iDreamPost

Nita Ambani: చిన్న కోడలికి నీతా అంబానీ ఖరీదైన గిఫ్ట్‌.. ఏకంగా 640 కోట్లు విలువైన

  • Published May 25, 2024 | 3:40 PMUpdated May 25, 2024 | 3:40 PM

Radhika: ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ భార్య.. నీతా అంబానీ కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్‌కు ఖరీదైన బహుమతి ఇచ్చారంట. ఆ వివరాలు..

Radhika: ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ భార్య.. నీతా అంబానీ కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్‌కు ఖరీదైన బహుమతి ఇచ్చారంట. ఆ వివరాలు..

  • Published May 25, 2024 | 3:40 PMUpdated May 25, 2024 | 3:40 PM
Nita Ambani: చిన్న కోడలికి నీతా అంబానీ ఖరీదైన గిఫ్ట్‌.. ఏకంగా 640 కోట్లు విలువైన

అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌, నీతా అంబానీ ఇంట వేడుక అంటే మీడియా, సోషల్‌ మీడియాలో దాని గురించే వార్తలు వెల్లువెత్తుతాయి. ఇక మిగతా ప్రపంచ కుబేరులకు సాధ్యం కాని రీతిలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఖరీదైన బహుమతులు గిఫ్ట్‌గా ఇస్తుంటారు. ఇక తాజాగా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్‌ వేడుక సందర్భంగా అనేక ఖరీదైన బహుమతులను కాబోయో దంపతులకు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో తాజాగా నీతా అంబానీ కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్‌కి ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారట. దీని విలువ ఏకంగా 640 కోట్ల రూపాయలు అని సమాచారం. ఆ వివరాలు..

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా, ఎన్‌ఎంఏసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నీతా అంబానీ కాబోయో చిన్న కోడలు రాధికా మర్చంట్‌ కోసం.. దుబాయ్‌లో 640 కోట్ల విల్లాను గిఫ్ట్‌గా అందించనున్నారు. ఇందులో 10 విలాసవంతమైన బెడ్‌రూమ్‌లు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయి, అద్భుతమైన కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి అని తెలుస్తోంది. ఇంకా ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విల్లాకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా ముఖేష్‌ అంబానీ.. చిన్న కొడుకు అనంత్‌కు ఏకంగా రూ.4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్ గా అందించారు. అలాగే కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కి ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కలశాలు సహా పలు నగలు కానుకగా అందించారట. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నెక్లెస్ సైతం రాధికాకు బహుమతిగా అందించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పెళ్లికి ఏకంగా 640 కోట్ల రూపాయల విలువైన విల్లాను బహుమతిగా ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Nita ambani 650 cr luxury villa gift to his 2nd daghter in law

అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌లది ప్రేమ వివాహం. వీరిద్దరూ 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల గుజరాత్‌లో జామ్‌ నగర్‌లో ప్రీవెడ్డింగ్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. హస్తాక్షర్‌ వేడుకలో తమ ప్రేమపై సంతకాలుకూడా చేశారు. అటు పెళ్లి వేడుకలు కూడా పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది జూలైలో వీరిద్దరూ ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ వేడుకలను ఎంత ఘనంగా నిర్వహిస్తారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి