలోనే మంచి టాక్ తో ఓటీటీలో దూసుకుపోతోంది. అలాగే ఓటీటీలో మంచి రికార్డులు కూడా క్రియేట్ దిశగా దూసుకుపోతోంది. మరి.. ఈ శర్మ అండ్ అంబానీ సినిమా మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి