iDreamPost
android-app
ios-app

OTT Best Horror Movie: ఈ సినిమా చూస్తే హోటల్ కు వెళ్లాలంటేనే భయమేస్తుంది.. OTT లో ఓ రేంజ్ హర్రర్ మూవీ

  • Published Jun 08, 2024 | 1:57 PMUpdated Jun 08, 2024 | 1:57 PM

OTT Movie Suggestion: ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలను ఎలాగూ చూస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను మాత్రం మిస్ చేసేస్తున్నారు మూవీ లవర్స్. మరి ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలను ఎలాగూ చూస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను మాత్రం మిస్ చేసేస్తున్నారు మూవీ లవర్స్. మరి ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 08, 2024 | 1:57 PMUpdated Jun 08, 2024 | 1:57 PM
OTT Best Horror Movie: ఈ సినిమా చూస్తే హోటల్ కు వెళ్లాలంటేనే భయమేస్తుంది..  OTT లో ఓ రేంజ్ హర్రర్ మూవీ

ఓటీటీ ప్రపంచంలో లెక్కకు మించిన సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులు అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు మిస్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఆ సినిమాల గురించి ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో అయినా చూసినప్పుడు ఆ సినిమాల కోసం సెర్చ్ చేసేస్తూ ఉంటారు మూవీ లవర్స్ . అటువంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం హర్రర్ మూవీ లవర్స్ కు బాగా నచ్చేస్తుంది. మరి ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం ఓ మంచి హర్రర్ మూవీని మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఖచ్చితంగా హర్రర్ సినిమాలంటే బాలీవుడ్ , ఇండోనేషియా ఫిల్మ్స్ ఏ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.. ఈ సినిమా కథేంటంటే.. సాధారణంగా ఇప్పటివరకు ఇంట్లో దెయ్యాలు ఉండడం, అలాగే హోటల్ లో దెయ్యాలు ఉండడం.. ఈ తరహా కథలను చూసే ఉంటారు. ఈ సినిమా కూడా ఇలాంటిదే కానీ కాస్త డిఫరెంట్. 1981 లో సెమరెంగ్ అనే సిటీలో ఓ ఫేమస్ హోటల్ ఉంటుంది. అక్కడ పనిచేయడానికి ఓ మహిళ వస్తుంది. ఆ హోటల్ ఓనర్ అయినా ఓ ముసలావిడా ఆ పనిమనిషికి.. కేవలం రెండు ఫ్లోర్స్ మాత్రమే క్లీన్ చేయమని మూడవ ఫ్లోర్ కి వెళ్లోద్దని చెప్తుంది. కానీ ఆ ఫ్లోర్ ఉంచి ఏవో సౌండ్స్ రావడంతో.. ఆ పనిమనిషి ఆ ఫ్లోర్ కు వెళ్తుంది, అక్కడ ఓ దెయ్యం ఉంటుంది, ఆ దెయ్యం ఆమెకు మూడు రోజుల టైమ్ ఇస్తుంది. ఆ తర్వాత ఆ పనిమనిషి వెంటనే ఆమె చనిపోతుంది.

కట్ చేస్తే కొన్ని డేస్ తర్వాత.. రైనా, ఫే అనే ఇద్దరు సిస్టర్స్ అదే హోటల్ కు వస్తారు. అది వాళ్ళ తండ్రి కట్టించిన హోటల్. ఆ హోటల్ ను రన్ చేసేది.. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, అయితే ఆ ఇద్దరు మనవరాళ్ళకు కూడా ఆ ముసలావిడ.. మూడవ ఫ్లోర్ కు వెళ్లోద్దని చెప్తుంది. అయినా కూడా ఓ రోజు వారిద్దరూ కలిసి ఆ మూడవ ఫ్లోర్ కి వెళ్తారు. అక్కడ ఓ దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం వాళ్లకు కూడా మూడున్నర రోజులు సమయం ఇస్తుంది. ఈ క్రమంలో వారు ఆ పనిమనిషి చనిపోయిన విషయాన్నీ తెలుకుని., వాళ్ళ అమ్మమ్మ , తాతయ్యను ప్రశ్నిస్తారు. దీనితో అక్కడ ఆ దెయ్యం ఉందన్న సంగతి ముందే తెలుసనీ.. కానీ దానిని అక్కడ నుంచి ఎలా పంపించాలో మాత్రం వారికి తెలియదని వారు చెప్తారు.

దీనితో అంతా కలిసి ఆ దెయ్యాన్ని ఎలా అయిన అక్కడ నుంచి పంపించేయాలని అనుకుంటారు. దాని కోసం ప్రయత్నం చేసే క్రమంలో అక్కడ వారికి ఓ చించేసిన లెటర్ కనిపిస్తుంది. దాని ద్వారా ఆ దెయ్యం పేరు జాస్మిన్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆమె గురించి ఆరా తీయడం స్టార్ట్ చేస్తారు. అసలు ఎవరు ఈ జాస్మిన్, ఎందుకు దెయ్యంగా మారింది ! ఎందుకు మూడు రోజులు టైమ్ ఇచ్చి మరి వాళ్ళని చంపేస్తుంది ! ఈ సిస్టర్స్ ను కూడా ఆ దెయ్యానికి బలి అవుతారా ! ఏమో ఇవన్నీ తెలియాలంటే “ది హాంటెడ్ హోటల్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి