iDreamPost

OTT Best Horror Thriller: అబ్బాయిలను మాత్రమే టార్గెట్ చేసే దెయ్యం.. OTT లో వణుకు పుట్టించే మూవీ

  • Published Jun 11, 2024 | 3:14 PMUpdated Jun 11, 2024 | 3:14 PM

ఓటీటీ లో ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసిన ప్రేక్షకులకు.. ఇంకా కొన్ని సినిమాలు బ్యాలన్స్ ఉన్నాయంటూ.. గుర్తు చేస్తుంటాయి. కొన్ని సినిమాలు ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదా మిస్ చేశారో.. ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసిన ప్రేక్షకులకు.. ఇంకా కొన్ని సినిమాలు బ్యాలన్స్ ఉన్నాయంటూ.. గుర్తు చేస్తుంటాయి. కొన్ని సినిమాలు ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదా మిస్ చేశారో.. ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 11, 2024 | 3:14 PMUpdated Jun 11, 2024 | 3:14 PM
OTT Best Horror Thriller: అబ్బాయిలను మాత్రమే టార్గెట్ చేసే దెయ్యం.. OTT లో వణుకు పుట్టించే మూవీ

దెయ్యం కథల గురించి తెలుసుకోవాలని… అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా అని టెస్ట్ చేయడానికైనా.. కొంతమంది ఈ దెయ్యాల సినిమాల మీద .. దెయ్యాల కథల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . మాంత్రికులు భయపెట్టే దెయ్యాలు కొన్నైతే.. మాంత్రికులనే భయపెట్టే దెయ్యాలు మరికొన్ని . ఇలా దెయ్యం కథలు రకరకాలుగా ఉంటాయి. ఓటీటీ లో ఇప్పటివరకు ఉన్న హర్రర్ సినిమాలన్నిటిని చూసేశాం అనుకునే ప్రేక్షకులకు ఇంకా కొన్ని సినిమాలు బ్యాలన్స్ ఉన్నాయంటూ ..గుర్తు చేస్తుంటాయి కొన్ని సినిమాలు .. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ కోవకు చెందిందే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమాపై కొంచెం అయినా ఇంట్రెస్ట్ రావాలంటే.. ఈ సినిమా స్టోరీ లైన్ కొంచెం అయినా తెలుసుకోవాలి. ఈ సినిమా కథ అంతా కూడా ఓ చెరువు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ నీళ్లలో దెయ్యం ఉంటుంది. నీళ్లలో దెయ్యాలు ఉండే కథలు ఇప్పటివరకు చాలానే చూసి ఉంటారు. కానీ ఈ కథ మాత్రం చాలా డిఫ్ఫరెంట్. ఓ చెరువులో ఓ దెయ్యం ఉంటుంది. ఎవరైనా అబ్బాయిలు ఆ చెరువు దగ్గరకు వెళ్తే.. ఆ దెయ్యం ఆ అబ్బాయిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. పెళ్లి చేసుకుంటాను అని చెప్తే తనతో పాటు వారిని లేక్ లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఒకవేళ కాదంటే వారిని చంపేస్తుంది. అయితే ఓ రోజు భార్య భర్తలు అక్కడ నిలబడి లేక్ వైపు చూస్తూ ఉంటారు. ఉన్నట్లుండి.. అక్కడ నిలబడి ఉన్న ఆ వ్యక్తిని చెరువులోకి లాగేసుకుంటుంది ఆ దెయ్యం. తన భర్తను కాపాడదాం అని ప్రయత్నించిన భార్య కూడా తన ప్రాణాలను కోల్పోతుంది. కట్ చేస్తే అక్కడ మరొక కథను చూపిస్తారు మేకర్స్.

మారినా , రోమా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. దీనితో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా.. వాళ్ళను పార్టీ అడుగుతారు. దీనితో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ లేక్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో రోమా ఆ లేక్ లో దిగి స్విమ్మింగ్ చేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు ఓ అమ్మాయి వస్తుంది. రోమాకు తెలియకుండానే ఆ అమ్మాయి అందానికి అట్ట్రాక్ట్ అయిపోయి.. ముద్దు పెట్టేసుకుని స్పృహ తప్పి పడిపోతాడు. ఆ నెక్స్ట్ డే అతని బట్టల్లో ఆ అమ్మాయి దువ్వెన దొరుకుతుంది. దానిని మరీనా కూడా చూస్తుంది కానీ అంతగా పట్టించుకోదు. ఆ తర్వాత రోమాకు జ్వరం వస్తుంది . మరీనా తన దగ్గరకు వచ్చి చూసుకుందాం అనుకుంటే.. రోమా తనని ఆ లేక్ దగ్గర వచ్చిన అమ్మాయిగా ఊహించుకుని.. తనని దూరం పెడతాడు.

దీనితో మారినా చాలా బాధపడుతుంది. అంతే కాకుండా రోమా బట్టలో దొరికిన ఆ దువ్వెన గురించి రోమా అక్కకు చెప్తుంది. అది చూసిన రోమా అక్క అది వాళ్ళ అమ్మ దువ్వెన అని తెలుసుకుని ఆశ్చర్య పడుతుంది. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పదు. అప్పటినుంచి ఆ దెయ్యం రోమాను వేధిస్తూనే ఉంటుంది. దీనితో రోమా అక్క తన తండ్రికి ఈ విషయాన్నీ చెబుదాం అనుకుంటుంది. తన తండ్రి ఎవరు! సినిమా మొదట్లో చూపించిన భార్య భర్తలకు.. ఇప్పుడు జరుగుతున్న సంఘటలకు ఏమైనా సంబంధం ఉందా ! ఆ దెయ్యం ఎందుకు అలా ప్రవర్తిస్తుంది ! ఎందుకు కావాలని అబ్బాయిలని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఇవన్నీ తెలియాలంటే “ది మెర్మెయిడ్ లేక్ ఆఫ్ ది డెడ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే . ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి