iDreamPost

పుష్ప జాలి రెడ్డి సినిమా OTTలోకి.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా!

పుష్ప మూవీలో జాలి రెడ్డిగా అలరించిన ధనంజయ్.. హీరోగా తెరకెక్కించిన ఓ మూవీ ఇప్పుడు ఓటీటీలో అలరిస్తుంది. పుష్పలో విలన్ పాత్రలో మెప్పించిన ధనంజయ్.. ఈ సారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెస్మరైజ్ చేశాడు. ఇంతకు ఆ మూవీ ఏంటంటే..?

పుష్ప మూవీలో జాలి రెడ్డిగా అలరించిన ధనంజయ్.. హీరోగా తెరకెక్కించిన ఓ మూవీ ఇప్పుడు ఓటీటీలో అలరిస్తుంది. పుష్పలో విలన్ పాత్రలో మెప్పించిన ధనంజయ్.. ఈ సారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెస్మరైజ్ చేశాడు. ఇంతకు ఆ మూవీ ఏంటంటే..?

పుష్ప జాలి రెడ్డి సినిమా OTTలోకి.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా!

థియేటరల్లో సినిమాలు చూసి ఎంజాయ్ చేయడం ఓ ఎత్తైతే..ఓటీటీలో మూవీస్ చూస్తే చిల్ కావడం మరో ఎత్తు. అందులోనూ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, యాక్షన్ మూవీస్ అయితే ఎన్ని పనులు ఉన్నా ఆపుకుని మరీ చూడాలనిపిస్తుంది. ఎందుంకటే.. ఆ సినిమాల్లో ఉండే క్యూరియాసిటీ అలాంటిది మరి. చిన్న సీన్ మిస్సైతే..లాజిక్ మిస్ అయిపోతామన్న ఆందోళన నెలకొంటుంది. టీవీ, సెల్ ఫోన్ పాజ్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా.. నరాలు తెగ్గొట్టే ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే.. ఆ పని చేయలేం. ఇప్పుడు అలాంటి ఓ మూవీ ఓటీటీలో మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. అలాంటి ఓ కన్నడ క్రైమ్ మూవీ.. తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇటీవల ఓ టీవీ ఛానల్లో అలరించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

గత ఏడాది కన్నడలో రిలీజై..మంచి రివ్యూ రాబట్టుకున్న చిత్రం గురుదేవ్ హోయసల. పుష్ప సినిమాలో జాలి రెడ్డిగా నటించిన ధనంజయ్ ఈ మూవీకి హీరో. గత ఏడాది మార్చి 30న విడుదలయ్యింది ఈ మూవీ. ఇందులో అమృతా అయ్యంగార్ హీరోయిన్. కేఆర్జీ స్టూడియో పతాకంపై కార్తీక్ గౌడ, యోగి జి రాజ్ నిర్మాతలు. విజయ్ నాగేంద్ర దర్శకుడు. కాంతార, మంగళవారం, విరూపాక్షకు మ్యూజిక్ అందించిన బి. అంజీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు బాణీలు అందించాడు. ఇప్పటి వరకు కన్నడలోని అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీ.. ఇప్పుడు తెలుగులో కూడా ఎవిలబుల్‌గా ఉంది. ఇదే ఓటీటీ ఫ్లాట్ ఫాంలో తెలుగులో అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఎందుకు జాలి రెడ్డిగా తన విలనిజాన్ని పండించిన ధనుంజయ్. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

ఇక కథ విషయానికి వస్తే..ఇసుక మాఫియా గురించి అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న ఎస్ఐ భార్గవ్ కనిపించకుండా పోతాడు. అతడి ప్లేసులోకి ఇన్ స్పెక్టర్ గురుదేవ్ హోయసలను నియమిస్తారు ఉన్నతాధికారులు. అదే సమయంలో అతడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తాడు. అమ్మాయి ఫాదర్ ఓ రౌడీ. ఓ కేసు గురించి వెళ్లిన గురుదేవ్.. మరో వివాదంలో చిక్కుకుంటాడు. ఇంతకు భార్గవ్‌ను చంపిదెవరు.. ఈ సమస్యల నుండి మన హీరో ఎలా గట్టెక్కాడు అనేది మిగిలిన కథ. ఇందులో జాలి రెడ్డి అలియాస్ ధనంజయ్.. పవర్ ప్యాక్ట్ యాక్షన్ సన్నివేశాల్లో ఉతికి ఆరేస్తాడు. ఓవరాల్‌గా వన్ ఆర్ టూ టైం వాచబుల్ మూవీ. మీరు అమెజాన్ ప్రైంలో తెలుగులో వాచ్ చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి