iDreamPost

OTTలోకి ఓం భీమ్ బుష్.. అనుకున్న‌దానికంటే ముందుగానే!

  • Published Mar 30, 2024 | 2:38 PMUpdated Mar 30, 2024 | 2:38 PM

ఓటీటీ లలో కామెడీ హర్రర్ సినిమాలకు ఉండే ఆధారణ అంత ఇంత కాదు. ఈ క్రమంలోనే శ్రీ విష్ణు నటించిన కామెడీ హర్రర్ ఎంటర్టైనర్.. "ఓం భీమ్ బుష్" సినిమా అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.

ఓటీటీ లలో కామెడీ హర్రర్ సినిమాలకు ఉండే ఆధారణ అంత ఇంత కాదు. ఈ క్రమంలోనే శ్రీ విష్ణు నటించిన కామెడీ హర్రర్ ఎంటర్టైనర్.. "ఓం భీమ్ బుష్" సినిమా అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.

  • Published Mar 30, 2024 | 2:38 PMUpdated Mar 30, 2024 | 2:38 PM
OTTలోకి ఓం భీమ్ బుష్.. అనుకున్న‌దానికంటే ముందుగానే!

కామెడీ సినిమాలంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. ఎంచక్కా ఫ్యామిలీ అంత కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ.. మనసారా నవ్వుకుంటూ ఉంటారు. అందులోను హర్రర్ కామెడీ సినిమాలంటే మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటాయి. అందుకే ఈ జోనర్ కు సంబంధించిన సినిమాలన్నీ కూడా బాగా హిట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే శ్రీ విష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించిన “ఓం భీమ్ బుష్” సినిమా .. మార్చి 22న థియేటర్ లో రిలీజ్ అయ్యి.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా విచిత్రంగా చేయడంతో.. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి బాగా బజ్ నడిచింది. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా.. మంచి ధరకే అమ్ముడుపోయినట్లు సమాచారం. అయితే, ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే ఓటీటీ లో ప్రసారం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

కాగా, “ఓం భీం బుష్” సినిమాకు శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా తొమ్మిదిన్న‌ర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి.. ప‌ది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక వారం రోజులలో ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప‌దిహారు కోట్ల‌కుపైగా గ్రాస్‌ను, ఎనిమిది కోట్ల యాభై ల‌క్ష‌ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. ఇక ఈ వారం టిల్లు స్క్వేర్ మ్యానియా కొనసాగుతోంది కాబట్టి.. ప్రస్తుతం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు మ‌రో కోటిన్న‌ర దూరంలో ఆగిపోయింది. అయితే, “ఓం భీమ్ బుష్” సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే.. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసుకుంది. ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం సినిమా రీలిజ్ అయినా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాలి. కానీ, కొన్ని సినిమాలు థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీ లో ప్రసారం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు “ఓం భీమ్ బుష్” సినిమా కూడా ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

Om Beam Bush into OTT!

ఇక ఓం భీమ్ బుష్ కథ విషయానికొస్తే.. ముగ్గురు స్నేహితుల మధ్య సాగే కథ ఇది. ముగ్గురు స్నేహితులు భైరవపురం గ్రామంలోకి వచ్చాక.. బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సొల్యూషన్స్‌ను ఎస్టాబ్లిష్ చేస్తారు. అలా ప్రతి సమస్యకు పరిష్కారంగా ట్యాబ్లెట్లతో పౌడర్ తయారు చేసి గ్రామస్తులకు అమ్ముతుంటారు. కొంతకాలానికి వారు వ్యాపారంలో బాగా రాణిస్తున్న క్రమంలో.. కొంతమంది అఘోరాలు ఆ గ్రామంలోకి ప్రవేశించి.. ఓ మహల్ లో ఉండే నిధిని కనుక్కోమని సవాల్ చేస్తారు. దీనితో ఆ ముగ్గురు స్నేహితులు ఆ వేటలో ఉంటారు. ఈ క్రమంలో వారు ఎటువంటి విచిత్ర సంఘటనలను ఎదుర్కొన్నారు! వారికి ఆ నిధి దొరికిందా లేదా! అసలు వారు ఆ ఛాలెంజ్ ను ఎందుకు తీసుకుంటారు! ఇవన్నీ చూడాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి, “ఓం భీమ్ బుష్” సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి