iDreamPost

ఈవారం నెట్ ఫ్లిక్స్ లోకి సూపర్ సినిమాలు.. ఆ షో మాత్రం మిస్ కావొద్దు..

New On Netflix April 2024: ఓటీటీలు ఎన్ని ఉన్నా.. కొత్తవి ఎన్ని వచ్చినా నెట్ ఫ్లిక్స్ కి మాత్రం ఆడియన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికీ నెట్ ఫ్లిక్స్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. మరి.. ఆ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ నెలలో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూడండి.

New On Netflix April 2024: ఓటీటీలు ఎన్ని ఉన్నా.. కొత్తవి ఎన్ని వచ్చినా నెట్ ఫ్లిక్స్ కి మాత్రం ఆడియన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికీ నెట్ ఫ్లిక్స్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. మరి.. ఆ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ నెలలో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూడండి.

ఈవారం నెట్ ఫ్లిక్స్ లోకి సూపర్ సినిమాలు.. ఆ షో మాత్రం మిస్ కావొద్దు..

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అందరూ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తున్నారు. ఆడియన్స్ ఆదరణ కూడా ఓటీటీలకు బాగా పెరిగిపోతోంది. అందుకే ఇప్పుడు ఓటీటీలు కూడా బాగా పెరిగిపోయాయి. కానీ, అప్పటి నుంచి ఇప్పటికీ నెట్ ఫ్లిక్స్ కి మాత్రం ఓటీటీ ఆడియన్స్ నుంచి ఆదరణ తగ్గడం లేదు. ప్రతివారం, ప్రతి నెల నెట్ ఫ్లిక్స్ లోకి ఏ సినిమాలు వస్తున్నాయి? ఏ వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి అంటూ ప్రేక్షకులు వెతుకులాట మొదలు పెడుతూ ఉంటారు. గతంలో అంటే నెట్ ఫ్లిక్స్ అంటే యాక్షన్, హాలీవుడ్ సినిమాలు మాత్రమే ఉంటాయి అనుకుంటారు. కానీ, ఈమధ్య నెట్ ఫ్లిక్స్ లో తెలుగు సినిమాలు కూడా బాగా స్ట్రీమ్ అవుతున్నాయి.

నెట్ ఫ్లిక్స్ ఇండియా పేరిట ఇండియన్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మన సినిమాలు కూడా ఎక్కువగానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటికి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ఇండియా తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రతినెల స్ట్రీమింగ్ కాబోయే సినిమాల గురించి అప్ డేట్ ఇస్తూ ఉటుంది. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా అప్ డేట్ ఇచ్చేసింది. అయితే ఈ నెల మాత్రం నెట్ ఫ్లిక్స్ సబ్ సస్క్రైబర్స్ కి తెలుగు సినిమాలు లేవనే చెప్పాలి. కాకపోతే హిందీ ఫాలో అయ్యే వారికి ది గ్రేట్ కపిల్ షో రూపంలో గుడ్ న్యూస్ అందుతోంది. వారం వారం కపిల్ షో నుంచి కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. మరి.. ఈ ఏప్రిల్ నెలలో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.

ఏప్రిల్ నెలలో మూవీస్:

  • ది ఘాజీ అటాక్- స్ట్రీమింగ్ అవుతోంది
  • ది కంజురింగ్- స్ట్రీమింగ్ అవుతోంది
  • రిప్లే వెబ్ సిరీస్- ఏప్రిల్ 4
  • స్కూప్- ఏప్రిల్ 5
  • పారాసైట్: ది గ్రే వెబ్ సిరీస్- ఏప్రిల్ 5
  • ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో ఎపిసోడ్ 2- ఏప్రిల్ 6
  • ఘోస్ట్ బస్టర్స్: ఆఫ్టర్ లైఫ్- ఏప్రిల్ 10
  • బేబీ రెయిన్ డీర్ వెబ్ సిరీస్- ఏప్రిల్ 11
  • హార్ట్ బ్రేక్ హై సీజన్ 2- ఏప్రిల్ 11
  • అమర్ సింగ్ చమ్కీలా- ఏప్రిల్ 12
  • ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో ఎపిసోడ్ 3- ఏప్రిల్ 13
  • ది గాడ్ ఫాదర్- ఏప్రిల్ 15
  • కీపింగ్ అప్ విత్ ది కర్డాషియన్స్- ఏప్రిల్ 15

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి