iDreamPost
android-app
ios-app

విషాదం: గ్రామంలో నా పరువు పోయిందంటూ..!

విషాదం: గ్రామంలో నా పరువు పోయిందంటూ..!

నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నా పరువు పోయిందని భావించిన ఓ పెళ్లైన మహిళ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ పరిధిలోని రాజ్ నగర్ దుబ్బా గ్రామంలో చిత్తరి లక్ష్మి (21) అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే ఇదే గ్రామానికి చెందిన దుశెట్టి జమున అనే మహిళ ఇంట్లో డబ్బులు పోవడంతో చిత్తరి లక్ష్మి మీద అనుమానం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా లక్ష్మే నా డబ్బులు తీసిందని ఊర్లో ఆమె పరువు తీసింది. ఇంతే కాకుండా లక్ష్మిని ఇష్టమొచ్చినట్లుగా తిడుతూ నా డబ్బులు ఇవ్వకుంటే చచ్చిపో అంటూ అవమానకరంగా మాట్లాడింది. దీంతో ఊర్లో నా పరువు పోయిందని భావించిన లక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఇక ఎవరూ లేని టైమ్ చూసి లక్ష్మి ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. చేయని దొంగతనం మోపారని అవమానంతో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.