iDreamPost

OTTలో బెస్ట్ సైబర్ క్రైమ్ డ్రామా! ఈ రేంజ్ హ్యాకింగ్ మీ లైఫ్ లో చూసి ఉండరు!

OTT Movie Suggestions- Best Cyber Crime Thriller Movie: ఓటీటీలో చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ చూసి ఉంటారు. కానీ, ఇలాంటి ఒక సైబర్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ మాత్రం చూసి ఉండరు. ఈ సినిమాకి మీకు బుర్ర హీటెక్కి పోతుంది. మన డేటా అసలు భద్రం కాదా అనే భయం మొదలవుతుంది.

OTT Movie Suggestions- Best Cyber Crime Thriller Movie: ఓటీటీలో చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ చూసి ఉంటారు. కానీ, ఇలాంటి ఒక సైబర్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ మాత్రం చూసి ఉండరు. ఈ సినిమాకి మీకు బుర్ర హీటెక్కి పోతుంది. మన డేటా అసలు భద్రం కాదా అనే భయం మొదలవుతుంది.

OTTలో బెస్ట్ సైబర్ క్రైమ్ డ్రామా! ఈ రేంజ్ హ్యాకింగ్ మీ లైఫ్ లో చూసి ఉండరు!

ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు అనే మాట బాగా వింటున్నారు. అంటే మీకు సంబంధించిన వివరాలు అన్నీ సేకరించి వాళ్లు మీ ప్రమేయం లేకుండానే మీ పేరిట మోసాలు చేస్తారు. ఈ మోసాలు దాదాపుగా ఆర్థిక సంబంధమే ఉంటాయి. అంటే మీ నుంచి మీకు తెలియకుండానే మీ డబ్బు లాగేసుకుంటారు. అలా మిమ్మల్ని వివిధ రూపాల్లో మోసం చేస్తూ ఉంటారు. అలాంటి పాయింట్ మీద గతంలో కూడా టాలీవుడ్ మంచి సినిమాలే వచ్చాయి. కానీ, ఇది మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి ఒక మూవీని మీరు చూసి ఉండరు. ఎందుకంటే ఒక్కో సీన్ కి మీకు పిచ్చెక్కిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. మీ అంచనాలను మించి పోతుంది.

మీరు సాధారణంగా ఇలాంటి సైబర్ క్రైమ్ వార్తలు చాలానే చూసి ఉంటారు. చాలానే విని ఉంటారు. కానీ, ఇది మాత్రం నెక్ట్స్ లెవల్ క్రైమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ కుర్రాడు ఇచ్చే షాక్ ఆ రేంజ్ లో ఉంటుంది. అతని దగ్గర అందరి డేటా ఉంటుంది. ముఖ్యంగా పోలీసులు, రాజకీయ నేతలు, ప్రముఖులు అందరి డేటాని కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు. ఆ తర్వాత అతని స్కెచ్ ని అమలు చేస్తాడు. ఆ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. “నువ్వు 5 నిమిషాల టైమ్ ఇస్తే.. నువ్వు వేసుకో చొక్కా- ప్యాంటు సైజే కాదు.. నీ చెడ్డీ సైజ్ కూడా చెప్పేస్తాడు” ఈ డైలాగ్ తోనే ఈ మూవీలో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పచ్చు. అతని దగ్గర మీరు ఏ విషయాన్ని దాచలేరు. ప్రతిది పక్కాగా ప్లాన్ చేసి అందరినీ టార్గెట్ చేస్తాడు. ఈ మూవీలో హీరో పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎవరూ ఉండరు.

Ghoolte

ఒక్కడే పెరుగుతాడు. ఒక్కడే ఉంటాడు. ఈ నేరాలు కూడా ఒక్కడే చేస్తాడు. ఒక కంపెనీకి వైరస్ ఎక్కించిన తర్వాత అసలు అతను ఎవరు అనే విషయంపై పోలీసులు ఫోకస్ పెడతారు. అతడిని పట్టుకుటారు కూడా. కానీ, కస్టడీలో పోలీసులు ఎంత కొట్టినా నోరు మాత్రం తెరవడు కదా.. రివర్స్ లో పోలీసులనే బెదిరిస్తాడు. అతడిని పోలీసులు కూడా ఏం చేయలేకపోతారు. అయితే ఇలాంటి వాడికి అందరి సమాచారం ఎందుకు? అలా ఎందుకు మనుషులను టార్గెట్ చేశాడు? పోలీసులను కూడా ఎందుకు పరుగులు పెట్టిస్తున్నాడు? అనేదే అసలు కథ. ఈ సినిమా పేరు గల్టూ.. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అందుబాటులో ఉంది. సైబర్ క్రైమ్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది బాగా నచ్చుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి