iDreamPost

అఫీషియల్: ఆరేళ్ల తర్వాత OTTలోకి సందీప్ కిషన్ క్రేజీ థ్రిల్లర్ మూవీ!

OTT New Releases- Sundeep Kishan Movie: సందీప్ కిషన్- లావణ్య త్రిపాఠీ కాంబోలో వచ్చిన బెస్ట్ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. మరి.. ఆ సినిమా ఏదో చూద్దాం.

OTT New Releases- Sundeep Kishan Movie: సందీప్ కిషన్- లావణ్య త్రిపాఠీ కాంబోలో వచ్చిన బెస్ట్ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. మరి.. ఆ సినిమా ఏదో చూద్దాం.

అఫీషియల్: ఆరేళ్ల తర్వాత OTTలోకి సందీప్ కిషన్ క్రేజీ థ్రిల్లర్ మూవీ!

ఓటీటీలోకి ఎప్పుడూ కొత్త సినిమాలే కాదు.. అప్పుడప్పుడు పాత సినిమాలు కూడా కొత్తగా విడుదల అవుతూ ఉంటాయి. ఆ లిస్టులోకి ఇప్పుడు సందీప్ కిషన్- లావాణ్య త్రిపాఠీల క్రేజీ మర్డర్ మిస్టరీ మూవీ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యి ఏడేళ్లు అవుతోంది. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఓటీటీలోకి వస్తోంది. పైగా ఇది మంచి మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కావడం ఇంకో విశేషం. అయితే ఈ మూవీ ఎలా ఉంటుంది? ఏ ఓటీటీలోకి రాబోతోంది? అసలు ఆ మూవీ స్టోరీ ఏంటి? అంత మంచి పాయింట్ దీనిలో ఏముందో చూద్దాం.

సాధారణంగానే సందీప్ కిషన్ చాలా కొత్త కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. అయితే ఆ అలవాటు ఇప్పుడు వచ్చింది కాదు. మొదటి నుంచి అలాంటి ఒక భిన్నమైన కథలతోనే రాణిస్తూ ఉంటాడు. పైగా తమిళ్ లో కూడా సందీప్ కిషన్ కు మంచి ఫాలోయింగే ఉంది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న చిత్రం నిజానికి తమిళ్ చిత్రమే. అది థియేటర్లో విడుదలయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. మంచి హిట్టు మూవీగా నిలిచింది. అయితే ఆ తర్వాత తెలుగులోకి డబ్ చేశారు. కానీ, పెద్దగా ఆకట్టుకోలేదు అన్నారు. కానీ, ఓటీటీలో మాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చేస్తోంది.

ఈ మూవీలో సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తుంటాడు. అతను ఒక సీరియల్ కిల్లర్ వెంట పడుతూ ఉంటాడు. అది ఒక కాంప్లికేటెడ్ కేస్. సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఒక్కో హత్యకు ఒక మోటివ్ ఉంటుంది. ప్రతి మర్డర్ ఒకే ప్యాట్రన్ లో ఉంటుంది. ఈ హత్యలను ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అసలు వాళ్లు ఏం సాధించాలి అనుకుంటున్నాడు? అనే పాయింట్లపై సందీప్ కిషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అయితే పోలీస్ కంటే ఆ కిల్లర్ ఎక్కువ స్మార్ట్ కావడం వల్ల కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. మొత్తానికి కేస్ ఛేదించాడా? ఆ కిల్లర్ ని పట్టుకున్నాడా? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సింది. ఈ మూవీలో కెమెరా పనితనం బాగా నచ్చుంది.

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)

ఇప్పుడు చెప్పుకుంటున్న సందీప్ కిషన్- లావణ్య త్రిపాఠీల మర్డరీ మిస్టరీ క్రేజీ థ్రిల్లర్ పేరు ‘ప్రాజెక్ట్- Z’. నిజానికి ఇది ‘మాయావన్’ అనే తమిళ్ మూవీకి తెలుగు డబ్బింగ్ వర్షన్. ఈ మూవీ హిందీ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో.. తమిళ్ వర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తెలుగు వర్షన్ ప్రాజెక్ట్- Z మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మే 31 నుంచి ఈ మూవీ అందుబాటులోకి వస్తుంది అంటూ ఆహా సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మూవీ దాదాపుగా ఆరేళ్ల తర్వాత తెలుగు వర్షన్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీకి అప్పట్లో మంచి రెస్పాన్స్, పాజిటివ్ టాక్ వచ్చింది. మరి తెలుగు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి