iDreamPost
android-app
ios-app

విషాదం.. రోడ్డు ప్రమాదంలో డ్యాన్సర్ దుర్మరణం!

  • Published Sep 27, 2023 | 10:03 AM Updated Updated Sep 27, 2023 | 10:03 AM
  • Published Sep 27, 2023 | 10:03 AMUpdated Sep 27, 2023 | 10:03 AM
విషాదం.. రోడ్డు ప్రమాదంలో డ్యాన్సర్ దుర్మరణం!

ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుభవం లేకుండా డ్రైవింగ్ చేయడం, అకస్మాత్తుగా టైర్లు పేలిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినం చేస్తున్నా ప్రమాదాలు మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి స్థంబాన్ని ఢీకొట్టడంతో డ్యాన్సర్ మృతి చెందింది. ఈ ఘటన పల్నాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పల్నాడు జిల్లా రొంపిచర్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న ఓ డ్యాన్సర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో సోమవారం రాత్రి బీసీ కాలనీలో వినాయక మండపం వద్ద నరసరావు పేటకి చెందిన సోనీ ఈవెంట్స్ వారు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అశ్విని (20) వచ్చింది. ప్రోగ్రామ్ ముగించుకొని డ్యాన్సర్ అశ్విని తన స్నేహితుడు మున్నాతో ద్విచక్ర వాహనంపై తిరిగి నరసరావుపేటకు బయలుదేరింది.

తుంగపాడు చప్టా వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న స్థంబాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన కాలువలో పడి తీవ్ర గాయాలతో అశ్విని అక్కడిక్కడే మృతి చెందింది. మున్నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాలువలో పడిన అశ్విని మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతురాలు వరంగల్ నగరానికి చెందిన యువతిగా గుర్తించారు. అశ్విని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom