iDreamPost

రేపు ఒక్కరోజే ఓటీటీలో 15 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ మూడు మాత్రం..!

  • Author singhj Published - 05:25 PM, Thu - 20 July 23
  • Author singhj Published - 05:25 PM, Thu - 20 July 23
రేపు ఒక్కరోజే ఓటీటీలో 15 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ మూడు మాత్రం..!

టాలీవుడ్​లో గత కొన్ని వారాలుగా చిన్న చిత్రాలు తెగ సందడి చేస్తున్నాయి. ‘సామజవరగమన’తో పాటు మరో స్మాల్ బడ్జెట్ మూవీ ‘బేబీ’ తెలుగు బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచనాలు అన్నీ ఇన్నీ కాదు. తక్కువ బడ్జెట్​లో రూపొందిన ఈ మూవీస్ డబుల్ బ్లాక్​ బస్టర్స్​గా నిలిచాయి. ‘బేబీ’ అయితే మిక్స్​డ్ టాక్​తోనూ రూ.కోట్లు కొల్లగొడుతోంది. అయితే వర్షాలు ఈ సినిమా జోరుకు కాస్త బ్రేకులు వేశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీగా వానలు కురుస్తున్నాయి. దీంతో ఎవరూ బయటికి రాలేని పరిస్థితి. కాబట్టి ఇంట్లోనే అందరూ చిల్ అవ్వాలి. అలాంటి వారికి బోలెడంత ఎంటర్​టైన్​మెంట్​ను అందించేందుకు ఓటీటీలు రెడీ అవుతున్నాయి. ఈ శుక్రవారం ఓటీటీల్లో ఏకంగా 15 సినిమాలు-వెబ్ సిరీస్​లు స్ట్రీమింగ్​కు సిద్ధమైపోయాయి. ఇందులో ‘అశ్విన్స్​’, ‘ధూమమ్​’ చిత్రాలతో పాటు జాన్వీ కపూర్ నటించిన హిందీ మూవీ ‘బవాల్​’ను మీరు ట్రై చేయొచ్చు.

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్..

అమెజాన్ ప్రైమ్

బవాల్ – హిందీ చిత్రం
ధూమమ్ – తెలుగు డబ్బింగ్ మూవీ
అన్​స్టాపబుల్ – తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
గాయ్​ రిచ్చీస్ ద కోవనెంట్ – ఇంగ్లీష్ మూవీ

నెట్​ఫ్లిక్స్

అశ్విన్స్ – తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్)
స్వీట్ మంగోలియన్స్ సీజన్ 3 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది)
రేవన్ సాంగ్ – అరబిక్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
దే క్లోన్డ్ టైరోన్ – ఇంగ్లీష్ ఫిల్మ్

జీ5
మౌరా – పంజాబీ మూవీ

ఆహా
నేను సూపర్ ఉమెన్ – బిజినెస్ రియాలిటీ షో
నచ్చింది గర్ల్​ఫ్రెండూ – తెలుగు చిత్రం

జియో సినిమా
దో గుబ్బారే – హిందీ వెబ్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది)
చాంద్​లో – గుజరాతీ మూవీ
ట్రయల్ పీరియడ్ – హిందీ చిత్రం
స్పెషల్ ఊప్స్: లయనెస్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జులై 23

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి