iDreamPost

ఈ పాప.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ క్యారెక్టర్లతో దూసుకెళుతోంది

స్మాల్ స్క్రీన్ పై మెరిసిన ముద్దుగుమ్మలు.. వెండితెరపైకి వచ్చి సత్తా చాటుతున్నారు. ఇదిగో ఈ ఫోటోలో చిన్నారి కూడా ఆ కోవకే వస్తుంది. బాలీవుడ్ బుల్లితెరపై హవా చూపి.. ఇప్పుడు తెలుగు వెండితెరను ఏలేందుకు సిద్ధమైంది.

స్మాల్ స్క్రీన్ పై మెరిసిన ముద్దుగుమ్మలు.. వెండితెరపైకి వచ్చి సత్తా చాటుతున్నారు. ఇదిగో ఈ ఫోటోలో చిన్నారి కూడా ఆ కోవకే వస్తుంది. బాలీవుడ్ బుల్లితెరపై హవా చూపి.. ఇప్పుడు తెలుగు వెండితెరను ఏలేందుకు సిద్ధమైంది.

ఈ పాప.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ క్యారెక్టర్లతో దూసుకెళుతోంది

బుల్లితెర నుండి ఎంతో మంది నటీమణులు.. వెండితెరపై తమ సత్తాను చాటుతున్నారు. స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలంటే సినిమాలే సరైన దారి అని బలంగా నమ్ముతున్న నేపథ్యంలో తమ లక్ పరీక్షించుకునేందుకు ఇటు వైపుగా అడుగులు వేస్తున్నారు. స్మాల్ స్క్రీన్లపై నటనకు మాత్రమే స్కోప్ ఉంటుంది. బిగ్ స్క్రీన్ పై నటనతో పాటు గ్లామర్ ఒలకబోయడానికి ఛాన్స్ దక్కుతుంది. . అందుకే సీరియల్ యాక్టర్స్ కూడా వెండితెరపైకి వస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సీరియల్ హీరోయిన్స్.. వెండితెరపైకి అడుగుపెట్టి సక్సెస్ పొందుతున్న సంగతి విదితమే. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ బుల్లితెర నుండి వచ్చి స్టార్ హీరోయిన్ అయ్యింది. అలాగే నాగిని సీరియల్‌తో ఫేమస్ అయిన మౌనీరాయ్ కూడా బిగ్ స్క్రీన్ పై స్కిన్ షో చేస్తుంది.

ఇదిగో ఈ ఫోటోలోని పాప కూడా బాలీవుడ్ స్మాల్ స్క్రీన్ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి హవా సాగిస్తుంది. ఇటీవల వరుస సినిమాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆమె తెరపై కనిపిస్తున్న అందాలు ఆరబోయాల్సిందే. ఇంతకు ఆ చిన్నారి ఇప్పుడెవరంటే.. ఆయేషా ఖాన్. బాలీవుడ్‌లో బుల్లితెరపై కెరీర్ స్టార్ చేసి.. టీటౌన్‌లో బోల్డ్ పాత్రలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆయేషా తల్లిదండ్రులదీ బీహార్. అక్కడే పుట్టిన ఈ అప్పరస.. ముంబయిలో పెరిగింది. చిన్నప్పటి నుండి స్టేజ్ షోలు ఇచ్చేది భామ. ఆమె తొలుత మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. తొలుత పంజాబీలో మ్యూజిక్‌ ఆల్బమ్స్ చేసింది. హిందీ పాపులర్ సీరియల్ ‘కసౌటి జిందగీ’లో జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. ఆ తర్వాత ‘బాల్‌వీర్ రిటర్న్స్’లో నటించే ఛాన్స్ వచ్చింది.

అలా సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ‘ఖతరోన్‌ కా ఖిలాడి’ సీజన్ 14లో అవకాశం వచ్చింది. దీంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. కానీ ఆమె అందరికీ రీచ్ అయ్యింది. హిందీ బిగ్ బాస్ షోతో. 2023లో ‘బిగ్ బాస్’ సీజన్-17లో అయేషాకు ఛాన్స్ వచ్చింది. అయితే ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 64వ రోజు బిగ్ బాస్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత 97వ రోజు ఎలిమినేటర్ అయ్యింది. అంతకు ముందే ఆమె తెలుగులో ముఖ చిత్రం అనే మూవీ చేసింది. ఇందులో విశ్వక్ సేన్ కీలక పాత్రలో కనిపిస్తాడు. అలాగే గుట్టు చప్పుడు అనే మూవీలో కూడా యాక్ట్ చేసింది. ఆయేషా కేవలం ఐటెమ్ సాంగ్స్ మాత్రమే కాకుండా సెకండ్ హీరోయిన్, స్పెషల్ క్యారెక్టర్స్ వరకు.. ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ భామ. ఇటీవల ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే చిత్రాలతో కనువిందు చేసింది. దుల్కర్ సల్మాన్ నటిస్తూన్న ‘లక్కీ భాస్కర్’లో కూడా అయేషా ఖాన్ నటించింది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి